సంజయ్,సల్మాన్‌లపై సినిమా | Salman Khan and Sanjay Dutt fans in Munna Bhai Sallu Bhai | Sakshi
Sakshi News home page

సంజయ్,సల్మాన్‌లపై సినిమా

Published Tue, Dec 17 2013 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM

సంజయ్,సల్మాన్‌లపై సినిమా

సంజయ్,సల్మాన్‌లపై సినిమా

సంజయ్ దత్, సల్మాన్‌ఖాన్ జీవితాల ఆధారంగా ఓ సినిమా తీస్తే.. దానికెంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటులుగా ఈ ఇద్దరూ ఎంత పాపులరో, వివాదాలపరంగా కూడా అంతే పాపులర్ కాబట్టే, ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ప్రస్తుతం వీరి జీవితాల ఆధారంగా రచయితగా మారిన దర్శకుడు ముజ్జమ్ బెగ్ ‘మున్నా భాయ్, సల్లుభాయ్’ పేరుతో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 
 అయితే ఈ హీరోలిద్దరూ ఎదుర్కొన్న వివాదాల గురించి కాకుండా, వారిలోని సాఫ్ట్ యాంగిల్‌ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారట. తమ అభిమాన కథానాయకులపట్ల అభిమానులు ఏ స్థాయిలోప్రేమాభిమానాలు కనబరుస్తారనేది ప్రధానంగా చూపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో నూతన నటులు శ్రేష్టకుమార్, జుబైర్‌ఖాన్ నటిస్తున్నారు. ఈ ఇద్దరిలో సల్మాన్, సంజయ్‌ల పాత్రలు ఎవరు చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement