మైనర్ బాలిక ఆత్మహత్య
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): తెనాలి ముత్యంశెట్టి పాలెంలో సోమవారం ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.