mustang car
-
‘ఆ సువాసన’ వెదజల్లే కారు... ప్రపంచంలోనే మొదటి సారి
FORD MUSTANG MACH-E ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. వాహనాల తయారీలో ఉన్న కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్నాయి. ఎక్కువ కంపెనీలు ఛార్జింగ్, మైలేజీపై దృష్టి సారించగా... ఫోర్డ్ ఓ అడుగు ముందుకు వేసి సరికొత్త ఫీచర్‌తో కస్టమర్లను ఆకట్టుకోవాలని ప్లాన్ వేసింది. ఆ ఫీలే వేరు ఇంతకాలం పెట్రోలు, డీజిల్ కార్లదే హవా నడిచింది. ఏళ్ల తరబడి పెట్రోలు కార్లు ఉపయోగించాం. దీంతో ఆ కార్లతో తెలియకుండానే ఒక అనుబంధం ఏర్పడింది. పైకి ఎవరు చెప్పకున్నా కారుకు సంబంధించి కంఫర్ట్, కంపాటబులిటీలతో పాటు పెట్రోల్ ఇంజన్ వాసనను కూడా ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉంటారు. అయితే కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఈ అనుభూతి మిస్ అవుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాసన మిస్ అవుతున్నాం పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిన తర్వాత పెట్రోలు వాసనను మిస్ అవుతున్నామని 70 శాతం మంది తెలిపినట్టు ఫోర్డ్ జరిపిన సర్వేలో తేలింది, వైన్, ఛీజ్ కంటే కూడా పెట్రోలు వాసనే ఎక్కువ ఇష్టపడతామని చెప్పిన వారి సంఖ్య కూడా చాంతాడంత తేలింది. తొలిసారిగా దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు ఉపయోగించే వారికి పెట్రోలు కారు స్మెల్ ఫీల్ మిస్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక మాక్ ఈవ్ పేరుతో సరికొత్త ఫ్రాగ్రెన్స్ని తయారు చేసింది ఫోర్డ్. ప్రత్యేక పద్దతిలో తయారు చేసిన ఈ పరిమళాన్ని మొదటగా ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ-జీటీ మోడల్‌తో ప్రవేశ పెట్టనుంది. పెట్రోలు వాసన మిస్ అవుతున్న వారికి ప్రత్యామ్నయం చూపనుంది. పెట్రోల్ వాసన అందించే తొలి ఈవీ కారుగా ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ - ఈ జీటీ నిలవనుంది. -
ఫోర్డ్ మస్టాంగ్ జూలైలో మార్కెట్లోకి..
♦ 2017కల్లా 30 అస్సెట్ సెంటర్లు ♦ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ ఫోర్డ్ తయారీ మస్టాంగ్ కారు త్వరలో భారత్‌లో పరుగు తీయనుంది. 1964లో మొదలైన మస్టాంగ్ ప్రస్థానంలో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 5 లీటర్ వి8 ఇంజన్‌తో 4 సీట్లతో రూపొందిన ఈ కారు ఆరు రంగుల్లో లభిస్తుంది. ధర రూ.60-80 లక్షలు ఉండొచ్చు. భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆరవ తరం మస్టాంగ్ కారు జూలైలో రోడ్డెక్కనుంది. తొలిసారిగా రైట్ హ్యాండెడ్ మోడల్‌ను కంపెనీ ప్రవేశపెడుతుండడం విశేషం. మూడు నెలల్లో ఇక్కడి రోడ్లపైకి మస్టాంగ్ దూసుకెళ్లే అవకాశం ఉందని ఫోర్డ్ ఇండియా కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.ప్రభు తెలిపారు. శుక్రవారమిక్కడ ముషీరాబాద్ ఐఐటీ ప్రాంగణంలో ఆటోమోటివ్ స్టూడెంట్ సర్వీస్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (అస్సెట్) కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. సుశిక్షితులైన సిబ్బంది: అసెట్ కేంద్రాల్లో ఐటీఐ విద్యార్థులకు మోటార్ మెకానిక్ వెహికిల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ కోర్సు పూర్తి అయితే ఫోర్డ్ సర్వీసింగ్ కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థులకు ఉపాధి కూడా కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ముషీరాబాద్ ఐటీఐలో అస్సెట్ కేంద్రాన్ని నెలకొల్పారు. దీంతో కంపెనీకి దేశంలో ఇలాంటి సెంటర్ల సంఖ్య 8కి చేరుకుంది. డిసెంబర్‌కి మరో 7 కేంద్రాలు రానున్నాయి. 2017లో 15 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభు తెలిపారు. ‘ఒక్కో అసెట్ సెంటర్‌కు రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ప్రతి రెండు వారాలకు ఒక డీలర్‌షిప్‌ను ప్రారంభిస్తున్నాం. పెద్ద నగరాల్లో అయితే వర్క్‌షాప్‌కు కనీసం 25-30 మంది మెకానిక్‌లు అవసరం. 2016లో 600 మందికి శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నాం’ అని తెలిపారు.