ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం
జవహర్ నగర్: ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే సురక్షితమని, అంతుకే మారుమూల ప్రాంతాలకు ఆర్డీసి సేవసలను విస్తరించనున్నట్లు ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లెబోయిన చంద్రశేఖర్‌యాదవ్ అన్నారు.
ఆదివారం గబ్బిలాలపేట నుండి సికింద్రాబాద్‌కు 24బిజి నెంబర్ బస్సును ప్రాంరంభించిన ఆయన.. వివిధ జిల్లాల నుండి వలసవచ్చి గబ్బిలాలపేట పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నవారు దాదాపు 20వేల పైచిలుకు ఉంటారని, నగరాకి వెళ్లి పనిచేసుకునే వీరు ఇన్నాళ్లు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారని, ఇప్పుడు ఆర్టీసీ బస్సు సర్వీసు రావడం ఆనందంగా ఉన్నదన్నారు. గ్రామజ్యోతి పధకం ద్వారా మారుమూల ప్రాంతాల్లో మౌలికసదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.