Muslims reservations
-
రిజర్వేషన్లపై మోడీ డబుల్ గేమ్
-
ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారంట..!
-
ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా ప్రకటన..కొమ్మినేని రియాక్షన్
-
ముస్లింలకు అపర అంబేడ్కర్
రోజు కూలీ చేసుకొనే ముస్లింలకు రిజర్వే షన్లు కావాలనే డిమాండ్ దశాబ్దాలుగా తీరని కోరికగానే ఉండేది. సైకిల్ షాప్ నుండి ఆటో గ్యారేజ్ వరకు, టీ కొట్టు నుండి బడా హోటళ్ల లోనూ, బస్టాండ్‌లో మూటలు మోసే పని లోనూ అత్యధిక శాతం ముస్లిం పిల్లలే దర్శన మిస్తారు. ముస్లింలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి నప్పుడు అది రాజకీయ నినాదం మాత్రమేనని తోసిపుచ్చిన వారు అధికం. కానీ ప్రమాణ స్వీకారం చేసిన 75 రోజులకే 5 శాతం రిజ ర్వేషన్ కల్పిస్తూ వైఎస్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనది. 12–7–2004న జీవో నం. 33 ద్వారా రిజర్వేషన్లు కల్పించినట్లు ప్రక టించడం ముస్లింలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అయితే అదే సంవత్సరం సెప్టెంబర్ 21న బీసీ కమిషన్‌ను నియ మించకుండా రిజర్వేషన్లు కల్పించడం చెల్లదని ఏపీ సర్వోన్నత న్యాయస్థానం ఆ జీవోను తోసిపుచ్చింది. మైనార్టీలను మోసపుచ్చే చర్య తప్ప దీని ద్వారా ముస్లిం సమాజానికి ఒరగబెట్టింది ఏమీ లేదని పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. కానీ పట్టు వదలని వైఎస్ బీసీ కమిషన్‌ను పునరుద్ధరించి ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 2005లో మళ్లీ 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. తత్ఫలితంగా ఆ విద్యా సంవత్స రంలో ముస్లిం యువతకు 160 ఎంబీబీఎస్ సీట్లు లభించాయి. ఒక సాధారణ ముస్లిం యువత అన్ని సీట్లు సాధించడం ఊహకందని విషయం. ముస్లిం రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ మళ్ళీ ఏపీ హైకోర్టుకు వెళ్ళడం, చట్ట ప్రకారం లేదంటూ కొట్టివేయడం, సుప్రీంకోర్టులో కూడా స్టే లభించకపోవడంతో ముస్లిం సమాజం తీవ్ర నైరాశ్యంలో మునిగింది. అయినా వైఎస్ మళ్లీ బీసీ కమిషన్ కాలపరిమితిని పెంచి, ముస్లిం సామాజిక స్థితిగతులపై నివేదిక కోరారు. జస్టిస్ దాళ్వ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఏర్పడ్డ కమిషన్ వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసింది. పి.ఎస్.కృష్ణన్ నివేదికలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా 2007లో ఒక చట్టాన్ని రూపొం దించి, జీవో నంబర్ 23 ద్వారా మత ప్రాతిపదికన కాకుండా సామా జిక, ఆర్థిక, వెనకబాటు దృష్టిలో పెట్టుకొని ముస్లిం వర్గాలలోని 15 గ్రూపులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. తదుపరి రిజర్వేషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసినప్పటికీ సుప్రీంకోర్టు స్టేతో 2007 నుండి కొన సాగుతున్నాయి. ఇక ఉపాధి రంగంలో 4 శాతం రిజర్వేషన్లు ముస్లిం సమాజం స్థితిగతులలో గణనీయ మార్పులు తెచ్చాయి. బీసీ–ఈ ద్వారా డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లాంటి కీలక ఉద్యోగాలు ముస్లింలు సాధించారు. ఏపీ మోడల్ స్కూల్ రిక్రూట్మెంట్ ద్వారా వందలాదిమంది ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీలుగా ఎన్నికయ్యారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో దాదాపు 5,000 ఉద్యోగాలు భర్తీ చేయబడ్డాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత 13 సంవత్సరాలుగా మూడు లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయగా దాదాపు 15 వేల మంది బీసీ–ఈ ద్వారా లబ్ధి పొందడం వైఎస్సార్ చలవేనన్నది జగద్విదితం. ఈ రిజర్వేషన్లు లభించని పఠాన్, సయ్యద్, మొగల్ తదితర ఉప కులాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లబ్ధి చేకూర్చి వేలాది మంది ఉన్నత విద్యకు తద్వారా ఉపాధి లభ్యతకు కారణభూతులైన వైఎస్ ఆచంద్రతారార్కం ముస్లింల హృదయాలలో అంబేడ్కర్‌గా నిలిచిపోతారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను మైనార్టీ సంక్షేమానికి 2,200 కోట్లు కేటాయించి పలు సంక్షేమ పథకాలలో ముస్లింలకు భాగస్వామ్యం కల్పించి తండ్రికి తగ్గ తనయుడని చాటి చెబుతున్నారు. వ్యాసకర్త: ఎం. బాబర్ , సెక్షన్ ఆఫీసర్, ఏపీపీఎస్సీ, విజయవాడ -
ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబే
కడప కార్పొరేషన్: దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లిం, మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, వాటికి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి అడ్డుకున్నది చంద్రబాబేనని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు. బుధవారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగైదు మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయని తెలిసి మళ్లీ మైనార్టీలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ‘నారా హమారా, టీడీపీ హమారా’సభ నిర్వహించారన్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మైనార్టీల ప్రాతినిధ్యం లేని కేబినెట్ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉందని, ఒక్క ఎమ్మెల్యే లేని ఉత్తర ప్రదేశ్‌లో కూడా మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. నిన్నటి సీఎం సభలో విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపితే సీఎం వారివైపు వేలెత్తి చూపుతూ అంతుచూస్తానని బెదిరించడం దారుణమన్నారు. ముస్లింల స్థితిగతుల గురించి సీఎంగాని, టీడీపీ నాయకులుగాని సభలో మాట్లాడకపోవడం దౌర్భాగ్యమన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరన్నారు. వాజ్‌పేయి ఒక్క ఓటుతో ఓడిపోవడంతో సానుభూతి ఓట్లు పడతాయనే 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారన్నారు. ఆ తర్వాత ‘బీజేపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశాను, నన్ను క్షమించండి’అని ముస్లింలను కోరిన చంద్రబాబు, 2004లో మోడీ హవా చూసి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకొని మోసం చేశారని మండిపడ్డారు. 2002లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోదీని గుజరాత్లో అడుగుపెట్టనీయనని బీరాలు పలికిన చంద్రబాబు, అదే మోదీ కాళ్లు పట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశారని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ముస్లింలు ఉన్నారన్న సంగతే మరిచిపోయిన బాబు, ఇప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికలు రావడానికి నాలుగు నెలలు మాత్రమే ఉందని, మైనార్టీల ఓట్లు కొల్లగొట్టడానికే సీఎం ఇలా ఉత్తుత్తి వరాలు ప్రకటించారని తెలిపారు. ముస్లింలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారని, వారి దృష్టి మళ్లించేందుకే మోదీ, వైఎస్ జగన్ కలిసిపోతున్నారని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే నారాయణ, యనమల, లోకేష్లతోపాటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, ఉర్దూ ఆకాడమీ చైర్మన్ ఇవ్వడం పెద్ద గొప్పా...విధిలేని పరిస్థితుల్లోనే ఆ పదవులైనా ఇచ్చారు, వెసులుబాటు ఉంటే అవి కూడా వారి సామాజిక వర్గానికే ఇచ్చేవారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల ప్రతి ఏటా 200 మంది ముస్లిం విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయని, ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఎస్సీ, ఎస్టీలతోపాటే మైనార్టీలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. మేలు చేసిన వారిని, కీడు చేసిన వారిని ముస్లింలు ఎన్నటికీ మర్చిపోరని, మైనార్టీలకు కీడు తలపెట్టిన చంద్రబాబును జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కంటే చంద్రబాబుకే ముస్లింలపై అక్కసు ఎక్కువని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ‘నారా హమారా, చంద్రబాబు దుష్మన్ హమారా’అనేది ముస్లింల ఏకైక నినాదమని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్ఏ కరిముల్లా, నగర అధ్యక్షుడు షఫీ, మైనార్టీ నాయకులు అబ్దుల్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. హరికృష్ణ మృతికి వైఎస్ అవినాష్‌రెడ్డి సంతాపం సినీనటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి పట్ల కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణది ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
'టీఆర్ఎస్లో ప్రచార కార్యకర్తగా పనిచేస్తా'
నల్లగొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత కె జానారెడ్డి సవాల్ విసిరారు. గురువారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మాటల గారడీతో పాలన సాగిస్తుందన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులు ఒక పంటకు నీరు ఇచ్చేందుకు డిజైన్ చేసినవని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రెండు పంటలకు నీరు ఇస్తే తాను టీఆర్ఎస్లో ప్రచార కార్యకర్తగా పని చేస్తానని జానారెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లోకి వలసలను ప్రోత్సహిస్తున్నారని కొందరు తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.