'మావోనేత గణపతితో లెక్చరర్ కు సంబంధాలున్నాయి'
రామ్ లాల్ ఆనంద్ కాలేజి లెక్చరర్ జీన్ సాయిబాబాకు నిషేధిత నక్సలైట్లతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై సాక్ష్యాలు సమర్పించేందుకు భద్రతా సంస్థలు ఢిల్లీ యూనివర్సిటీ వైఎస్ చాన్స్ లర్ కు నివేదిక ఇవ్వనున్నారు.
సీపీఐ(మావోయిస్ట్) నాయకుడు, ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల గణపతి అలియాస్ గణపతితో ప్రత్యక్ష సంబంధాలు జరిపాడని నిఘా సంస్థలు సాక్ష్యాలను సేకరించినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. సాయిబాబా నివాసంలో ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు సోదాలు జరిపి.. కొన్ని వ్యాసాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, కొంత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సీపీఐ (మావోయిస్ట్) పోలిట్ బ్యూరో సభ్యుడు కోబాడ్ గాంధీని విచారించగా.. సాయిబాబా పేరు బయటకు వచ్చిందని.. మావోయిస్ట్ పార్టీకి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ గా సాయిబాబా వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు.