బరి నుంచి తప్పుకున్న ముక్కు కాశిరెడ్డి
ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ స్థానం ఎన్నికల బరిలో నుంచి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముక్కు కాశిరెడ్డి తప్పుకున్నారు. వైఎస్ఆర్ సిపి రెబల్ అభ్యర్థిగా కాశిరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరపున మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
ఈ రోజు ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని కాశిరెడ్డి చెప్పారు.