muniramaiah
-
భార్య తిట్టిందని..
దొరవారిసత్రం: భార్య తిట్టిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం మీజూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మునిరామయ్య(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన మునిరామయ్యను మద్యం మానేయమని భార్య పలుమార్లు చెప్పింది. బుధవారం రాత్రి మద్యం సేవించి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మునిరామయ్య ఒంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు డిఎస్పిలకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు
కడప(వైఎస్ఆర్ జిల్లా): ముగ్గురు డిఎస్పిలకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. జాన్ మనోహర్, మునిరామయ్య, కోసల రామ్‌లకు కడప కోర్టు ఈ వారెంట్లు జారీ చేసింది. ఈ ముగ్గురు డీఎస్పిలు ఒక ఎస్సీ ఎస్టీ కేసులో కోర్టుకు హాజరు కాలేదు. దాంతో కోర్టు వారికి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.