Munitions
-
ఇక విధ్వంసమే.. 'వైట్ పాస్పరస్ ఆయుధాలతో ఇజ్రాయెల్ దాడి'
లెబనాన్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర పోరు నడుస్తోంది. ఈ క్రమంలో తెల్ల భాస్వరంతో కూడిన ఆయుధాలను ఇజ్రాయెల్ ఉపయోగిస్తోందని లెబనాన్ మానవ హక్కుల సంఘం ఆరోపించింది. అటువంటి ఆయుధాలను ఉపయోగించడం వల్ల పౌరులు తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ దళాలు.. తాము తెల్ల భాస్వరంను ఉపయోగించలేదని స్పష్టం చేశాయి. అక్టోబర్ 10, 11 తేదీల్లో పేలిన పలు బాంబులకు సంబంధించిన వీడియోలను లెబనాన్ మానవ హక్కుల సంఘం పరిశీలించింది. గాజా ఎయిర్‌పోర్టుతో పాటు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండు చోట్ల తెల్ల భాస్వరం ప్రయోగించినట్లు ఆరోపించింది. వెలువడిన తెల్లని పొగలు వైట్ పాస్పరస్‌కు సంబంధించినవేనని అనుమానం వ్యక్తం చేసింది. 155 మీమీ తెల్లభాస్వరానికి సంబంధించిన ఫిరంగి ఆనవాళ్లను గుర్తించినట్లు ఆరోపించింది. ఈ వీడియోలకు సంబంధించిన దృశ్యాలను పాలస్తీనా టీవీ ఛానళ్లు కూడా బహిర్గతపరిచాయి. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మంది బలయ్యారు. తెల్లభాస్వరంతో తీవ్రమైన గాయాలు ఏర్పాడుతాయి. దీనితో గృహాలకు నిప్పు కూడా పెట్టవచ్చు. ధీర్ఘకాలికంగా రోగాలు ప్రబలుతున్న నేపథ్యంలో తెల్ల భాస్వరాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. దీని ఉపయోగం చట్టంవిరుద్ధం. అయితే.. తెల్ల భాస్వరం ఉపయోగంపై తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుతం ఇజ్రాయెల్ చెబుతోంది. ఇదీ చదవండి: గాజాపై భూతల యుద్ధం! -
ఆయుధాల డిపోలో భారీ మంటలు
మాస్కో: రష్యాలో మందు గుండు సామాగ్రి డిపోలో భారీ మంటలు చెలరేగాయి. మాస్కోకు ఆగ్నేయంగా ఉన్న రియాజాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. దాంతో అధికారులు రియాజాన్ చుట్ట పక్కల ఉన్న 10 గ్రామాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. నివేదికల ప్రకారం ఆర్మ్స్ డిపో సమీపంలో మందపాటి పొగ గాలిలో పైకి లేవడాన్ని చూడవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో బూడిద ఆకాశం నుంచి పడటం గమనించవచ్చు. సమీప పొలంలోని మంటలు గాలి ప్రసారం వల్ల డిపోకి తగలడంతో మంటలు చెలరేగినట్లు రష్యా మిలిటరీ టాస్(టీఏఎస్ఎస్) వార్తా సంస్థ పేర్కొంది. (చదవండి: బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం) Rusya'nın Ryazan bölgesinde bulunan askeri depolarda art arda büyük patlamalar meydana geldi. pic.twitter.com/1bg4Uq6EVv — diktatör_yobaz (@zelihagulep1966) October 7, 2020 ఈ ఘటనలో ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ సంభవించినట్లు నివేదికలు లేవు. ఇక ఈ ప్రమాదంపై రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ స్పందించింది. ప్రమాదం సంభవించిన మోటారు మార్గాన్ని మూసి వేస్తున్నామని.. చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల మేర 10 గ్రామాలను ఖాళీ చేయించామని తెలిపింది. -
ఎల్ అండ్ టీ, భెల్‌లకు యుద్ధసామగ్రి తయారీ లెసైన్సు
న్యూఢిల్లీ : నౌకాదళానికి అవసరమయ్యే యుద్ధ సామగ్రిని తయారు చేసే వ్యాపారాలకు సంబంధించి పలు ప్రభుత్వ, ప్రైవేట్ దిగ్గజాలకు కేంద్రం లెసైన్సులు మంజూరు చేసింది. వీటిని దక్కించుకున్న వాటిల్లో లార్సన్ అండ్ టూబ్రో, పిపావవ్, భెల్, ఏబీజీ షిప్‌యార్డ్, అల్ఫా డిజైన్ టెక్నాలజీస్ సంస్థలు ఉన్నాయి. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, హై స్పీడ్ బోట్లు మొదలైన వాటి పనులకు సంబంధించి ఈ లెసైన్సులు ఇచ్చినట్లు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం డీఐపీపీ తమ వెబ్సైట్లో పేర్కొంది.