munna bhai
-
సహచరుడి కథతో సినిమా
జైలు జీవితం ముగించుకొని విడుదలకు రెడీ అవుతున్న సంజయ్ దత్ బయటకు వచ్చాక ఏం చేస్తాడు. ఇప్పుడు బాలీవుడ్ సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది. దాదాపు మూడు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపిన సంజయ్ విడుదల తరువాత తిరిగి సినిమాల్లో కొనసాగుతాడా..? లేక వ్యక్తిగత జీవితంలో బిజీ అవుతాడా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అభిమానులను మదిలో మెదలుతున్నాయి. సంజయ్ మాత్రం తిరిగి సినిమాల్లో నటించడానికే నిర్ణయించుకున్నాడట. శిక్ష అనుభవిస్తున్న సమయంలో కూడా పెరోల్ మీద బయటికి వచ్చి ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సంజూభాయ్, విడుదలైన తరువాత పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు సొంతంగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి, తన బ్యానర్‌పై సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తొలి చిత్రంగా, జైలులో తనతో పాటు గడిపిన వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతని జీవిత విశేషాలతో కథ రెడీ చేసే పనిలో ఉన్నారు సంజయ్ టీం. ఈ సినిమాతో పాటు తన స్నేహితుడు రాజ్ కుమార్ హిరానీతో కలిసి మున్నాబాయ్ సిరీస్‌లో మూడో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న సంజయ్, ఇక వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. -
సంజయ్,సల్మాన్‌లపై సినిమా
సంజయ్ దత్, సల్మాన్‌ఖాన్ జీవితాల ఆధారంగా ఓ సినిమా తీస్తే.. దానికెంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటులుగా ఈ ఇద్దరూ ఎంత పాపులరో, వివాదాలపరంగా కూడా అంతే పాపులర్ కాబట్టే, ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ప్రస్తుతం వీరి జీవితాల ఆధారంగా రచయితగా మారిన దర్శకుడు ముజ్జమ్ బెగ్ ‘మున్నా భాయ్, సల్లుభాయ్’ పేరుతో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ హీరోలిద్దరూ ఎదుర్కొన్న వివాదాల గురించి కాకుండా, వారిలోని సాఫ్ట్ యాంగిల్‌ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారట. తమ అభిమాన కథానాయకులపట్ల అభిమానులు ఏ స్థాయిలోప్రేమాభిమానాలు కనబరుస్తారనేది ప్రధానంగా చూపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో నూతన నటులు శ్రేష్టకుమార్, జుబైర్‌ఖాన్ నటిస్తున్నారు. ఈ ఇద్దరిలో సల్మాన్, సంజయ్‌ల పాత్రలు ఎవరు చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
టమాట వ్యాపారుల నిరసన
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు బుధవారం నిరసనకు దిగారు. మార్కెట్లో లెసైన్‌స కలిగిన టమాట వ్యాపారులను విద్యుత్ మీటర్లు, బిల్లుల పేరుతో అధికారులు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో 20 ఏళ్లుగా టమాట వ్యాపారం చేసుకుంటున్న తమ లావాదేవీలు జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి హంగామా చేస్తున్నారని వాపోయారు. 30 ఏళ్లుగా టమాట వ్యాపారం చేసుకుంటున్న జీఎస్ఆర్ మున్నాభాయ్(షాపు నం.30) షాపునకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, అక్రమ కనెక్షన్లను ప్రోత్సహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని టమాట వ్యాపారులు ఆరోపించారు. అక్రమంగా వ్యాపా రం చేస్తున్న వారి వద్ద డబ్బులు తీసుకుంటూ లెసైన్‌స కలిగిన వ్యాపారులకు మొండిచేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ సూపర్వైజర్ సాంబరెడ్డి, వాచ్‌మన్ రమేష్‌పై మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్‌కు రాత పూర్వకం గా ఫిర్యాదు చేయనున్నామని పేర్కొన్నారు. నిరసన తెలిపిన వారిలో పసుల మధుబాబు, చిరంజీవి, రాజు, గులాం అ హ్మద్, నారాయణ, మనోజ్, ఖన్నా తదితరులు ఉన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కూరగాయల మార్కెట్ సూపర్వైజర్ సాంబరెడ్డి టమాట వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మా ర్కెట్ బయట కరెంట్ అక్రమ కనె క్షన్లను ప్రోత్సహిస్తూ డబ్బుల వసూలు చేస్తున్నారు. లెసైన్‌స వ్యాపారులకు నష్టం జరుగుతోంది. - పసుల మధుబాబు, టమాట వ్యాపారి