Music director Gibran
-
కారులో ఆరు దేశాలు చుట్టొస్తా!
కారులో ఆరు దేశాలు చుట్టొస్తానంటున్నారు యువ సంగీత దర్శకుడు జిబ్రాన్. వాగై చూడవా, కుట్టిపులి చిత్రాలకు సంగీతం అందించినా, విశ్వనటుడు కమలహాసన్ చిత్రాలు ఉత్తమవిలన్,పాపనాశం, తూంగావనం చిత్రాలతో ప్రాచుర్యం పొందిన సంగీతదర్శకుడు జిబ్రాన్ అన్న విషయం తెలిసిందే. ఈయన ఇప్పుడు చెన్నై నుంచి సింగపూర్ వరకూ కారులో ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే జిబ్రాన్ తాజాగా చెన్నై టూ సింగపూర్ అనే చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆరు పాటలు చోటు చేసుకున్న ఈ చిత్ర ఆడియోను ఆరు దేశాల్లో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట. దీని గురించి జిబ్రాన్ తెలుపుతూ అబ్బాస్ అగ్భర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం చెన్నై టూ సింగపూర్ అని తెలిపారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని వినూత్నంగా చేయాలని భావించామన్నారు. అలా వచ్చిన ఆలోచనే చెన్నై నుంచి సింగపూర్ వరకూ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నదని చెప్పా రు. చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయని, చెన్నై నుంచి సింగపూర్ వరకు కారులో ప్రయాణం చేస్తూ ఒక్కో దేశంలో ఒక్క పాటను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. చెన్నై టూ సింగపూర్ రోడ్డు ప్రయాణ రూటును నటుడు అజిత్ ను అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి బంగ్లాదేశ్, అక్కడ నుంచి మియాన్మర్, థాయిల్యాండ్ వె ళ్లి అక్కడ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లనున్నట్లు వెల్లడించారు. మొదట ఒక పాటను చెన్నైలో ఆవిష్కరించి ఆ త రువాత మిగిలిన ఐదు దేశాల్లో ఒక్కో పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
ఆ గుళ్లోనే నా జీవితం మలుపు తిరిగింది
‘‘కమల్‌హాసన్‌తో పరిచయం నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది’’ అంటున్నారు సంగీత దర్శకుడు గిబ్రన్. ప్రస్తుతం ఆయన కమల్ ‘విశ్వరూపం-2’కు సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ హీరోగా ఆయన సంగీతం అందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారాయన. ‘విశ్వరూపం-2’ భారీ సీజీ వర్క్ ఉన్న సినిమా అనీ, అంతటి గొప్ప సినిమాకు సంగీతం అందించడం గర్వంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు. కమల్ ‘ఉత్తమ విలన్’ తర్వాతే ‘విశ్వరూపం-2’ విడుదల అవుతుందని గిబ్రన్ చెప్పారు. తాను స్వరాలందించిన ‘రన్ రాజా రన్’ చిత్రం చాలా ఆసక్తికరంగా సాగే సినిమా అనీ, సంగీత దర్శకునిగా ఓ కొత్త అనుభూతిని ఈ సినిమా తనకు అందించిందని గిబ్రన్ అన్నారు. ‘‘సంగీత దర్శకుడు కాక ముందు నేను పియానో టీచర్ని. ఎంతో మంది పిల్లలకు పియోనో నేర్పిన అనుభవం నాది. సింగపూర్‌లో చదువుకున్నాను. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని చవిచూశాను. పులిహోర పోట్లాల కోసం గుడికెళ్లిన రోజులున్నాయి. ఆ గుళ్లోనే నా జీవితం మలుపుతిరిగింది. నా భార్య పరిచయమైంది అక్కడే. మా కలయిక స్నేహం నుంచి ప్రేమగా మారింది. తను విజయవాడ అమ్మాయి. సైంటిస్ట్. తన పరిచయం నాలో ఊహించని మార్పు తెచ్చింది. ఆమె తర్వాత నా జీవితంపై ప్రభావితం చేసిన మరో వ్యక్తి కమల్‌హాసన్‌గారు. ఆయన్ను కలవక ముందు కలిశాక నా జీవితాన్ని ఊహించుకుంటే... ఉద్వేగం కలుగుతుంది’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు గిబ్రన్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ అరడజను సినిమాల దాకా చేస్తున్నానని, సంగీత దర్శకునిగా కెరీర్ ఆశాజనకంగా ఉందని గిబ్రన్ ఆనందం వెలిబుచ్చారు.