జయ కోసం ఆత్మహత్యా యత్నం
భర్త మృతి; భార్య పరిస్థితి విషమం
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయటపడడం ఆలస్యమవుతోందని మనస్తాపం చెందిన ఓ అభిమాని, భార్యతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో రాజయోగ్గియం మృతి చెందాడు. విషం తాగిన అతని భార్య ముత్తులక్ష్మి(30) పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తమిళనాడులోని తేని జిల్లా వడపుదుపట్టిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. జయలలిత కేసు విషయంలో బాధపడిన వీరిద్దరూ శుక్రవారం ఉదయం ఇంట్లో విషం తాగారు.
విషయం తెలుసుకున్న పక్కింటివాళ్లు వారిని వెంటనే తేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ రాజయోగ్గియం మరణించాడు. ఆత్మహత్యకు పాల్పడిన ఇతని ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. జయలలిత కేసు ఆలస్యమవుతోందని, దీంతో తాము జీవించడం కంటే చావడంమేలని వారు లేఖలో రాశారు. వీరికి దివ్య(7) అనే కుమార్తె ఉంది.