mulsims
-
బతుకమ్మ మీరే చేస్తారా..!? మాకు మనసుంది.. పండుగ మేము చేస్తామంటూ..
సాక్షి, కరీంనగర్: తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి వేడుకల్లో పాల్గొన్న ముస్లిం యువతి సుల్తానా బేగం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మండలంలోని బూర్గుపల్లికి చెందిన సుల్తానాబేగం ఆదివారం బతుకమ్మను పేర్చి గ్రామస్తులతో కలిసి సంబురంగా వేడుకల్లో పాల్గొంది. సుల్తానా బేగంను ఎమ్మెల్యే రవిశంకర్, సర్పంచ్ రమ్య, ఎంపీటీసీ లక్ష్మి అభినందించారు. -
సుదర్శన్ టీవీకి షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చట్టంలోని ప్రోగ్రాం కోడ్‌ను ఉల్లంఘించిన సుదర్శన్ టీవీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సదరు టీవీలో ప్రసారమయ్యే ‘బిందాస్ బోల్’అనే కార్యక్రమంలోని కొన్ని అంశాలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసుపై ప్రభుత్వం తీసుకునే చర్యలు తమ ఉత్తర్వులకు లోబడి ఉండాలని కోర్టు పేర్కొంది. తమకు నోటీసు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుదర్శన్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది. కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్(రెగ్యులేషన్) చట్టం-1995లో సెక్షన్ 20-సబ్ సెక్షన్ (3) కింద సుదర్శన్ టీవీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై టీవీ యాజమాన్యం 28వ తేదీలోగా స్పందించాలని, లేదంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ప్రభుత్వ యంత్రాంగంలోకి ముస్లింలు అక్రమంగా చొరబడుతున్నారంటూ సుదర్శన్ టీవీ ఇటీవల ప్రసారం చేసిన కార్యక్రమం తీవ్ర వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. -
ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్ శుభాకాంక్షలు
సాక్షి, రాజ్‌భవన్: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికనే రంజాన్ పర్వదినం అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయన ఆదివారం రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ‘ఈద్ ఉల్ ఫితర్’ ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడని ఆయన అన్నారు. రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని గవర్నర్ చెప్పారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో రంజాన్ మాసం ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కఠోర ఉపవాసవ్రతం సహనాన్ని పెంచుతుందని గవర్నర్ తెలిపారు. సర్వమానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే పండుగ రంజాన్ అని ఆయన చెప్పారు. రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిసస్తునన్నానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. -
ప్రపంచంలో ఏది అతిపెద్ద మతమో తెలుసా?
వాషింగ్టన్: ప్రపంచంలో జనాభా పరంగా ఏ మతం అమిత వేగంగా పెరుగుతోందో, ఏ మతం వెనకబడి పోతుందో తెలుసుకునేందుకు అమెరికాలోని ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ ఓ అధ్యయనం జరిపింది. ఊహించినట్లుగా అన్ని మతాలకన్నా ముస్లిం మతం సంఖ్యా పరంగా ముందుకు దూసుకెళుతోంది. 2010 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 31.4 శాతంతో క్రైస్తవులు అతిపెద్ద మతంగా ఆవిర్భవించగా 2050 నాటికి జనాభాలో అంతేశాతంతో అది ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా తన స్థానాన్ని నిలుపుకోనుంది. కానీ 2070 నాటికి క్రైస్తవుల మతాన్ని అతిక్రమించి ముస్లిం మతం ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఆవిర్భవించనుంది. 2010 లెక్కల ప్రకారం ముస్లింలు ప్రపంచంలో 23.2 శాతంతో రెండవ అతిపెద్ద మతంగా ఆవిర్భవించగా, 2050 నాటికి ప్రపంచ జనాభాలో 29.7 శాతంతో సంఖ్యాపరంగా ముందుకు దూసుకుపోనుంది. అయినప్పటికీ దాని రెండో స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు. 2070 నాటికి మాత్రం ప్రపంచంలో ముస్లింలదే అతిపెద్ద మతం అవుతుంది. నాస్తికులు, ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య కూడా 2010 లెక్కల ప్రకారం ఎక్కువే ఉంది. ప్రపంచ జనాభాలో 16.4 శాతంతో వీరి సంఖ్య మూడో స్థానంలో ఉండగా, 2050 నాటికి 13.2 శాతానికి తగ్గినప్పటికీ అదే మూడో స్థానాన్ని నిలుపుకోనుంది. వీరి సంఖ్య ఫ్రాన్స్, అమెరికా లాంటి సెక్యులర్ దేశాల్లో పెరుగుతుండగా, రిలీజియన్ దేశాల్లో గణనీయంగాతగ్గుతోంది. 2010 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 15 శాతంతో హిందువులు నాలుగో స్థానంలో ఉండగా, 2050 నాటికి 14.9 శాతానికి తగ్గి అదే నాలుగో స్థానాన్ని నిలుపుకోనుంది.2010 లెక్కల ప్రకారమే బౌద్ధులు 7.1 శాతంతో ఐదో స్థానంలో ఉండగా, 2050 నాటికి సంఖ్యాపరంగా కూడా తగ్గి జనాభాలో 5.2 శాతానికి పడిపోనుంది. అయినప్పటికీ అది ఐదో స్థానంలోనే కొనసాగనుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న వివిధ మతాల తెగలు, చిన్న మతాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతూ 2050 నాటికి జనాభాలో శాతం పరంగా తగ్గనున్నాయి. ప్రపంచ జనాభాలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న యూదులు 2050 నాటికి సంఖ్యాపరంగా కాస్త పెరిగినప్పటికీ ప్రపంచంలో 0.2 శాతంతోనే వారు కొనసాగనున్నారు. సెక్యులర్ దేశాల్లో తరగుతున్న యువ జనాభా, వర్ధమాన దేశాల్లో పెరుగుతున్న సంతానోత్పత్తి, తగ్గుతున్న శిశు మరణాలు, ఆయా దేశాల్లోని భౌగోళిక పరిస్థితులు, ఏ మతంలో సంతానోత్పత్తి శాతం ఎలా ఉందన్న అంశాలనే కాకుండా, ఏ మతం నుంచి ఏ మతానికి మత మార్పిడులు ఎక్కువ జరుగుతున్నాయి, వారి సంఖ్య ఎంత అన్న అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రధాన మతాల పెరుగుదలను నిపుణులను అంచనా వేశారు. మత మార్పిడి అంశంలో అప్పటి పరిణామాలను అనుసరించి అంచనాలు కాస్త అటు, ఇటయ్యే అవకాశాలు లేకపోలేదని నిపుణులు తెలిపారు. ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య సబ్ సహారా ఆఫ్రికాలో పెరుగుతుండగా, ఉత్తర అమెరికా, ఫ్రాన్స్, యూరప్, చైనా, జపాన్ దేశాల్లో నాస్తికులు లేదా మత విశ్వాసంలేని వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చైనా, జపాన్ దేశాల్లో బౌద్ధుల సంఖ్య గణనీయంగా పడిపోతుండడం మరో ఆశ్చర్యకర పరణామం.