గూడ అంజయ్యకు కొమురం భీం పురస్కారం
హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత గూడ అంజయ్యను ఈ ఏడాది కొమురం భీం జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. కొమురం భీం స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కృతి, భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ఏటా ప్రదానం చేస్తున్నారు.
బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవార్డు కమిటీ చైర్మన్ నాగబాల సురేష్‌కుమార్ వివరాలను వెల్లడించారు. సినీ, టీవీ పరిశ్రమలోవిశేష సేవలందిస్తున్న వారికి తమ ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా పురస్కారాలను అందజేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు సినీ దర్శకుడు సుద్దాల అశోక్ తేజ, సినీ నటులు రాజేంద్రప్రసాద్, దర్శకుడు అల్లాణి శ్రీధర్, శిడాం అర్జున్‌లు ఈ అవార్డులను అందుకున్నారని తెలిపారు. అవార్డు కింద రూ.50,116, జ్ఞాపిక, శాలువా, సన్మానపత్రం అందించనున్నామన్నారు. కాగా, జనవరి చివరి వారంలో రవీంద్రభారతిలో ఈ అవార్డును అందించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.