ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం
పగిడాల: కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన జిల్లాలోని పగిడాల మండలం రాచకొండలో ఆదివారం వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన ఓ మహిళ తను ముగ్గురు పిల్లలతో పాటు పురుగుల మందు కలిపిన ఆహారం తిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. నలగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.