మట్టిమిద్దె కూలి దంపతుల మృతి
పత్తికొండ: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో మట్టిమిద్దె కూలి దంపతులు మృతిచెందారు. గ్రామానికి చెందిన భరత్, ఉషా దంపతులు తమ ఇంట్లో నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్డి కోసం గుంతలు తవ్వుతుండగా పాత ఇంటి మిద్దె కూలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.