Mukul Choudhary
-
IPL 2026: రాకాసి బౌన్సర్ దెబ్బకు పుర్రె పగిలిపోయేది..!
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ ఛౌదరి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అశోక్ కుమార్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ ముకుల్ ఛౌదరి తలను బలంగా తాకింది. గంటకు 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతి ముకుల్ హెల్మెట్‌ను తగిలి థర్డ్ మన్ దిశగా చాలా దూరం వెళ్లింది. దీన్ని బట్టి బంతి ఎంత వేగంగా వచ్చిందో అంచాన వేయవచ్చు. pic.twitter.com/c7dQanPPqN— crictalk (@crictalk7) April 12, 2026ఈ దెబ్బకు హెల్మెట్ ఉన్నా, ముకుల్ దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన తర్వాత మైదానం మొత్తం ఒక్క క్షణం నిశబ్దం ఆవహించింది. ఫిజియో హుటాహుటిన వచ్చి ముకుల్‌కు కంకషన్ టెస్ట్ చేశాడు. అదృష్టవశాత్తూ ముకుల్‌కు ఎలాంటి అపాయం జరగలేదు. ఒకవేళ ఆ బంతి హెల్మెట్ కవర్ చేయని ప్రాంతంలో తగిలి ఉంటే, ముకుల్ పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టంగా ఉండేది. ఒకవేళ ముకుల్ హెల్మెట్ లేకుండా బరిలోకి దిగుంటే అతని పుర్రె పగిలిపోయేది. అశోక్ ఎంత వేగవంతమైన బౌలరో ఇదివరకే రుజువైంది. ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేసిన అతను.. క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బంతి (154.2) కూడా అశోక్ ఖాతాలోనే ఉంది.ముకుల్ విషయానికొస్తే.. ఇతగాడు గత మ్యాచ్‌లో (కేకేఆర్‌పై) లక్నోను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపుపై ఎమాత్రం అంచనాలు లేని సమయంలో 27 బంతుల్లో 54 పరుగులు చేసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముకుల్ కొట్టిన 7 సిక్సర్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ముకుల్ వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు. ముకుల్ కూడా ధోని తరహాలోనే వికెట్‌కీపింగ్ బ్యాటర్‌గా ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది. -
నాన్న త్యాగం...ధోనిపై అభిమానం
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ ముకుల్ చౌదరీ గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఏడు సిక్సర్లతో మోత మోగించి తన జట్టును గెలిపించాడు. అయితే ఈ ఏడింటిలో తాను కొట్టిన మొదటి సిక్సర్ అన్నింటికంటే ఎక్కువగా నచ్చిందని ముకుల్ మ్యాచ్ తర్వాత చెప్పాడు. వైభవ్ అరోరా వేసిన 17వ ఓవర్లో ఈ సిక్స్ వచ్చింది. అరోరా వేసిన యార్కర్‌ను హెలికాప్టర్ షాట్‌తో లాంగాన్ మీదుగా సిక్స్ బాదిన ముకుల్ తాను ఆరాధించే ధోనిని గుర్తుకు తెచ్చాడు. ధోనిపై ఇష్టంతో క్రికెట్లోకి వచ్చిన ముకుల్ ఇప్పుడు ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌తో స్టార్‌గా మారిపోయాడు. – సాక్షి క్రీడా విభాగంరాజస్తాన్కు చెందిన ముకుల్ ఐపీఎల్లో తన తొలి సీజన్ ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో 14 పరుగులకే పరిమితమైన అతను రెండో మ్యాచ్‌లో 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆడిన ఐదు బంతుల్లోనూ అతను కాస్త తడబడ్డాడు. అయితే ఎక్కువగా ఆందోళన చెందవద్దని, నచ్చినట్లుగా ఆడమని కెపె్టన్ రిషభ్ పంత్ ధైర్యాన్నందించాడు. దాంతో కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ముకుల్ అన్నాడు. ‘ఐదు మ్యాచ్‌లు ఆడినా 50 మ్యాచ్‌లు ఆడినా ఎవరిపైనైనా ఒత్తిడి సహజం. అందులోనూ నేను తొలిసారి ఐపీఎల్లో ఆడుతున్నాను. కాబట్టి జట్టు మనపై నమ్మకం ఉంచినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కూడా ఒత్తిడి ఉంటుంది. దేశవాళీ క్రికెట్లో కూడా మంచి ప్రదర్శన తర్వాతే ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఇక్కడ బాగా ఆడినప్పుడు వచ్చే గుర్తింపు, పేరు ఎంతో భిన్నం. బయటి అంశాల గురించి పట్టించుకోకుండా మనపై మనం నమ్మకం ఉంచి ఆడటం ముఖ్యం’ అని ముకుల్ వ్యాఖ్యానించాడు. ఆ షాట్ అంటే ఇష్టం... అరోరా బౌలింగ్‌లో ముకుల్ కొట్టిన హెలికాప్టర్ షాట్‌పై అన్ని వైపుల నుంచి నుంచి ప్రశంసలు కురిశాయి. ‘మొదటి నుంచి నేను ధోనికి వీరాభిమానిని. వికెట్ కీపర్ అయిన నేను ధోనిలాగే ఏడో స్థానంలో ఆడుతున్నా. ఆయన మ్యాచ్‌లను ముగించే తీరు నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచే హెలికాప్టర్ షాట్‌ను ఎంతో ప్రాక్టీస్ చేశాను. ఆ షాట్ నాకు చాలా నచ్చేది. యార్కర్‌ను ధోని సిక్సర్‌గా మలిచేవాడు. అలాంటి బంతిని సిక్స్ కొట్టడం అంటే బౌలర్‌పై మన ఆధిపత్యం ఏమిటో తెలుస్తుంది. భారీ షాట్లు కొట్టే విధంగా బలమైన శరీర నిర్మాణం నాకుంది. నేను సాధన కూడా చాలా చేస్తాను. ప్రతీ రోజూ దాదాపు 100–150 సిక్సర్లు ప్రాక్టీస్ చేస్తా. గత ఐదారు నెలలుగా ఇదే తరహాలో ఆడటం ఇప్పుడు ఫలితం చూపించింది’ అని 21 ఏళ్ల ముకుల్ వివరించాడు. దేశవాళీలో చెలరేగి... నాలుగు నెలల క్రితం సరిగ్గా ఇదే తరహా ఆటతో ముకుల్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో దృష్టిలో పడ్డాడు. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అప్పటికే సత్తా చాటిన ముకుల్ ఢిల్లీతో జరిగిన పోరులో మరింతగా చెలరేగాడు. ఐపీఎల్లో గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లాగానే రాజస్తాన్ 176 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ముకుల్ 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో అజేయంగా 62 పరుగులు చేసి చివరి బంతికి సిక్స్‌తో జట్టును గెలిపించాడు. ఆయుశ్ బదోని వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి కావాల్సిన 25 పరుగులను అతను రాబట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తర్వాతే వేలంలో లక్నో రూ.2 కోట్ల 60 లక్షలకు తీసుకుంది. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన కారణంగానే తనపై తనకు నమ్మకం ఉందని, ఇప్పుడు దానిని పునరావృతం చేశానని అతను చెప్పాడు. లాంగర్ ప్రోత్సాహంతో... ఐపీఎల్లో లక్నో జట్టుకు ఎంపికైన తర్వాత టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఈ కుర్రాడిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. తన బ్యాటింగ్‌పై నమ్మకంతో పాటు భారీ సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం కోచ్‌ను ఆకట్టుకున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో ‘అత్యంత ప్రమాదకర’ మిడిలార్డర్ బ్యాటర్‌గా ముకుల్‌ను తీర్చిదిద్దుతానని చెప్పి కోచ్ ప్రోత్సాహాన్నందించాడు. ‘అంత పెద్ద కోచ్ నా గురించి ఇలా మాట్లాడాడంటే నాలో ఏదో ప్రత్యేకత ఆయనకు కనిపించి ఉండవచ్చు. ప్రతీ రోజూ 15 నిమిషాల పాటు నా కోసం ప్రత్యేకంగా కేటాయించి సాధన చేయించడమే కాకుండా నేను ఆడాల్సిన ఆట శైలి గురించి వివరించేవారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెలరేగాలని నేనూ గట్టిగా కోరుకున్నా. ఇప్పుడు నా ఆటను చూపించాను’ అని ముకుల్ వెల్లడించాడు. రెండేళ్ల క్రితం బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా తొందరపాటు ప్రదర్శించే వాడినని... అయితే సాధన తర్వాత చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను గెలిపించాలనే పట్టుదల తనలో పెరిగిందని ముకుల్ గుర్తు చేసుకున్నాడు. కోల్‌కతాతో పోరులో బౌలర్ ఏదో ఒక దశలో తప్పు చేస్తాడనే నమ్మకంతోనే వేచి చూశానని చెప్పాడు. తన ఈ ప్రదర్శనను తండ్రికి అంకితం ఇస్తున్నట్లు అతను చెప్పాడు.కుటుంబ త్యాగాలతో... ముకుల్ తండ్రి దలీప్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన తన పెళ్లి కూడా కాకముందే కొడుకు పుడితే క్రికెటర్‌ను చేయాలని నిర్ణయించుకున్నాడు. ముకుల్‌ను 10 ఏళ్ల వయసులో క్రికెట్లోకి తీసుకొచ్చిన సమయంలో తండ్రి ఆరి్థక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కొడుకు శిక్షణలో అండగా నిలిచేందుకు ముందుగా ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశాడు. తనకు వాటాగా వచ్చిన ఇంటిని అమ్మేసి ముకుల్ శిక్షణ కోసం వెచ్చించాడు. రాజస్తాన్‌లోని స్వస్థలం ఝన్‌ఝునులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో జైపూర్‌లోని ఆరావళి అకాడమీలో చేరి్పంచాడు. ఆరంభంలో మీడియం పేసర్‌గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు ఎవరూ లేకపోవడంతో అవకాశాల కోసం అటువైపు మళ్లాడు. అయితే భారీ షాట్లు ఆడే ముకుల్ శైలిని గుర్తించిన కోచ్‌లు ఆ దిశగా బ్యాటింగ్‌లో ప్రోత్సహించారు. ఆరంభంలో సరైన అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత అతని ఆట పదునెక్కింది. బీసీసీఐ అండర్–23 టోర్నీలో రాజస్తాన్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా కెరీర్ దూసుకుపోయింది. టి20ల్లో మారిన పవర్ హిట్టింగ్‌ను మరింత సాధన చేసేందుకు వీలుగా మధ్యలో కొన్ని నెలల పాటు అతను ఢిల్లీలోని గుర్గావ్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అతని కఠోర శ్రమ, పట్టుదల ఇప్పుడు ఐపీఎల్లో ఫలితం చూపించింది. -
'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్'
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం అతడి గురించే మాట్లాడుకుంటోంది. 21 ఏళ్ల ముకుల్ చారిత్రత్మక ఈడెన్‌గార్డెన్స్‌లో అద్భుతం చేశాడు.తన విరోచిత బ్యాటింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓటమి తప్పదకున్న చోట చివరి బంతికి లక్నో గెలిపించి రియల్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 2 ఫోర్లతో పాటు 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. అంటే అతడి సాధించిన పరుగులలో మెజారిటీ భాగం సిక్సర్ల ద్వారానే వచ్చాయి. కాగా మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురుంచి మాట్లాడిన ముకుల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని తన రోల్‌మోడల్ ముకుల్ చెప్పుకొచ్చాడు."మా నాన్నకు పెళ్లి కాకముందే తనకు కొడుకు పుడితే క్రికెటర్‌ను చేయాలని కలలు కనేవారు. ఈ విజయాన్ని మా నాన్నకు అంకితమిస్తున్నాను. అలాగే ధోనీ సర్ మ్యాచ్‌ను ఫినిష్ చేసే తీరును చూస్తూ నేను పెరిగాను. ఆయన నాకు రోల్‌మోడల్. ఇప్పుడు నేను కూడా లోయార్డర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తున్నాను. కాబట్టి ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు కూడా చేస్తున్నాను. శరీర తత్వంగా కారణంగానే నేను ఆడే షాట్లలో అంత పవర్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి షాట్లు ఆడేందుకు నేను చాలా ఎక్కువగా సాధన కూడా చేశాను. ప్రతిరోజూ నెట్స్‌లో సుమారు 100 నుండి 150 సిక్సర్లు కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను. గత ఐదు, ఆరు నెలలుగా మరింత ఎక్కువగా శ్రమిస్తున్నాను.ఆ ఫలితమే ఇప్పుడు నా ఆటలో కనిపిస్తోంది. హెలీకాప్టర్ షాట్ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పటి నుంచే ఆ షాట్‌ను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. ధోని ఫినిషింగ్ స్టైల్ కూడా నాకెంతో ఇష్టం. అతను యార్కర్ బంతిని కూడా సిక్సర్‌గా మలిచేవాడు. అలాంటి బంతిని కూడా సిక్స్ కొడితే, బౌలర్ కచ్చితంగా ఒత్తిడితోకి వెళ్తాడు" అని ముకుల్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం! రూ.13 కోట్ల ఆటగాడిపై వేటు?Meet Mukul Choudhary - He idolised Hardik Pandya - His father was a Teacher- He was unable to pay High fees of Cricket Academies- So he left his job and tried real estate- Luckily he got success there pic.twitter.com/Is4Hftw01N— Amar💫 (@KUNGFU_PANDYA_0) April 9, 2026 -
రికార్డులు కొల్లగొట్టిన రాజస్తాన్ చిన్నోడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్ యువ కెరటం ముకుల్ చౌదరి కూడా అదే జాబితాలో చేరాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముకుల్ చౌదరి 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 54 పరుగులు నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి లక్నోకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ముకుల్ చౌదరి రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులేంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్ చౌదరి ఏడు సిక్సర్లు బాదాడు. ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు బాదిన తొలి లక్నో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సరసన చేరాడు. బ్రావో ఐపీఎల్ 2018 సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదాడు.ఇదే మ్యాచ్‌లో ముకుల్ చౌదరి.. అవేశ్‌ఖాన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. తద్వారా ఐపీఎల్లో టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించిన జట్లలో లక్నోకు 8వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం అని చెప్పొచ్చు.ఇక లక్నో సూపర్‌జెయింట్స్‌కు కేకేఆర్‌పై ఇది ఐదో విజయం. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో తలపడితే అందులో ఈడెన్ గార్డెన్స్ వేదికగానే లక్నో నాలుగు మ్యాచ్‌లు గెలవడం విశేషం.చదవండి: భార్యతో కలిసి చెట్టాపట్టాల్.. ఐపీఎల్‌కు డుమ్మా! -
‘భారత్‌లోనే ప్రమాదకర బ్యాటర్.. ఈ మ్యాచ్‌తో నిరూపించాడు’
ముకుల్ చౌదరి.. ఒక్క మ్యాచ్‌తో భారత క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయిందీ పేరు. ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం నాటి పోరులో.. ఈ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు అవసరం కాగా... ఇందులో 54 తానొక్కడే చేశాడు.27 బంతుల్లోకోల్కతా విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ముకుల్ చౌదరి.. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా లక్నోను విజయతీరాలకు చేర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో లక్నో హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ ముకుల్ చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా.. ‘‘వచ్చే నాలుగు నెలల్లో ఇండియాలోనే ఆరు లేదంటే ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ముకుల్ ఎదగడం ఖాయం’’ అని లాంగర్ అన్నాడు.What JL said 🧿 pic.twitter.com/c7y4oI4Sgn— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2026ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాతో మ్యాచ్ సందర్భంగా ముకుల్ గురించి లాంగర్ చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ ముకుల్ చౌదరి?రాజస్తాన్‌కు చెందిన 21 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్ బౌలర్‌గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు దృష్టి సారించాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.ఇక దేశీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 199 స్ట్రయిక్‌రేట్‌తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదగడం ఖాయం’ అని లాంగర్ ఐపీఎల్‌కు ముందు వ్యాఖ్యానించగా... ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించడం విశేషం. This is 𝐂𝐈𝐍𝐄𝐌𝐀 🫡🤯 pic.twitter.com/JTxw0DUgqM— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2026చదవండి: Yuvraj Singh: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
‘సరదాగా అన్న మాట ఇవాళ నిజమైంది’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చిందని లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ముకుల్ చౌదరీ ప్రదర్శనపై మాటలు రావడం లేదని పంత్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో గురువారం లక్నో 3 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘ఏం చెప్పాలి.. ముకుల్ చౌదరీ గురించి మాటలు రావడం లేదు. నేను అతన్ని తొలిసారి నెట్స్‌లో చూసినప్పుడే భవిష్యత్తులో మంచి బ్యాటర్ అవుతాడని ఊహించాను. ఇవాళ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్ దానిని నిజం చేసి చూపెట్టాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌ను కళ్ల ప్పగించి చూస్తూ ఉండిపోయాను. అనామక ఆటగాళ్లకు ఐపీఎల్ వెలుగునిచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలో ముకుల్‌చౌదరీ కూడా చేరిపోయాడు. ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు. ఇలాంటి ప్రతి మ్యాచ్ కూడా జట్టులో ఏదో ఒక గొప్ప విషయం నిర్మితమవుతోందనే సంకేతాన్ని ఇస్తోంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముకుల్ చౌదరీ మూడు బంతులు వరుసగా మిస్ చేశాడు. ఆ సమయంలో అతడి దగ్గరకి వెళ్లి కంగారు పడొద్దు.. భవిష్యత్తులో నీకు అవకాశాలు బాగా వస్తాయి అని చెప్పాను. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్‌కు ఆ అవకాశం రానే వచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కడదాకా నిలిచి ఒంటిచేత్తో గెలిపించాడు. ఒక కెప్టెన్‌గా ఇంతకన్నా నాకేం కావాలి చెప్పండి.బదోని ఇప్పుడు మా జట్టులో సీనియర్ ప్లేయర్. అతనికి మేం ఇచ్చిన బాధ్యత అది. బదోని నుంచి మేం ఆశించే సహకారం ఇదే. షమీ కుర్రాడు కాదు. కానీ అతను జట్టుకు ఇచ్చే అనుభవం వెలకట్టలేనిది. అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం అద్భుతం. బౌలింగ్ యూనిట్ అంతా బాగా రాణిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.During Match Between LSG & SRH When Mukul Choudhary missed three balls, Rishabh Pant told him: “Don’t feel nervous, you’ll get many more opportunities in the future.”Today, Mukul Choudhary won the match single-handedly for Rishabh Pant’s LSG. 😭❤️pic.twitter.com/FhDIDunk1B— Cricket Central (@CricketCentrl) April 9, 2026చదవండి: ‘సైందవుడిలా అడ్డుపడి కొంపముంచాడు’ -
‘సైందవుడిలా అడ్డుపడి కొంపముంచాడు’
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్( కేకేఆర్) హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. గురువారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపు దిశగా సాగింది. అయితే చివర్లో ముకుల్ చౌదరి సైందవుడిలా అడ్డుపడి ఒంటిచేత్తో కేకేఆర్ నుంచి గెలుపును లాగేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మ్యాచ్ ఓటమిపై స్పందించాడు.'ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. కానీ మా కుర్రాళ్లు ఆడిన తీరు అమోఘం. ముకుల్ ఆడిన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతను షాట్లు ఆడిన తీరు అమోఘం. ఇలాంటి మ్యాచ్‌ల్లో తప్పులను వెతకకూడదు. మా ప్రణాళికల అమల్లో చిన్న చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు. కానీ ముకుల్ ఆడిన తీరుకు, అతడి ఇన్నింగ్స్‌కు క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే.పిచ్‌పై స్లో బంతులు బాగానే పనిచేశాయి. అందుకే ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించారు. ముకుల్ షాట్లు మాత్రం అద్భుతం. మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చిందనుకున్న దశలో ముకుల్ చౌదరి సూపర్ ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.ఈ వికెట్‌పై 180-185 అనేది మంచి స్కోరు. ఏది ఏమైనా లక్నో బ్యాటర్లు ఆడిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఆఖరి ఓవర్లో ఆవేష్ ఖాన్నే ఎక్కువ సేపు స్ట్రైకింగ్‌లో ఉంచాలని ఫీల్డింగ్ ముందుకు పెట్టాం. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా ఐదుగురు ఫీల్టర్లు సర్కిల్ లోపల ఉన్నప్పుడు చివరి ఓవర్ వేయడం బౌలర్లకు కష్టమే. అయితే ఈ ఓటమిపై విశ్లేషించుకుంటాం. లోపాలు సరిచేసుకుంటాం. రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఎలా ఆడాలనే విషయాన్ని ఆలోచిస్తాం.'అని రహానే పేర్కొన్నాడు. కేకేఆర్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.చదవండి: ‘ఈ ఇన్నింగ్స్ మా నాన్నకు అంకితం’ -
‘ఈ ఇన్నింగ్స్ మా నాన్నకు అంకితం’
ఐపీఎల్ 2026 సీజన్లో ముకుల్ చౌదరీ రూపంలో నయా స్టార్ పుట్టుకొచ్చాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలో ఉన్న లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఒంటిచేత్తో గెలిపించిన ముకుల్ చౌదరీ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముకుల్ చౌదరీ మాట్లాడాడు. ఈరోజుతో తన నాన్న కల నెరవేరిందని.. ఇన్నింగ్స్‌ను ఆయనకు అంకిత మిస్తున్నట్లు తెలిపాడు.‘నేను క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల. అయితే నా చిన్నతనంలో మా కుటుంబ పరిస్థితి అంత బాగుండక పోవడంతో క్రికెట్‌ను ఆడలేకపోయాను. అయితే 12-13 ఏళ్ల వయస్సులో తొలిసారి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఆరోజుల్లో క్రికెట్ అకాడమీలు ఎక్కువగా ఉండేవి కావు. అందుకే మాకు దగ్గర్లో ఉన్న సికర్‌లోని ఎస్బీఎస్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడే ఒక ఐదు నుంచి ఆరేళ్ల పాటు ఆటలో మెళుకువలు నేర్చుకోవడంతో పాటు క్రికెటర్‌గా ట్రెయిన్ అయ్యాను. ఆ తర్వాత హయ్యర్ లెవెల్‌కు ఆడాలనే ఉద్దేశంతో జైపూర్‌కు నా మకాం మార్చాను. ఆ తర్వాత టీ20 క్రికెట్ ఉన్నతస్థాయికి చేరుకోవడంతో గుర్గావ్లో మూడు నుంచి నాలుగు నెలలల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత ఢిల్లీలో ఆడిన చాలా మ్యాచ్‌లు నా కెరీర్‌కు ఉపయోగపడ్డాయి. ఇక యూపీతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో నా ప్రదర్శనను చూసి నేను క్రికెటర్ అవుతాననే విషయాన్ని మా నాన్న నమ్మాడు. అది లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మా జట్టులో ఎవరు పెద్దగా ఆడలేదు. నేను మాత్రమే మంచి స్కోర్ సాధించాను. అప్పుడే క్రికెట్లో నేను పెద్ద స్థాయికి చేరుతానన్న నమ్మకం మా నాన్నకు కలిగింది. ఇక ఫ్లడ్ లైట్ల కింద నేను ఆడిన రెండో మ్యాచ్ ఇది. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఒత్తిడిలా కాకుండా గోల్డెన్ ఛాన్స్‌లా చూశాను. చివరి వరకు ఆడాలనేదే నా ప్లాన్. నేను క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలననే నమ్మకం నాకుంది. ఈరోజు కొట్టిన మొదటి సిక్స్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజు నేను కొట్టిన మొదటి సిక్స్ అదే. ఆఖరి ఓవర్లో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. ఏదో ఒక బంతి నా జోన్లోకి వస్తుందని తెలుసు. ఒక్క సిక్స్ కొడితే చాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను హిట్టింగ్ చేస్తున్నాను. బంతి నా జోన్లో ఉంటే బాదేస్తాను. సిక్సర్లు కొట్టడం నాకు చాలా ఇష్టం. ఇవాళ రాత్రి నువ్వు ఒక జవాన్లా (దేశానికి సేవ చేసే సైనికుల్లో చాలా మంది రాజస్తాన్‌లోని ఝున్ఝు ప్రాంతం నుంచి వచ్చేవారు. ఇది ముకుల్ చౌదరీ స్వస్థలం)ఆడావు అని చాలా మంది మెచ్చుకుంటున్నారు. అవును సార్.. అది నా రక్తంలోనే ఉంది. నేను ఇక్కడ గ్రౌండ్లో ఆడుతున్నాను.. వాళ్లు సరిహద్దులో కాపలా కాస్తూ దేశానికి సేవ చేస్తున్నారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికి వస్తే 182 పరుగుల ఛేదనలో లక్నో 6 ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. 32 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరీ 27 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 54 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి కాగా, లక్నోకు ఇది రెండో విజయం.Pressure? What pressure? 🤷♂️🎥 🗣️ It's all about belief and rising to the occasion for Mukul Choudhary 🙌Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG | @LucknowIPL pic.twitter.com/M2Y1F9x3ym— IndianPremierLeague (@IPL) April 9, 2026 Another day, another #TATAIPL thriller 🤩@LucknowIPL get over the line in a last-ball finish, courtesy of Mukul Choudhary's heroics 🫡Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #KhelBindaas | #KKRvLSG pic.twitter.com/VLthHCB8Cm— IndianPremierLeague (@IPL) April 9, 2026చదవండి: జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా! -
ముకుల్ సిక్సర్ల మోత
182 పరుగుల ఛేదనలో 6 వికెట్లు కోల్పోయి ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరగ్గా... లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు కావాలి. ఈ దశలో కోల్‌కతా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ యువ ఆటగాడు ముకుల్ చౌదరీ భిన్నంగా ఆలోచించాడు. చివరి మూడు ఓవర్లలో రెండేసి సిక్సర్లతో చెలరేగిపోయి కేకేఆర్ పని పట్టాడు.57లో తానొక్కడే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి లక్నోకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆఖరి 4 ఓవర్లలో వరుసగా 11, 13, 16, 14 పరుగులు రాబట్టి సూపర్ జెయింట్స్ మ్యాచ్ గెలుచుకుంది. సొంత మైదానంలో విజయానికి చేరువగా వచ్చిన కోల్‌కతా మరో ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. కోల్‌కతా: ఐపీఎల్లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పైచేయి సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రఘువంశీ (33 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజింక్య రహానే (24 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రావ్మన్ పావెల్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. రెండో వికెట్‌కు రహానే, రఘువంశీ 52 బంతుల్లో 84 పరుగులు చేయగా... ఐదో వికెట్‌కు గ్రీన్, పావెల్ 40 బంతుల్లో అభేద్యంగా 70 పరుగులు జోడించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ముకుల్ చౌదరీ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, ఆయుశ్ బదోని (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధసెంచరీ సాధించాడు. బ్యాటింగ్ తడబాటు... ప్రిన్స్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఫిన్ అలెన్ (8) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌండరీ వద్ద రాఠీ పట్టిన ఈ క్యాచ్ చర్చకు దారి తీసింది. క్యాచ్ పట్టే సమయంలో అతని కాలు తగిలి కుషన్ స్వల్పంగా కదిలినట్లు అనిపిస్తున్నా... మూడో అంపైర్ వేర్వేరు కోణాల్లో పరీక్షించకుండానే అలెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు! ఈ దశలో రఘువంశీ, రహానే కలిసి కీలక పరుగులు జోడించారు. అయితే లక్నో బౌలర్లు చెలరేగడంతో ఒక్కసారిగా కోల్‌కతా జోరు తగ్గింది. 19 బంతుల వ్యవధిలో 12 పరుగులు మాత్రమే చేసి జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు బౌండరీనే రాలేదు! ఇలాంటి స్థితిలో గ్రీన్, పావెల్ దూకుడుగా ఆడారు. చివరి 4 ఓవర్లలో కేకేఆర్ 54 పరుగులు రాబట్టింది. బదోని అర్ధ సెంచరీ... ఛేదనలో మార్క్రమ్ (22), మార్ష్(15) తొలి వికెట్‌కు 25 బంతుల్లో 41 పరుగులు జోడించి లక్నోకు మెరుగైన ఆరంభం అందించారు. సైనీ ఓవర్లో మార్క్రమ్ వరుసగా 4, 6, 4తో ధాటిని ప్రదర్శించాడు. అయితే అరోరా ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపి దెబ్బ కొట్టగా... ఎట్టకేలకు ఈ సీజన్లో బౌలింగ్‌కు దిగిన గ్రీన్ తన తొలి ఓవర్లోనే పంత్ (10)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత పూరన్ (13), సమద్ (2) విఫలం కాగా, బదోని కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. బదోని అవుటైన తర్వాత లక్నో దాదాపు ఆశలు కోల్పోగా... ముకుల్ అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించాడు. రాజస్తాన్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరీ జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్‌బౌలర్‌గా మొదలు పెట్టినా...అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు మళ్లాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 199 స్ట్రయిక్‌రేట్‌తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదగడం ఖాయం’ అని లక్నో కోచ్ లాంగర్ ఐపీఎల్‌కు ముందు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించాడు. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: గువాహటిరాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) షమీ (బి) రాఠీ 41; అలెన్ (సి) రాఠీ (బి) ప్రిన్స్ 9; రఘువంశీ (సి) మార్క్రమ్ (బి) సిద్ధార్థ్ 45; గ్రీన్ (నాటౌట్) 32; రింకూ (బి) అవేశ్ 4; పావెల్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–15, 2–99, 3–105, 4–111. బౌలింగ్: షమీ 4–0–27–0, ప్రిన్స్ యాదవ్ 4–0–47–1, సిద్ధార్థ్ 4–0–34–1, దిగ్వేశ్ రాఠీ 4–0–25–1, అవేశ్ 4–0–44–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్(సి) రఘువంశీ (బి) అరోరా 15; మార్క్రమ్ (సి) పావెల్ (బి) అరోరా 22; పంత్ (సి) త్యాగి (బి) గ్రీన్ 10; బదోని (సి) రింకూ (బి) రాయ్ 54; పూరన్ (సి) రమణ్‌దీప్ (బి) త్యాగి 13; సమద్ (బి) రాయ్ 2; ముకుల్ (నాటౌట్) 54; షమీ (సి) రాయ్ (బి) నరైన్ 1; అవేశ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–41, 2–42, 3–73, 4–95, 5–104, 6–125, 7–128. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–38–2, రాయ్ 4–0–32–2, సైనీ 3–0–37–0, నరైన్ 4–0–13–1, త్యాగి 3–0–31–1, గ్రీన్ 2–0–28–1. -
ఓడిపోయే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.. ఎవరీ ముకుల్ చౌదరి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మరో సూపర్ స్టార్ పుట్టుకొచ్చాడు. తన సంచలన బ్యాటింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ వంటి విధ్వంసకర ఆటగాళ్ల విఫలమైన చోట.. ఆ యువ ఆటగాడు అద్భుతం సృష్టించాడు. ఒంటో చేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతడే లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి.ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోయే మ్యాచ్‌ను ఓంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు.అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్ ప్లేలోనే ఓపెనర్లు మార్క్రమ్ (22), మార్ష్(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్(10), పూరన్(13), సమద్(2) ముగ్గురు కూడా వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అయూశ్ బదోని(54) మాత్రం దూకుడుగా ఆడుతూ కేకేఆర్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు.కానీ అదే సమయంలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి కేకేఆర్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం అయూశ్ బదోని సైతం ఔటయ్యాడు. అప్పటికే చివరి నాలుగు ఓవర్లలో లక్నో విజయానికి 50 పరుగులు కావాలి. రెగ్యులర్ బ్యాటర్లు ఎవరు లేకపోవడంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు.తొలి ఆరు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసిన ముకుల్.. ఆఖరి నాలుగు ఓవర్లలో విశ్వరూపాన్ని చూపించాడు. వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 4, 6, 1 బాది 11 పరుగులు రాబట్టిన ముకుల్ చౌదరి.. తర్వాత కార్తీక్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 2 సిక్సర్లతో 13 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమయ్యాయి.ఈ సమయంలో కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ముకుల్ 6, 4, 6 బాది 16 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆరోరా వేసిన చివరి ఓవర్లో లక్నో విజయ సమీకరణం 14 పరుగులుగా మారింది. తొలి బంతిని అవేష్ సింగిల్ తీసి ముకుల్ చౌదరికి స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ముకుల్.. రెండో బంతిని డీప్ స్క్వేర్-లెగ్ దిశగా భారీ సిక్సర్‌గా మలిచాడు.అనంతరం వరుసగా రెండు బంతులకు ఎలాంటి పరుగులు రాకపోవడంతో లక్నో డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతికి ముకుల్ సిక్స్ బాది స్కోర్లను సమం చేశాడు. చివరి బంతికి బై రూపంలో పరుగు తీసి తన జట్టుని గెలిపించాడు. ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ ముకుల్ చౌదరి నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ ముకుల్ చౌదరి?21 ఏళ్ల ముకుల్ చౌదరి.. రాజస్తాన్‌లోని ఝున్‌ఝునులో జన్మించాడు. ముకుల్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అతడి తండ్రి ముకుల్‌ను గొప్ప క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు. కానీ అప్పట్లో వారి ఆర్ధిక పరిస్థితి అంత బాగోలేకపోవడంతో సరైన అకాడమీలో చేర్చలేకపోయాడు. ఆఖరికి పైసా పైసా కూడబెట్టి 12-13 ఏళ్ల వయసులో తొలిసారి ముకుల్‌ను ఓ క్రికెట్ ఆకాడమీలో అతడి తండ్రి చేర్చాడు. ముకుల్ మొదట్లో మీడియం ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ పొందాడు. అయితే తన అకాడమీ జట్టులో వికెట్ కీపర్ లేకపోవడంతో కీపింగ్ గ్లౌవ్స్ ధరించాడు. ఆపై అతడు బౌలింగ్‌ను పక్కన పెట్టి స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా మారిపోయాడు. ముకుల్ 2023లో రాజస్థాన్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో 165+ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.అంతేకాకుండా గతేడాది జరిగిన అండర్-23 వన్డే టోర్నమెంట్లో కూడా అతడు రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2026 వేలానికి ముందు అతడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్రయల్స్‌కు పిలిచింది.ట్రయల్స్‌లో కూడా తన అద్భుత బ్యాటింగ్‌తో ముంబై స్కౌట్లను ఆకట్టుకున్నాడు. దీంతో ముకుల్‌ను వేలంలో కొనుగోలు చేయాలని ముంబై భావించింది. రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. ఆఖరికి లక్నో రూ. 2.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముకుల్ ఆడిన రెండు మ్యాచ్‌లలో అతడు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. కానీ అతడికి లక్నో మేనెజ్మెంట్ మరోసారి అవకాశమచ్చింది. ఈసారి తన మూడో మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్‌తో మేనెజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకు 4 ఫస్ట్ క్లాస్, 5 లిస్ట్-ఎ, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.


