Mullah Akhtar Mansoor
-
'నేను చనిపోలేదు.. బతికేవున్నా'
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో జరిగిన కాల్పుల్లో తాను చనిపోయినట్టు వచ్చిన వార్తలు అబద్ధమని, తాను బతికున్నానని అఫ్ఘానిస్తాన్ తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ వెల్లడించాడు. ఈ మేరకు ఓ ఆడియోను విడుదల చేశాడు. 'పాకిస్తాన్‌లోని కుచ్లక్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నేను గాయపడినట్టు కానీ చనిపోయినట్టుగా కానీ వచ్చిన వార్తలు అబద్ధం. నాతో పాటు సహచరులు క్షేమంగా ఉన్నారు. నేను కుచ్లక్లో లేను. ప్రత్యర్థులు కుట్రంలో భాగంగా ఈ వదంతులు పుట్టించారు. తాలిబన్ల మధ్య విబేధాలు సృష్టించడం కోసం నేను చనిపోయినట్టు ప్రచారం చేశారు' అని ఆడియోలో మన్సూర్ పేర్కొన్నాడు. పాక్‌లో మన్సూర్ చనిపోయాడని అఫ్ఘాన్ అధికారి ప్రకటించిన రెండు రోజుల తర్వాత శనివారం ఈ ఆడియోను విడుదల చేశారు. -
'చనిపోలేదు.. త్వరలోనే ఆడియో వినిపిస్తాం'
ఇస్లామాబాద్: తమ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్ చనిపోయాడని వస్తున్న వార్తలు అవాస్తవాలని అఫ్గనిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించింది. త్వరలోనే ఆయన ఆడియోను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అసలు ఆయనపై ఎలాంటికాల్పులు జరగలేదని, ఆయనకు ఎలాంటి గాయాలు అవలేదని ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుందని తాలిబన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. 'మా చీఫ్ ముల్లా అఖ్తర్ సందేశం మాకు అందించింది. దానిని త్వరలోనే మేం మీకు విడుదల చేస్తాం. శత్రువులు మానసికంగా దెబ్బకొట్టేందుకు మా నేత చనిపోయాడని ప్రకటించారు. అతడు చనిపోయాడా బతికున్నాడా అనేది త్వరలోనే మీకు తెలుస్తుంది' అంటూ తాలిబన్ అధికార ప్రతినిథి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. పాకిస్థాన్‌లో చోటుచేసుకున్న గన్ ఫైట్‌లో అఖ్తర్ చనిపోయినట్లు అప్గనిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని నాడే తాలిబన్లు కొట్టిపారేశారు.