Muharram public holiday
-
ఇరాక్‌లో మొహర్రం నాడు మారణహోమం
కర్బాలా: ఇరాక్‌లో మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో గురువారం మారణహోమం చెలరేగింది. దేశవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ సున్నీ మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవిత్ర కర్బాలా ప్రాంతానికి చేరుకున్న లక్షల మంది షియాలే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరిపారు. ఆయా ఘటనల్లో మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 లక్షల మందికిపైగా షియాలు అషుర వేడుకల తుది ఘట్టంలో పాల్గొనేందుకు గురువారం కర్బాలాలోని పవిత్ర ఇమామ్ హుస్సేన్ సమాధి వద్దకు వచ్చారు. -
మొహర్రం సెలవు 15వ తేదీకి మార్పు
ఐచ్చిక సెలవు 13 నుంచి 14కు సవరణ సాక్షి, హైదరాబాద్: మొహర్రం సెలవును రాష్ట్ర ప్రభుత్వం 14వ తేదీకి బదులుగా 15వ తేదీకి మార్చింది. కేంద్ర ప్రభుత్వం మొహర్రం సెలవును 15వ తేదీకి మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా సెలవును సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం సెలవు మారడంతో ఐచ్చిక సెలవును కూడా 13వ తేదీకి బదులుగా 14వ తేదీకి మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం సందర్భంగా 15వ తేదీన బ్యాంకులకు సెలవు ప్రకటించారు.