గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
ముంబైలోని ముంబై పోర్ట్ ట్రస్ట్ 2020–21 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 11
► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–05, టెక్నీషియన్ అప్రెంటిస్–06.
► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
► టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఏటీసీ, బందర్‌భవన్, థర్డ్ ఫ్లోర్, ఎన్.వీ.నక్వా మార్గ్, మజగాన్(ఈస్ట్), ముంబై–400010 చిరునామాకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021
► వెబ్సైట్: www.mumbaiport.gov.in
నీప్‌కోలో 94 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు
షిల్లాంగ్(మేఘాలయ)లోని భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(నీప్కో).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 94
► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–44, టెక్నీషియన్ అప్రెంటిస్–50.
► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఐటీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
► టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్, ఐటీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.15,000 చెల్లిస్తారు. వయసు: 31.07.2021 నాటికి 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఈమెయిల్: neepco.apprentices20@gmail.com
► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
► ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021
► వెబ్సైట్: https://neepco.co.in
ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్, పాలక్కడ్‌లో 21 ట్రెయినీలు
కేరళలోని పాలక్కడ్‌లో ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 21
► పోస్టుల వివరాలు: ట్రెయినీ(ఇంజనీర్) డిజైన్ అండ్ ఇంజనీరింగ్–04, ట్రెయినీ(ఇంజనీర్) కమర్షియల్–13, ట్రెయినీ(డ్రాఫ్ట్స్‌మెన్), మెకానికల్ ఇంకజనీరింగ్ –04.
► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
► వయసు: పోస్టుల్ని అనుసరించి 01.07.2021 నాటికి 25, 27 ఏళ్లు మించకుండా ఉండాలి.
► జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.9000, రూ.12,000 చెల్లిస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్ పర్సనల్ ఆఫీసర్(పీఅండ్ఏ), ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్, కంజికోడ్ వెస్ట్, పాలక్కడ్–678–623 చిరునామకు పంపించాలి.
► ఈమెయిల్: hr@ilpgt.com
► దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021
► వెబ్సైట్: www.ilpgt.com