mud water
-
బురద నీటి నుంచీ తాగునీటి వరద
సాక్షి, అమరావతి: బురద నీటిని సైతం అంతర్జాతీయ ప్రమాణాల (ఐఎస్వో 10500) స్థాయిలో శుద్ధి చేసి తాగునీటిగా అందించే ఆధునిక పరిజ్ఞానాన్ని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) సొంతం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాకాలంలో సాగునీటి కాలువల ద్వారా పారే నీరు బురదమయంగా మారుతుండటంతో ఆ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తోంది. తద్వారా ఐఎస్వో స్థాయికి శుద్ధి చేసిన నీటిని మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉపక్రమించారు. కాలువల్లో ఎక్కువ రోజులు బురద నీరే ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పలు మంచినీటి పథకాలకు సాగునీటి కాలువల ద్వారా నీటిని సేకరిస్తారు. అయితే, నీరు ఏడాదిలో ఎక్కువ రోజులు బురదమయంగా ఉంటోంది. వర్షాకాలంలో తరుచూ కురిసే వర్షాల వల్ల, ఎండకాలంలో స్టోరేజీ ట్యాంకులో నిల్వ ఉంచిన నీరు అడుగంటిన సమయంలో బురదమయంగా మారుతోంది. మంచినీటి పథకాల వద్దకు వచ్చి చేరే ఆ బురద నీటిని సాధారణ పద్ధతులలో శుద్ధిచేసి తాగు నీటిగా అందిస్తున్నారు. స్థానికులు ఆ నీటిని తాగునీటి కోసం ఉపయోగించుకోలేని పరిస్థితి. అక్కడి గ్రామాల్లో అవసరమైన స్థాయిలో మంచినీటి పథకాలు, నీరు అందుబాటులో ఉంటున్నా గత 10–12 ఏళ్లుగా ఆ జిల్లాల్లోని వందలాది గ్రామాలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేసే ముందు ఫిల్టర్ బెడ్ విధానంలో నీటిని శుద్ధి చేస్తారు. కంకర, ఇసుక పొరలతో ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్లలో నీటిని ఇంకించి.. ఆ తర్వాత బ్లీచింగ్ కలిపి ఆ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ విధానంలో వంద లీటర్ల నీటిని ఫిల్టర్ బెడ్‌లోకి పంపితే, తిరిగి దాదాపు అదే స్థాయిలో నీరు తిరిగి అందుబాటులోకి రావాలి. కానీ.. బురద నీటిని నేరుగా పిల్టర్ బెడ్‌లోకి పంపినప్పుడు.. 60–70 శాతం నీరు ఇంకిన తర్వాత ఫిల్టర్ బెడ్లో ఉండే ఇసుక పొరపై బురద పేరుకపోయి మిగిలిన నీరు ఇంకే పరిస్థితి ఉండదు. దీంతో ఆ ఫిల్టర్ బెడ్ల ద్వారా ఇంకే నీరు ఒక రకమైన వాసన వస్తోంది. ఫిల్టర్ బెడ్లో ఇసుక పొరపై పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగిస్తే గానీ ఆ మంచినీటి పథకం పనిచేయని పరిస్థితి. ఇదే సమయంలో ఫిల్టర్ బెడ్లోని ఇసుక, కంకర పొరలను తరుచూ మార్చాల్సి ఉంటుంది. ఇదంతా వ్యయంతో కూడిన వ్యవహారం కావడంతో చాలా సందర్భాల్లో వాటిని బాగు చేయించే పరిస్థితి లేక పథకాలు వృథాగా ఉండాల్సి వచ్చేవి. ప్రీ ట్రీట్మెంట్ పద్ధతి విజయవంతం కావడంతో.. సాగునీటి కాలువల ద్వారా వచ్చే బురద నీటి శుద్ధికి మంచినీటి పథకాల వద్ద కొత్త టెక్నాలజీతో కూడిన ప్రీ ట్రీట్మెంట్ యూనిట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మంచినీటి పథకాల వద్ద ఉండే స్లో శాండ్ ఫిల్టర్లకు ముందే ఫ్యాకులేటర్, ట్యూబ్ సెట్లెర్‌లను రెండు వేర్వేరు విభాగాలతో అనుసంధానం చేయడం ద్వారా బురద నీటిని శుద్ధి చేస్తారు. ఆ నీటిని శాండ్ ఫిల్టర్ బెడ్ పైకి పంపడం వల్ల ఐఎస్వో స్థాయి మేరకు పరిశుభ్రమైన తాగునీటిగా శుద్ధి అవుతుంది. రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి సఫలం కావడంతో.. గోదావరి జిల్లాల్లో సమస్య ఉన్న ప్రతిచోట ఈ విధానం ద్వారా బురద నీటి శుద్ధి ప్రక్రియను కొత్తగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. రూ.88.60 కోట్లతో.. గోదావరి జిల్లాల్లో బురద నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఈ విధానంలో నీటిని శుద్ధి చేసిన తర్వాతే మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. రూ.88.60 కోట్లతో తూర్పు గోదావరి జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 276 మంచినీటి పథకాల వద్ద ప్రీ ట్రీట్మెంట్ యూనిట్స్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. అనుమతి రాగానే పనులు చేపడతామని ఆర్డబ్ల్యూఎస్ సీఈ పి.సంజీవరావు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
వీడని...వరద కష్టం
తూర్పుగోదావరి, అమలాపురం: గోదావరి వరద ఉధృతి తగ్గుతున్నా.. ఏజెన్సీ..లంకవాసులు కష్టాలు తగ్గడం లేదు. వరద తగ్గుతున్న కొద్దీ వారి కష్టాలు రెట్టింపవుతున్నాయి. రహదారులు...ఇళ్లల్లో అడుగుల ఎత్తున పేరుకుపోయిన బురద బాధితుల కష్టాలను రెట్టింపు చేస్తుండగా, లంకల్లోనే కాదు.. డెల్టాలో వందల ఎకరాల్లో వరిచేలు ముంపులోనే ఉన్నాయి. కూరగాయ పంటలు దెబ్బతినడం..ఇదే సమయంలో బహిరంగ మార్కెట్లో వాటి ధరలు పెరగడంతో లంకవాసులే కాదు..జిల్లా వాసులు సైతం వరద బాధితులుగా మారిపోతున్నారు. గోదావరిలో వరద తగ్గు ముఖం పడుతున్నా లంకల్లో పల్లపు ప్రాంతాలు.. ఇళ్లు ఇంకా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి శుక్రవారం ఆరు గంటల సమయంలో సుమారు 9 లక్షల 23 వేల 203 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఎనిమిది రోజులుగా వరదలో ఉన్న ఇళ్లు.. ఊళ్లు ముంపునుంచి బయటపడుతున్నాయి. ఏజెన్సీ, కోనసీమలోని లంకల్లోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద పీడ వీడుతుండగా.. కొత్తగా బురదలో బాధలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు నీటిలో ఉన్న రహదారుల మీద కనీసం నడిచే అవకాశమన్నా ఉండేది? మరీ ముంపు ఉంటే కనీసం పడవల మీద రాకపోకలు సాగించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రహదారులపై అడుగు మేర బురద ఉండడంతో వాహనాల రాకపోకలు ఆరంభం కాలేదు. అడుగుతీసి అడుగు వేస్తే అల్లంతదూరం జారుతున్నారు. ఒక్క రోడ్డు మీదనే కాదు.. ముంపుబారిన పడిన ఇళ్లలో సైతం బురద పేరుకుపోయింది. వరద పూర్తిగా వీడినా బురద కష్టాలు తీరేందుకు రెండు,మూడు రోజుల సమయం పడుతోంది. రహదారులపై పేరుకుపోయిన బుదర తొలగిస్తుండడంతో ఏజెన్సీలో ప్రధాన రహదారులపై రాకపోకలు ఆరంభమయ్యాయి. మారుమూల గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. గోదావరిలో లాంచీలు, పడవల మీద రాకపోకలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. శబరి, గోదావరి వరద బారిన పడిన చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాలు తేరుకుంటున్నాయి. కోనసీమలో వరికి దెబ్బమీద దెబ్బ... నెల రోజుల వ్యవధిలో కోనసీమ వరి రైతులు రెండుసార్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు కోనసీమలో సుమారు 1,200 హెక్టార్లలో పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. నారుమడుల దశలోనే పంట పోవడంతో రైతులు కొంతలో కొంత నష్టపోయినా తిరిగి సాగు ఆరంభించారు. ప్రస్తుత గోదావరి వరదలకు ఒక్క కోనసీమలోనే అధికారుల లెక్కల ప్రకారం 8 వేల 833 ఎకరాలపై ప్రభావం ఉందని చెబుతున్నారు. కానీ వాస్తవంగా ఈ నష్టం రెట్టింపు ఉంటుందని అంచనా. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడం, ఒకే సమయంలో వరదలు, వర్షాలు కారణంగా ముంపుతీవ్రత అధికంగా ఉంది. దీనికితోడు అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు అధ్వానంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఒక్క ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లో 4,893 ఎకరాలు ముంపుబారిన పడ్డాయి. ముంపువీడే అవకాశం లేకపోవడంతో అధికశాతం పంట దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. కోనసీమలో మరీ దారుణం... కోనసీమ లంకల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికీ పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గితేకాని ముంపునుంచి బయట పడే అవకాశం లేదు. అప్పనపల్లి, ముక్తేశ్వరం కాజ్‌వేలపై ముంపునీరు దిగింది. దీంతో పడవల మీద దాటించడం నిలుçపుదల చేశారు. రాజోలు దీవిలోని లంకల్లో ప్రధాన రహదారుల మీద మాత్రమే వరద తగ్గింది. ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేల్లంక, గురజాపులంక, కమిని శివారులు ఇంకా ముంపులోనే ఉన్నాయి. -
బురద నీటిని తాగేదెలా..?
లావేరు: మండలంలోని లావేటిపాలేం గ్రామంలో రెండు రోజులుగా మంచినీటి కుళాయిలు నుంచి బురద నీరు వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బురద నీటిని ఎలా తాగాలని ప్రశ్నిస్తున్నారు. లావేటిపాలేం గ్రామంలో ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి వాటి ద్వారా గ్రామంలో మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. గత రెండు రోజుల నుంచి మంచినీటి కుళాయిలు నుంచి బురద నీరు వస్తోంది. దీంతో ఆ నీటిని తాగలేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
బోరుమంటున్నాయి..!
► నగరంలోని బోర్ల నిండా బురద నీళ్లే ► కానరాని నీటి ఎద్దడి నివారణ చర్యలు ► పట్టించుకోని అధికారులు, పాలకులు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగరంలో బోర్లు బోరుమంటున్నాయి. ఓ వైపు అధికారులు ప్రగతి మంత్రం జపిస్తున్నా తాగునీటి వనరులు మాత్రం వేసవిలో నగర జీవిని వెక్కిరిస్తూనే ఉ న్నాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కరపత్రాలు మొదలుకుని చేతి పంపుల వరకు అన్నింటిపైనా పసుపు రం గు పూస్తున్నారు. ప్రచారంలో ఇంత శ్రద్ధ చూపిస్తున్న పాలకులు అవే బోర్లు పాడైపోతే మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో చాలా చోట్ల బోర్ల నుంచి బుదర నీరే వస్తోంది. ఒక్క బక్కెట్టు నీరు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి. రెల్లవీధి, దంగల వీధి, బల గ, ఆదివారం పేట, గుజరాతీపేటలతో పాటు పలు కాలనీల్లోని బోర్లు ఇలాంటి నీరే ఇస్తున్నాయి. గణాంకాల కోసం నగరంలో ఇన్ని బోర్లు వేశామ ని అధికార పక్ష నేతలు చెప్పుకుంటున్నా, అవి ప్రజలకు ఉపయోగపడడం లేదు. వేసవి కాలం రావడంతో ఎప్పటికప్పుడు కరెంటు కోతలు, మున్సిపల్ కుళాయిలు సరిగా రాకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ ఆపత్కాలంలో బోర్లే దిక్కుగా మారుతున్నాయి. అయితే బోర్లు కూడా బురద నీరే ఇ స్తుండడంతో ఇక తామేం చేయాలని స్థానికులు ప్ర శ్నిస్తున్నారు. ఈ కాలనీలో నివసించేవారంతా నిరుపేదలు. సొంత మోటార్లు, బావులు లేని వారు. వీరికి నగర పాలక సంస్థ కుళాయి నీరే ఆధారం. వాడుక నీటి కోసం బోర్లపై ఆధారపడతారు. 2016లో తీసిన బోర్ల నుంచి కూడా బురద నీరే వస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. చేతి పంపు నుంచి బురద నీరు వస్తోంది. ఈ విషయాన్ని నాయకులు, అధికారులకు చాలాసా ర్లు చెప్పాం. అయినా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు చొరవ చూపి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. ---కొర్లాపు వేణు, దంగళవీధి, శ్రీకాకుళం. ఈ మధ్యకాలంలో కుళాయిల నీరు రాకపోతే స్నానాలు, తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది ప డ్డాం. కనీసం మా ప్రాంతంలో బావులు కూడా లేవు. చేతిపంపు నీళ్లే ఆధారమయ్యాయి.--- పి.సంతోష్, దంగళవీధి, శ్రీకాకుళం నీళ్లు బురదగా వస్తుండడంతో బకెట్లలో వాటిని నిల్వ చేసుకుని బురదంతా కిందకు దిగాక వడబోసుకుని వాడుతున్నాం. ఇలా ఎంత కాలం వడపోసుకుని వాడుకోగలం. నగరంలో ఉన్నా ఏంటి ఈ దుస్థితి. అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలి. --- ఎం.ఆదినారాయణ, రెల్లవీధి, శ్రీకాకుళం మా దృష్టికి రాలేదు చేతి పంపుల నుంచి బురద నీళ్లు వస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎక్కడెక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయో ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే మా ఇంజినీర్లను పంపించి అక్కడ సమస్యను తెలుసుకుంటాం.తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపడతాం. ---పి.ఎ శోభ, నగరపాలక కమిషనర్, శ్రీకాకుళం -
ఈ బురదనీళ్లు తాగలేం..
- గోదావరి జలాలపై పలు కాలనీల ప్రజల గగ్గోలు - నగరంలోని పలు కాలనీలకు గోదావరి జలాలు సరఫరా - నల్లాల్లో వస్తున్న బురద, మట్టితో కూడిన నీరు - కలుషిత నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్న జనం - కాంట్రాక్టరు నిర్లక్ష్యం.. అసంపూర్తిగా మల్లారం ఫిల్టర్‌బెడ్స్? - ప్లాంట్ల నుంచి ఫిల్టర్ నీళ్ల కొనుగోలుతో జనం జేబులకు చిల్లు - నీటి నాణ్యత సరిగాలేక సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు.. రోగుల ఆందోళన సాక్షి, హైదరాబాద్ నల్లా నీరు బురదమయంగా ఉంటోంది. విధిలేక ఫిల్టర్ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని కొనుగోలు చేస్తున్నాం. డిమాండ్ అధికంగా ఉండడంతో ప్లాంట్ల నిర్వాహకులు 20 లీటర్ల నీటి క్యాన్ ధరను రూ.30 నుంచి రూ.40కి పెంచేశారు. తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నాం. - శారద, కూకట్పల్లి గోదావరి జలాలు బురదతో వస్తున్నాయి. ఈ నీటిని కాచి చల్లార్చి తాగాలని అధికారులు చెపుతున్నా.. ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు. ఈ నీటిని తాగడం వల్ల చిన్నా, పెద్దా అంతా గొంతు నొప్పి, జలుబుతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. - లక్ష్మి, కుత్బుల్లాపూర్ గోదావరి బురద జలాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నిదర్శనం వీరి మాటలు. నల్లాల్లో నిత్యం బురద, మట్టి కలసిన నీళ్లు సరఫరా అవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఫిల్టర్ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని కొనుగోలు చేయాలంటే జనం జేబులు గుల్లవుతున్నాయి. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటిసరఫరా నిలిచిపోవడంతో నగర శివార్లలోని ఘన్పూర్ రిజర్వాయర్‌కు 56 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఈ నీటిని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సనత్‌నగర్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పలు కాలనీలు, బస్తీలకు అరకొర నీటి సరఫరాతోపాటు బురద, మట్టి రే ణువులు కలసిన జలాలు సరఫరా అవుతుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బురద నీటి కారణంగా ఫిల్టర్‌నీటిని కొనుగోలు చేయాలన్నా.. నలుగురు సభ్యులున్న ఒక్కో కుటుంబం రోజుకు రూ.100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అటు కుత్బుల్లాపూర్‌లో గోదావరి జలాలు సరఫరా అయి పక్షం రోజులు గడిచినా బురద నీళ్లే దిక్కయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ఈ నీటిని తాగి అనారోగ్యాల బారినపడుతున్నారు. గోదావరి రింగ్ మెయిన్-1 పైపులైన్లను శుద్ధి చేసి మూడు రోజుల్లో స్వచ్ఛమైన నీటిని అందిస్తామని జలమండలి అధికారులు ప్రకటించినా.. ఆచరణలో విఫలమయ్యారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యమే కారణం.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని ఘన్పూర్ వరకు మొత్తం 186 కి.మీ మార్గంలో గోదావరి పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. గోదావరి జలాలను శుద్ధి చేసేందుకు మల్లారం(కరీంనగర్ జిల్లా)లో ఉన్న నీటిశుద్ధి కేంద్రంలో 52 ఫిల్టర్‌బెడ్స్ ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఇందులో 17 మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. వీటిపైనే రోజువారీగా నగరానికి తరలిస్తున్న 56 ఎంజీడీల గోదావరి రావాటర్‌ను అరకొరగా శుద్ధి చేస్తున్నారు. దీంతో గోదావరి జలాల్లోని బురద, మట్టి రేణువులు, చెత్తాచెదారం పూర్తిస్థాయిలో తొలగడం లేదని తెలిసింది. 52 ఫిల్టర్‌బెడ్స్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసే విషయంలో సదరు కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇవి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వరకు బురదనీళ్లతో జనానికి అవస్థలు తప్పే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు బురద, మట్టి ఎక్కువ శాతం ఉండడంతో ఇళ్లల్లోని వాటర్ ఫిల్టర్లు చెడిపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం నగరానికి నీటి సరఫరా ఇలా.. నగరానికి రోజువారీగా ఉస్మాన్‌సాగర్(గండిపేట్) నుంచి 3.50 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 5.50 ఎంజీడీలు, కృష్ణా మూడు దశల నుంచి 259.35 ఎంజీడీలు, గోదావరి నుంచి 56 ఎంజీడీలు.. మొత్తంగా 324.35 ఎంజీడీల నీటిని నగరంలోని 8.64 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. సరోజినిదేవి ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు హైదరాబాద్: సరోజిదేవి కంటి ఆస్పత్రికి నీటి సరఫరా బంద్ కావడంతో మూడు రోజులుగా శస్త్రచికిత్సలను నిలిపేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొందరు రోగులు శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ప్రతి రోజూ 50 నుండి 60 మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. మూడు రోజుల నుంచి శస్త్రచికిత్సలు ఆగిపోవడంతో ఆపరేషన్లు చేయాల్సిన రోగుల సంఖ్య మూడు వందలకు చేరుకుంది. ఆస్పత్రిలో చేరిన రోగులకు శస్త్రచికిత్సలు చేయకపోవడంతో ఆపరేషన్లు చేసేటప్పుడు వేసే దుస్తులతోనే కొందరు రోగులు ఇంటిదారి పట్టారు. కాగా, ఆస్పత్రికి మూడు రోజులుగా నాణ్యత సరిగా లేని నీరు సరఫరా అవడంతో కాటరాక్ట్ ఆపరేషన్ల కోసం నగరంలోని నలు మూలల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ వినోద్ ‘సాక్షి’కి తెలిపారు. అత్యవసర ఆపరేషన్ల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు మాత్రం ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాలుగు కనెక్షన్ల ద్వారా ఆస్పత్రికి సరఫరా అవుతున్న నీటి నాణ్యతను తెలుసుకునేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు నీటి నమూనాలు పంపించామని తెలిపారు. వారం తర్వాత రమ్మన్నారు.. ‘కనులు మసకబారడంతో గత నెలలో సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చూపించుకున్నాను. ఈ నెల 9న శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాను. దవాఖానాలో నీటి సమస్య ఏర్పడటంతో వారం తర్వాత రమ్మని డాక్టర్లు చెప్పడంతో ఇంటికి వెళ్తున్నా.’ - ఆషాం అలీ, అంబర్‌పేట