ఎవరెస్టే లక్ష్యంగా..
చింతూరులో 16 మందికి శిక్షణ
ఏప్రిల్, మేలలో ఆరోహణా యాత్ర
చింతూరు :
ఎవరెస్టు అధిరోహణే లక్ష్యంగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన 30 మందికి శిక్షణనిచ్చి డార్జిలింగ్‌లోని రెనాక్ పర్వతాధిరోహణ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన అనంతరం వారిలో 16 మంది ని ఎంపిక చేశామని, వారికి ఈనెల 2 నుంచి చింతూరులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పర్వతారోహణా శిక్షకుడు దూబి భద్రయ్య శనివారం తెలిపారు. నవంబరు 15 నుంచి డిసెంబరు 6 వరకు డార్జిలింగ్‌లో 30 మందికి శిక్షణనివ్వగా డిసెంబరు ఒకటిన రెనాక్ పర్వతాన్ని అధిరోహించారని చెప్పారు. వీరిలో ప్రతిభ కనబరచిన 13 జిల్లాలకు చెందిన 16 మందిని ఎంపిక చేశామని, వారిలో చింతూరు మండలం కుయిగూరుకు చెందిన సో యం సారమ్మ, వీఆర్‌పురానికి చెందిన కుంజా దుర్గారావు ఉన్నారని తెలిపారు. వా రందరినీ చింతూరులో శిక్షణ అనంతరం జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ పర్వతారోహణకు తీసుకెళతామన్నారు. లడఖ్ పర్వతారోహణలో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ను తట్టుకోవాల్సి ఉంటుందని, ఈ పరిస్థితులను త ట్టుకుని ప్రతిభ కనబరచిన వారి ని అసలు లక్ష్యమైన ఎవరెస్టు అధిరోహణకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఎవరెస్టు అధిరోహ ణ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరుగుతుందన్నారు.
యువత ముందుకు రావాలి..
పర్వతారోహణకు మరింత మంది యువత ముందుకు రావాలి. లక్ష్యాలను అధిగమించినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏజెన్సీలో గిరిజన యువతను ప్రోత్సహించేందుకు నా వంతు కృషి చేస్తా.
–దూబి భద్రయ్య, పర్వతారోహక శిక్షకుడు