mothkupalli narasimhulu
-
ఎన్టీఆర్ శతజయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రాజకీయ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, టాలీవుడ్ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్ఘాట్ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలుగు గడ్డ తరపున నందమూరి తారక రామారావు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో మే 28 -2022 నుంచి మే 28 -2023 వరకు ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెం పై ముద్రణ చేసే విధంగా అర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా.. నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరిస్తాం అని పేర్కొన్నారామె. ఆపై టీఆర్ఎస్ నాయకులు- మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నామా నాగేశ్వరరావులు నివాళులు అర్పించి.. భారతరత్న డిమాండ్ వినిపించారు. ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. ప్రధాని మంత్రి కావాల్సిన అర్హతలున్న వ్యక్తి. కానీ, కాస్తలో అది జరగలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ వినిపించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అదృష్టం. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనకు తారాస్థాయిలో అభిమానులు ఉన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని నామ నాగేశ్వరావు అన్నారు. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. మహా నాయకుడి స్ఫూర్తిని తీసుకోని సీఎం కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు అందులో భాగమే. నా వివాహానికి వచ్చారు.. నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు. -
దళితబంధు చైర్మన్‌గా.. మోత్కుపల్లి..!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు రోజుకో వ్యూహాన్ని తెరమీదకు తెస్తున్నారు. దళితబంధు పథకం, ఇతర పార్టీల నుంచి చేరికలు, అభ్యర్థి ఖరారుపై కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్.. రాజకీయ నిర్ణయాల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇటీవల దూకుడు పెంచిన జాతీయ పార్టీలకు కళ్లెం వేయడం, తెరమీదకు కొత్తగా వస్తున్న రాజకీయ శక్తులకు చెక్ పెట్టడం లక్ష్యంగా సరికొత్త అస్త్రాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ‘దళితబంధు’ పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించి, దానికి చైర్మన్‌గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మోత్కుపల్లి నర్సింహులు ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసినా అధికారికంగా టీఆర్ఎస్లో చేరలేదు. ఇది వ్యూహాత్మకంగానే వాయిదా పడిందని, కొద్దిరోజులుగా కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న మోత్కుపల్లి టీఆర్ఎస్ ఆహ్వానం విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ‘దళిత బంధు’ ప్రకటన తర్వాత విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, సవాళ్లకు మంత్రివర్గ విస్తరణ ద్వారా చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని.. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే కేబినెట్లో మార్పులు జరగవచ్చని వెల్లడిస్తున్నాయి. మంత్రివర్గంలో ఎస్సీల ప్రాతినిధ్యం పెంపు రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవలి వరకు సీఎం కేసీఆర్ సహా 17 మంది ఉండగా.. ఈటల రాజేందర్ తొలగింపు తర్వాత 16 మందితో కొనసాగుతోంది. ఇందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ (మాల సామాజికవర్గం) ఒక్కరే కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజికవర్గం ప్రాతినిధ్యం పెంచాలని.. మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. శాసనసభలో ఎస్సీ కేటగిరీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 18 మంది టీఆర్ఎస్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది మాల, తొమ్మిది మంది మాదిగ సామాజిక వర్గం వారుకాగా.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతకాని సామాజికవర్గానికి చెందినవారు. తాజా విస్తరణలో కొత్తగా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. వారికి సంబంధించి నిఘా వర్గాల నుంచి సమాచారం ముఖ్యమంత్రికి చేరిందని సమాచారం. విపక్షాలు, కొత్త శక్తులకు కళ్లెం వేసేలా.. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇటీవల రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెంచాయి. క్షేత్రస్థాయిలో కార్యాచరణను ప్రకటించాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ పేరిట భారీ సభ నిర్వహించగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇటీవల బీఎస్పీలో చేరగా.. వైఎస్సార్టీపీ, తీన్మార్ మల్లన్న వంటి కొత్త రాజకీయ శక్తులు కూడా వివిధ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. చురుగ్గా మారిన జాతీయ పార్టీలు, కొత్త రాజకీయ శక్తులకు కళ్లెం వేసేందుకు ప్రత్యేక వ్యూహం అవసరమని సీఎం కేసీఆర్ ఇప్పటికే అంచనాకు వచ్చారని.. ఆయా పార్టీలు, వ్యక్తులను ఆత్మరక్షణలోకి నెట్టేలా ‘దళితబంధు’, మంత్రివర్గంలో ఎస్సీలకు ప్రాతినిధ్యం పెంపు వంటివాటిని తెరపైకి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ‘దళిత బంధు’ అవగాహన పేరిట జిల్లాలు, నియోజకవర్గాల వారీగా భారీ సదస్సులు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికపైనా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తద్వారా విపక్షాల పాదయాత్రలు, సభలు, ఆందోళనా కార్యక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆత్మరక్షణలోకి నెట్టేలా.. బీజేపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ శక్తులు విస్తృత కార్యాచరణకు దిగుతున్నాయి. అన్నీ దళిత అంశాలను లేవనెత్తుతున్నాయి. వాటిని ఆత్మరక్షణలోకి నెట్టేలా దళిత బంధు చైర్మన్, ఎస్సీలకు మంత్రి పదవులు వంటి కొత్త అస్త్రాలను సీఎం కేసీఆర్ తెరపైకి తెస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. యువ ఎమ్మెల్యేలకు చాన్స్ ఎస్సీ సామాజికవర్గం నుంచి యువ ఎమ్మెల్యేలకు కేబినెట్ అవకాశమిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సీఎం లెక్కలు వేస్తున్నట్టు తెలిసింది. గతంలో మాదిరిగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మంత్రుల్లో ఒకరికి డిప్యూటీ సీఎం హోదా కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
‘ఈటల ఆక్రమించిన దళిత భూములు తిరిగి ఇవ్వాలి : మోత్కుపల్లి
-
ముహూర్తమే తరువాయి!
సాక్షి, హైదరాబాద్: కారు సిద్ధంగా ఉంది.. కారెక్కడానికి ఆయన కూడా సుముఖంగా ఉన్నారు.. ఇక ముహూర్తమే తరువాయి.. బీజేపీకి రెండురోజుల క్రితం రాజీనామా చేసిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ‘దళితబంధు’పై ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మోత్కుపల్లి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరిక అంశం ప్రస్తావనకు రాగా, బీజేపీలో తనకు గౌరవం లేదనే అభిప్రాయంతో ఉన్న మోత్కుపల్లి కారెక్కడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజకీయంగా గతంలో విమర్శలు చేసుకున్నా, వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, టీఆర్ఎస్లో సరైన గౌరవం, గుర్తింపు ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. మోత్కుపల్లి ఒకట్రెండు రోజుల్లో మరోమారు కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశముంది. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్లో చేరిక ముహూర్తం ఖరారయ్యే అవకాశముంది. రాజ్యసభలో తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, అందరూ టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావుతోపాటు డి.శ్రీనివాస్ రాజ్యసభ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ లో ముగియనుంది. ఈ స్థానాల్లో ఒకదానిని ఎస్సీలకు కేటాయించాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మోత్కుపల్లిని వచ్చే ఏడాది రాజ్యసభకు పంపే అవకాశముం దని తెలుస్తోంది. పెద్దిరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ కూడా.. మోత్కుపల్లి మాదిరిగానే మాజీమంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్లు బీజీపీని వీడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బీజేపీలోకి మోత్కుపల్లి
సాక్షి,న్యూఢిల్లీ: మాజీమంత్రి, టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ తీర్థం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావుల సమక్షంలో ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం మోత్కుపల్లి నర్సింహులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంలో పనిచేసే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో నియంత అంటే ఎవరో మనం చూడలేదని, తెలంగాణలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, ఇప్పుడు ఎనిమిదో నిజాంగా కేసీఆర్ కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు చనిపోయినా ఆయనకు పట్టింపులేదన్నారు. గత ఐదేళ్ల కాలంలో దళితులకు మంత్రివర్గంలో స్థానం లేదని, ఇది దళిత, పేద, బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ప్రధాని మోదీని గత ఐదేళ్లు సీఎం కేసీఆర్ వాడుకున్నారని, అయితే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆయనే ప్రధాని కావాలని కలలు కన్నారని, ఆయన ఎవరికీ విశ్వసనీయుడు కాదని, ఆయనకు ఆయనే విశ్వసనీయుడని పేర్కొన్నారు. బలహీన వర్గాల మద్దతు కూడగడతారు.. మోత్కుపల్లి తమ పార్టీలో చేరటం వల్ల బడుగు, బలహీన వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని, పార్టీ బలోపేతమవుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నేడు తెలంగాణలో రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నీతి, నిజాయతీతో పనిచేసిన వ్యక్తి మోత్కుపల్లి అని చెప్పారు. వర్తమాన రాజకీయాల్లో మాకు సలహాలిచ్చే వ్యక్తని, ఆయన రాక ఏపీ, తెలంగాణ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ఉత్సాహాన్నిస్తుందన్నారు. బీజేపీ బలోపేతానికి దోహదపడుతుంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ‘దేశహితం కోసం మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు మోత్కుపల్లి నర్సింహులు ఆకర్షితులయ్యారు. ఇటీవల నేను, కిషన్‌రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించాం. వారు సుముఖత వ్యక్తం చేశారు. అమితాషాను కూడా కలిశార’ని చెప్పారు. -
ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరింది
-
చంద్రబాబు ఓ దొరకని దోంగ
-
చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు ధ్వజం
-
బాబును నమ్మి మోసపోయా
-
పవన్.. ఏ ప్యాకేజీకి అమ్ముడుపోయావో చెప్పు!
సాక్షి, హైదరాబాద్ : ‘ నెలకిందట కూడా చంద్రబాబు అంత పనిచేస్తున్న వారు లేరు అని అన్నారు. ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నావు. పవన్ కల్యాణ్.. నువ్వు ఏ ప్యాకేజీకి అమ్ముడుపోయావో చెప్పు. ఎవరు డబ్బులిస్తే.. వాళ్లను పొగడటం నీకు అలవాటు. నువ్వు ఇంత మోసగాడివని అనుకోలేదు’ అంటూ తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సిహులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు, ఆయన తనయుడి అవినీతిపై పవన్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై మోత్కుపల్లి గురువారం స్పందించారు. ‘పవన్ కల్యాణ్ మాటలు దురదృష్టకరం, ఆయన మాట్లాడినతీరు బాధాకరం’ అని అన్నారు. పవన్ కల్యాణ్ ఎవరు.. ఒక వార్ డుమెంబర్గా కూడా గెలవని వ్యక్తి.. రాష్ట్రం కోసం త్యాగాలు చేసినవారు కూడా ఇలా మాట్లాడరంటూ వ్యాఖ్యానించారు. ముఖానికి వేసుకున్న రంగు చూసేందుకే ప్రజలు వస్తారు కానీ, ఓట్లు రావని, ప్రజారాజ్యం పరిస్థితి ఏమైందని ఆయన ప్రశ్నించారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్ననాడు.. నీ నీతి ఏమైంది.. టికెట్లు ఇచ్చేందుకు కోట్లరూపాయలు తీసుకున్నారు కదా గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల గురించే మాట్లాడే హక్కు పవన్‌కు లేదన్నారు. మీ అన్న చిరంజీవి పోటీచేస్తే 18 సీట్లు వచ్చాయి.. నువ్వు పోటీ చేస్తే ఎనిమిది సీట్లు కూడా రావు అని ఎద్దేవా చేశారు. శేఖర్ రెడ్డికి లోకేశ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. రాజకీయాలంటే సినిమా కాదని, మీ అన్నలాగే, నువ్వు విఫలమవుతావని పవన్ ఉద్దేశించి పేర్కొన్నారు. పవన్ చేత బీజేపీ మాట్లాడిస్తోందని చిన్నపిల్లలను అడిగినా చెప్తారని పేర్కొన్నారు. ప్రధానిని కలిసే అవకాశం ఉన్నప్పుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటన్నింటినీ బయటపెడితే ఆయన మొహం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సిహులు -
మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందించిన లోకేష్
సాక్షి, అమరావతి : తెలంగాణలో తెలుగుదేశ పార్టీ(టీటీడీపీ)ని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో విలీనం చేయాలంటూ టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని అన్నారు. నర్సింహులు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ ప్రాభవాన్ని కోల్పోతోందని అందరూ అంటున్నారని, ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు హైదరాబాద్ రాలేదని మోత్కుపల్లి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన నారా లోకేష్.. కలెక్టర్లతో సమావేశం ఉన్నందు వల్లే ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రాలేకపోయారని చెప్పారు. విజయవాడలో ఎన్టీఆర్‌కు ముఖ్యమంత్రి నివాళులు అర్పించినట్లు తెలిపారు. పార్టీలో స్థానం కోరుకునే వారు ఎవరైనా పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. -
సినిమా యాక్టర్లు కూడా భయంతోనే వచ్చారు..
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ధనవంతులకు, పెత్తందార్లకు మాత్రమే చోటు కల్పించారు తప్ప పేదవారిని, పేద కవులను కేసీఆర్ తీవ్రంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. పేదవారిని గౌరవించాల్సిన అవసరం ఏముందనే ధోరణితో కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. పేదవారి సొమ్మంతా పెద్దలకు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. ప్రపంచ తెలుగు మహాసభల తీరుపై గురువారం మోత్కుపల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో తెలుగువారిని మద్రాసీలు అనేవారని... అలాంటిది తెలుగు వారి ప్రాముఖ్యత ఢిల్లీకి చెప్పింది ఎన్టీఆరేనని అలాంటి ఆయనను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. తనకు, కేసీఆర్‌కు రాజకీయ గురువు ఎన్టీఆరేనని, ఆయన నుంచే తామిద్దరికీ చైతన్యం వచ్చిందన్నారు. అలాంటి ఆయన గురించి నాలుగు మాటలు చెబితే కేసీఆర్ పదవి పోతుందా అని నిలదీశారు. ప్రపంచ తెలుగు పండగ అయినప్పుడు సీఎం చంద్రబాబును కేసీఆర్ ఎందుకు పిలవలేదని, అమరావతి శంకుస్థాపన సమయంలో, కేసీఆర్ యాగం సమయంలో ఇచ్చిపుచ్చుకున్నట్లు జరగలేదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వరకు తెలుగు వారు (జస్టిస్ ఎన్వీ రమణ, చలమేశ్వరరావు, లావూరి నాగేశ్వరరావు) ఉన్నారని అలాంటి వారిని గౌరవిస్తే కేసీఆర్‌కే పేరొచ్చి ఉండేదని అన్నారు. కనీసం మీడియా పాత్ర కూడా ఈ సభల్లో లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన వారంతా కూడా కేసీఆర్‌కు భయపడి భజన చేసిర్రా, నిజంగానే చేసిర్రా అనేది అర్ధం కాలేదని అన్నారు. తెలంగాణ దళిత కవులు విమలక్క, గద్దర్, వందేమాతరం, శ్రీనివాస్, అందెశ్రీని ఎందుకు కేసీఆర్ గౌరవించలేదని మండిపడ్డారు. సినిమా యాక్టర్లు కూడా భయంతో వచ్చినవారేగానీ, ప్రేమతో రాలేదని, చిరంజీవి కూడా భయంతోనే వచ్చినట్లుందని అనుకుంటున్నానని అన్నారు. బాలకృష్ణ కూడా అందరు యాక్టర్ల మాదిరిగా వచ్చిపోయారన్నారు. యాక్టర్లంతా గొర్రెల మాదిరిగానే దండలు వేయించుకున్నారని, వారు ఎన్టీఆర్ గురించి మాట్లాడాలని అనుకున్నా... కేసీఆర్ భయంతో మాట్లాడలేకపోయారని అన్నారు. కేసీఆర్‌ను పొగిడించుకునేందుకే రూ.కోట్లు ఖర్చుపెట్టారని, పేదవాడు సంతోషంగా లేని ఏ పండుగ పండుగ కాదన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్ తీరు నిరంకుశ, నియంతృత్వవాదానికి ప్రతీకగా ఉందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే జనాలు సంతోషంగా ఉండే చర్యలు చేయాలని, ఆయనలో ప్రాంతీయవాదం ఆలోచన ఇంకా పోలేదన్నారు. 'కేసీఆర్ కేబినెట్లో ఒక్క మాదిగ, మాల లేరు, బీసీలు ఉన్నా వారికి వాయిస్ లేదు. మిత్రుడిగా నాకు రాజకీయ కక్ష లేదు. ప్రజలు మెచ్చేలాగా కేసీఆర్ ఉండాలి. ఆయన తీరు మారాలి. ఎన్టీఆర్ శిష్యుడిగా చెప్తున్నా కేసీఆర్ చర్యలు దుర్మార్గం. బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే' అని మోత్కుపల్లి మండిపడ్డారు. -
'మోసానికి మారు పేరు కేసీఆర్'
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రానికి దళితుడ్నితొలి ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. కరీంనగర్లో మంగళవారం జరిగిన సభలో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ వాదాన్ని స్వార్ధానికి, తన కుటుంబ సంక్షేమానికి వాడుకున్నారని మోత్కుపల్లి దుయ్యబట్టారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. మోసానికి మారుపేరు అయిన కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ఈ నెల 9వ తేదీన ఇందిరా పార్కు వద్ద దూందాం కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్టు తెలిపారు.