Mushfiqur Rahim Century
-
లేటు వయసులో ఇరగదీస్తున్న బంగ్లా బ్యాటర్.. వరుస సెంచరీలు
BAN VS IRE Test Match: బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ 35 ఏళ్ల ముష్ఫికర్ రహీం లేటు వయసులో కుర్రాళ్లకు మించి రెచ్చిపోతున్నాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన రహీం (తొలి ఇన్నింగ్స్‌లో 126) వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో చివరిసారిగా బ్యాటింగ్ (ఐర్లాండ్‌తో మూడో వన్డేలో రహీంకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రహీం ఆడలేదు) చేసిన రహీం.. ఫలితం తేలకుండా ముగిసిన ఆ మ్యాచ్‌లో 60 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాది శభాష్ అనిపించకున్నాడు. తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో 10వ సెంచరీ నమోదు చేసిన రహీం.. తన జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు చాపచుట్టేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోర్ చేసి 155 పరుగుల ఆధిక్యం సాధించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 5 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో రహీంతో పాటు షకీబ్ అల్ హసన్ (87), మెహిది హసన్ (55) రాణించగా.. ఐరిష్ బౌలర్ ఆండీ మెక్‌బ్రైన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో రోజు మూడో సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. పరుగులేమీ చేయకుండానే నాలుగో బంతికే వికెట్ కోల్పోయింది. జేమ్స్ మెక్కొల్లమ్ను షకీబ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. -
ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ రికార్డు స్కోర్
BAN VS IRE 2nd ODI: సిల్హెట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ వెటరన్ ముష్ఫికర్ రహీం సునామీ శతకం సాధించాడు. కేవలం 60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. Mushfiqur Rahim 100 not out off 60 balls. Fastest hundred in ODIs for Bangladesh.#BCB | #Cricket | #BANvIRE. pic.twitter.com/NtjZXAR7a5 — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ క్రమంలో బంగ్లా టైగర్స్ వన్డేల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు కూడా నెలకొల్పారు. ముష్ఫికర్ మెరుపు సెంచరీతో పాటు లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. Just days after posting their highest ever ODI score of 338 in the first ODI, Bangladesh have broken it again with 349/6 in the second ODI! Mushfiqur Rahim brings up a 60-ball century - the quickest for his nation - with the last ball of the innings #BANvIRE — 🏏Flashscore Cricket Commentators (@FlashCric) March 20, 2023 వన్డేల్లో బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధిక స్కోర్. రోజుల వ్యవధిలోనే బంగ్లాదేశ్ అత్యధిక టీమ్ స్కోర్ రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ఇదే సిరీస్‌లో మార్చి 18న ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 338 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. 2 రోజుల గ్యాప్‌లోనే రికార్డును మెరుగుపర్చుకుంది. Mushfiqur Rahim became the 3rd Bangladeshi batsman to complete 7000 runs in ODIs after Tamim Iqbal and Shakib Al Hasan during the second ODI against Ireland. 🔥#BCB | #Cricket | #BANvIRE pic.twitter.com/xdat9MLMfS — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 6వ స్థానంలో బరిలోకి దిగిన ముష్ఫికర్ ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డే కెరీర్లో 9వ సెంచరీ నమోదు చేయడంతో పాటు 7000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. తద్వారా తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బంగ్లా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీతో ముష్ఫికర్ మరో రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో తమీమ్ ఇక్బాల్ 14 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ముష్ఫికర్ (9), షకీబ్ (9)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. బంగ్లాదేశ్‌పై విజయం
ఫతుల్లా: ఆసియా కప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్లతో అలవోక విజయం సాధించింది. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి మరో ఆరు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. విరాట్ కోహ్లీ (122 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 136) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి చేరువ చేశాడు. వన్డేల్లో అతడికిది 19వ సెంచరీ కావడం విశేషం. 131 వన్డేల్లోనే అతడీ ఘనత సాధించాడు. రహానె (73) హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 117 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుటయ్యాడు. ఓపెనర్ అనాముల్ హక్(77) అర్థ సెంచరీ కొట్టాడు. మోమినల్ హక్ 23, నయీమ్ ఇస్లాం 14, జియావుర్ రెహమాన్ 18, షంసూర్ రెహమాన్ 7 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టాడు. ఆరోన్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు.