muvva Vijay Babu
-
వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు
ఖమ్మంవ్యవసాయం : ఖమ్మం కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ద్వారా వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు అందిస్తున్నట్లు చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అన్నారు. బ్యాంకు లావాదేవీలను విస్త్రృతంగా పెంచి రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపామన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్(డీసీసీబీ ఈయూ) సర్వసభ్య సమావేశం ఆదివారం ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆయన అతిథిగా హాజరైన మాట్లాడారు. మరో రెండేళ్లయితే సహకార వ్యవస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదేళ్ల కిత్రం రైతాంగం, సహకార సంఘాలు డీసీసీబీకి సేవచేసే అవకాశాన్ని ఇచ్చాయన్నారు. తాను పదవిని చేపట్టేనాటికి రూ.800 కోట్ల టర్నోవర్‌తో ఉన్న ఈ బ్యాంక్ నేడు రూ. 2,115 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందన్నారు. డిపాజిట్లతో బ్యాంక్ అభివృద్ధి చెందుతుందని భావించి ఆ దిశగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి వివిధ పథకాల కింద వచ్చిన నిధులను డిపాజిట్లు చేయించామన్నారు. బ్రాంచిలను ఆధునికీకరించామన్నారు. దీంతో రైతుల్లో సహకార బ్యాంక్‌పై నమ్మకం పెరిగిందన్నారు. 30 బ్రాంచిలతో ఉన్న ఖమ్మం డీసీసీబీని నేడు 50 బ్రాంచిలకు పెంచామన్నారు. మరో 8 బ్రాంచిలకు ప్రతిపాదనలు కూడా చేశామన్నారు. కొత్తగూడెం, పాల్వంచ వంటి పట్టణాల్లో నూతన బ్రాంచిల ఏర్పాటుకు కృషి జరుగుతుందన్నారు. ప్రతి మండలంలో డీసీసీబీ బ్రాంచి ఏర్పాటు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో బ్యాంక్‌ను అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. సంక్షేమ నిధి తో ఏర్పాటయిన సీ-స్టార్ ఆస్పత్రిని ఎన్ని అవాంతరాలు వచ్చినా నిర్వహించి తీరుతామన్నారు. డీసీసీబీ ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనం రూ. 5లక్షలను ఆసుపత్రి అభివృద్ధికి ఇవ్వటం అభినందనీయమన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యోగ సంఘానికి గౌరవ అధ్యక్షడిగా బాధ్యతలు అప్పగించారని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వసంతరావు మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులకు దీటుగా డీసీసీబీని ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈ నూతనకమిటీ అధ్యక్షులు జిప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాలకవర్గసభ్యులు బోజెడ్ల అప్పారావు, మండే వీరహన్నంతరావు, రాయల శేషగిరిరావు, పోలుదాసు కృష్ణమూర్తి, సామినేని వెంకటయ్య, తాతా రఘురాం, బెఫీ యూనియన్ ప్రతినిధి ఆనందరావు, సంఢం ప్రధాన కార్యదర్శి కె.ఉపేంద్రనాథ్, ఉపాధ్యక్షులు రాయపూడి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బి.రవికుమార్, కోశాధ్యక్షులు చందర్రావు, నిర్వహణా కార్యదర్శి వెంకటరెడ్డి, ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'తుమ్మలను అవమానించారు'
ఖమ్మం: టీడీపీని తుమ్మల నాగేశ్వరరావు వీడితే తామంతా ఆయన వెంటే ఉంటామని డీసీసీబీ చైర్మన్ మొవ్వా విజయబాబు తెలిపారు. జెడ్మీ చైర్మన్, వైస్ చైర్మన్లతో సహా అందరూ ఆయన వెంటే ఉంటారని ఆయన చెప్పారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వైఖరి వల్లే జిల్లా టీడీపీలో సంక్షోభం వచ్చిందని విజయబాబు ఆరోపించారు. తుమ్మల నాగేశ్వరరావును అడుగడుగునా అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
‘దేశం’ సతమతం
డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు పదవికి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం సాగుతుండటంతో పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఎటువైపు వెళ్లాలో..! స్థానిక ఎమ్మెల్యేకు అండగా పార్టీలోనే ఉందామని కొందరు నేతలు అంటుండగా మరికొందరు తుమ్మలతోనే వెళ్దామని కార్యకర్తలకు చెబుతున్నారు. ఎటువైపు వెళ్లాలో అర్థంకాక కొందరు కార్యకర్తలు రెండు శిబిరాల్లో కనిపిస్తున్నారు. 33 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నాం..ఇప్పటికిప్పుడు పార్టీ మారాలంటే బాధగా ఉందని మరికొందరు కన్నీరు పెడుతున్నారు. డీసీసీబీ చైర్మన్‌కు బుజ్జగింపు డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని మువ్వా విజయ్‌బాబు సన్నిహితుల వద్ద ప్రకటించడంతో సత్తుపల్లిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పెనుబల్లి, సత్తుపల్లి టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో మువ్వా నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా వచ్చారు. చైర్మన్ పదవికి రాజీనామా చేసే యోచనను విరమించుకోవాలని సూచించారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో చివరికి విజయ్‌బాబు మెత్తబడినట్లు సమాచారం. మద్దతు కోసం ఇరువ ర్గాల యత్నం కార్యకర్తల మద్దతు కూడగట్టేందుకు తుమ్మల వర్గం ప్రయత్నిస్తుండగా...పార్టీ మారొద్దని ఎమ్మెల్యే వెంకటవీరయ్య అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. రెండురోజుల క్రితం సత్తుపల్లి, వేంసూరు ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు సమావేశమై తుమ్మల వెంట మేము ఉన్నామంటూ ప్రకటించారు. నగరపంచాయతీ ైచె ర్‌పర్సన్, కౌన్సిలర్లూ తుమ్మల వెంటనే కలిసి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయానికి కౌన్సిలర్లను పిలిపించుకుని సమావేశం అయ్యారు. పార్టీ మారొద్దని నచ్చజెప్పారని సమాచారం. అయితే 17 మంది కౌన్సిలర్లకు 15 మంది మాత్రమే ఆ సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతు ప్రకటించిన జెడ్పీటీసీ హసావత్ లక్ష్మి, ఎంపీటీసీ పొనుగుమాటి విజయరేఖలతోనూ ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలోనే కొనసాగాలని నచ్చజెప్పారు. కొందరు నేతలు మాత్రం వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు.