ఇరాక్‌లో మొహర్రం నాడు మారణహోమం | Suicide bomber kills 22 Shiites at ritual | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో మొహర్రం నాడు మారణహోమం

Published Fri, Nov 15 2013 4:36 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

Suicide bomber kills 22 Shiites at ritual

కర్బాలా: ఇరాక్‌లో మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో గురువారం మారణహోమం చెలరేగింది. దేశవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ సున్నీ మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవిత్ర కర్బాలా ప్రాంతానికి చేరుకున్న లక్షల మంది షియాలే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరిపారు. ఆయా ఘటనల్లో మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 లక్షల మందికిపైగా షియాలు అషుర వేడుకల తుది ఘట్టంలో పాల్గొనేందుకు గురువారం కర్బాలాలోని పవిత్ర ఇమామ్ హుస్సేన్ సమాధి వద్దకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement