గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు | Mumbai Port Trust Recruitment 2021: Apprentice Vancancies, Stipend Details Here | Sakshi
Sakshi News home page

గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

Published Thu, Aug 12 2021 6:38 PM | Last Updated on Thu, Aug 12 2021 6:49 PM

Mumbai Port Trust Recruitment 2021: Apprentice Vancancies, Stipend Details Here - Sakshi

ముంబైలోని ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌ 2020–21 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ముంబైలోని ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌ 2020–21 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 11

► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–05, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌–06.

► గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

► వయసు: 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిప్లొమా/ఇంజనీరింగ్‌ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఏటీసీ, బందర్‌భవన్, థర్డ్‌ ఫ్లోర్, ఎన్‌.వీ.నక్వా మార్గ్, మజగాన్‌(ఈస్ట్‌), ముంబై–400010 చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021

► వెబ్‌సైట్‌: www.mumbaiport.gov.in


నీప్‌కోలో 94 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు

షిల్లాంగ్‌(మేఘాలయ)లోని భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన నార్త్‌ ఈస్ట్రన్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(నీప్‌కో).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 94
► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–44, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌–50.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఐటీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.

► టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్, ఐటీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.15,000 చెల్లిస్తారు. వయసు: 31.07.2021 నాటికి 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఈమెయిల్‌: neepco.apprentices20@gmail.com

► నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021

► ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021

► వెబ్‌సైట్‌: https://neepco.co.in 



ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్, పాలక్కడ్‌లో 21 ట్రెయినీలు

కేరళలోని పాలక్కడ్‌లో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 21

► పోస్టుల వివరాలు: ట్రెయినీ(ఇంజనీర్‌) డిజైన్‌ అండ్‌ ఇంజనీరింగ్‌–04, ట్రెయినీ(ఇంజనీర్‌) కమర్షియల్‌–13, ట్రెయినీ(డ్రాఫ్ట్స్‌మెన్‌), మెకానికల్‌ ఇంకజనీరింగ్‌ –04.

► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి.

► వయసు: పోస్టుల్ని అనుసరించి 01.07.2021 నాటికి 25, 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

► జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.9000, రూ.12,000 చెల్లిస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌(పీఅండ్‌ఏ), ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్, కంజికోడ్‌ వెస్ట్, పాలక్కడ్‌–678–623 చిరునామకు పంపించాలి.

► ఈమెయిల్‌: hr@ilpgt.com

► దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021

► వెబ్‌సైట్‌: www.ilpgt.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement