Muchhinthala
-
ముచ్చింతల్ సమతా మూర్తి: ఫిబ్రవరి 2 నుంచి సమతా కుంభ్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి(స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, సమతామూర్తి కేంద్రం ఏర్పాటై ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ తరుణంలో చిన్న జీయర్ కీలక ప్రకటన చేశారు. ఇక, సోమవారం చిన్న జీయర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందన్నారు. అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమతామూర్తి కేంద్రం గత ఏడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైంది.. 216 అడుగుల పంచలోహ విగ్రహం అందుబాటులోకి వచ్చిందన్నారు. 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారు. ఈ ఏడాది కూడా అదే క్రమంలో కార్యక్రమం సాగుతుంది. కాకపోతే ఈ ఏడాది 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని వెల్లడించారు. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 11వ తేదీన లక్ష మందితో భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. అలాగే, రామానుజాచార్యులు చాలా మేధావి అంతే కాకుండా మనసు ఉన్న మనస్వి. అన్ని వర్గాల వారిని సమాజంలోకి తెచ్చి ఆలయాల్లో భాగస్వాములను చేశారని అన్నారు. ఈ క్రమంలోనే చిన్న జీయర్‌కు భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ రావడంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో చిన్న జీయర్ మాట్లాడుతూ.. ముందు రోజు నాకు ఫోన్ చేసి.. లిస్టులో మీ పేరు పెడుతున్నామని చెప్పారు. మీకు ఏదైనా అభ్యంతమా? అని అడిగారు. నాకేమీ అభ్యంతరం లేదని నేను వారికి చెప్పాను. పద్మభూషణ్ రావాలని నేను కోరుకోలేదు. అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని కామెంట్స్ చేశారు. -
ఆ విగ్రహం రామానుజ ఆదర్శాలకు ప్రతీక: ప్రధానమంత్రి మంత్రి మోడీ
-
యాదాద్రి ఏర్పాట్లు ఎలా చేద్దాం?
శంషాబాద్ రూరల్: యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునఃప్రారంభం ఏర్పాట్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. యాదాద్రిలో మార్చి 21 నుంచి మహా సుదర్శనయాగం, 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టడానికి ఇదివరకే ముహూర్తం ఖరారుకాగా.. వాటి ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్‌స్వామితో కేసీఆర్ చర్చించారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని జీయర్‌స్వామి ఆశ్రమంలో సీఎంకు రుత్వికులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌కు స్వామి మంగళ శాసనాలు అందజేశారు. సీఎం అక్కడి నుంచి జీయర్ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న యాగశాలకు వెళ్లి పనులను పరిశీలించారు. 1,035 కుండాలతో హోమాలు నిర్వహించనున్నట్లు స్వామి వివరించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జీయర్‌స్వామి భారీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ పనులను కూడా సీఎం పరిశీలించారు. అనంతరం యాగశాల, సమతాస్ఫూర్తి కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు ఇచ్చారు. మిషన్ భగీరథ నీటి సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఉత్సవాలకు పెద్దసంఖ్యలో వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నందున యాగశాల వద్ద ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి ఫోన్‌చేసి హోమాలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోమం కోసం వినియోగించే నెయ్యిని స్థానిక గోశాలలో సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్న విధానాన్ని అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం ఇక్కడకు వచ్చిన సీఎం మూడు గంటలకు పైగా ఇక్కడ గడిపారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు ఉన్నారు. -
కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్తూ..
– రోడ్డు ప్రమాదంలో తల్లి దుర్మరణం – ముచ్చింతల్ వద్ద ఆటోను ఢీకొన్న లారీ – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు ఆమె అసలే వద్ధురాలు.. ఆపై భర్త మూడేళ్ల క్రితమే గుండెపోటుతో మృతి చెందాడు.. ఇక మతిస్థిమితం సరిగాలేని తన కొడుకును ఎలాగైనా ఆస్పత్రికి తీసుకెళ్లి బాగు చేయించాలని ఆ తల్లి ఎంతో ఆరాటపడింది.. అది నెరవేరకుండానే విధి ఆడిన నాటకంలో రోడ్డు ప్రమాదానికి గురై కానరానిలోకాలకు చేరుకుంది.. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. శంషాబాద్ రూరల్ / కొందుర్గు : మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గుకు చెందిన హైమావతి (60), శ్రీశైలం దంపతులకు కొడుకు 30ఏళ్ల వినోద్‌కుమార్‌తోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. భర్త మూడేళ్ల క్రితమే గుండెపోటుతో మృతతిచెందాడు. ముగ్గురు కూతుళ్లకు గతంలో పెళ్లిళ్లు అయ్యాయి. ఉన్న ఒక్క కొడుకుకు కొన్ని నెలలుగా మతిస్థిమితం సరిగాలేదు. దీంతో అప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని జిమ్స్ ఆస్పత్రిలో తల్లి చికిత్స చేయిస్తోంది. ఇందులోభాగంగా శుక్రవారం ఉదయం ఆమె తమ కొడుకు, పెద్దకూతురుతో కలిసి ఆర్టీసీ బస్సులో మదన్‌పల్లికి వచ్చింది. అక్కడి నుంచి మరో ఇద్దరు ప్రయాణికులతోపాటు ఆటోలో ఆస్పత్రికి బయలుదేరింది. మార్గమధ్యంలోని ముచ్చింతల వద్దకు చేరుకోగానే పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ నుంచి పాల్మాకుల వెళుతున్న లారీ ఢీకొనడంతో హైమావతి ఎగిరి దాని చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనలో కొత్తూరు మండలం నందిగామకు చెందిన ఆటో డ్రైవర్ నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అలాగే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ భాస్కర్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం శంషాబాద్ క్లస్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మతదేహాన్ని బంధువులకు అప్పగించారు.