టాటా మోటార్స్‌కు రూ.900 కోట్ల ఆర్మీఆర్డర్
న్యూఢిల్లీ: భారత సైనిక దళాల నుంచి రూ.900 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ఈ ఆర్డర్లో భాగంగా టాటా మోటార్స్ ఇండియన్ ఆర్మీకి 1,200 హై-మొబిలిటీ మల్టీ యాక్సిల్ ట్రక్కులను సరఫరా చేయాల్సి ఉంది. ఈ ట్రక్కులను మందుగుండు సామాగ్రి సరఫరా, ఇతర పరికరాలను ఒకచోటు నుంచి మరొక చోటుకు రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. హై-మొబిలిటీ వాహనాల తయారీలో అపార అనుభవం తమ సొంతమని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ వెర్నాన్ నొరొన్హ తెలిపారు.