డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు పదవికి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం సాగుతుండటంతో పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
ఎటువైపు వెళ్లాలో..!
స్థానిక ఎమ్మెల్యేకు అండగా పార్టీలోనే ఉందామని కొందరు నేతలు అంటుండగా మరికొందరు తుమ్మలతోనే వెళ్దామని కార్యకర్తలకు చెబుతున్నారు. ఎటువైపు వెళ్లాలో అర్థంకాక కొందరు కార్యకర్తలు రెండు శిబిరాల్లో కనిపిస్తున్నారు. 33 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నాం..ఇప్పటికిప్పుడు పార్టీ మారాలంటే బాధగా ఉందని మరికొందరు కన్నీరు పెడుతున్నారు.
డీసీసీబీ చైర్మన్‌కు బుజ్జగింపు
డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని మువ్వా విజయ్‌బాబు సన్నిహితుల వద్ద ప్రకటించడంతో సత్తుపల్లిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పెనుబల్లి, సత్తుపల్లి టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో మువ్వా నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా వచ్చారు. చైర్మన్ పదవికి రాజీనామా చేసే యోచనను విరమించుకోవాలని సూచించారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో చివరికి విజయ్‌బాబు మెత్తబడినట్లు సమాచారం.
మద్దతు కోసం ఇరువ ర్గాల యత్నం
కార్యకర్తల మద్దతు కూడగట్టేందుకు తుమ్మల వర్గం ప్రయత్నిస్తుండగా...పార్టీ మారొద్దని ఎమ్మెల్యే వెంకటవీరయ్య అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. రెండురోజుల క్రితం సత్తుపల్లి, వేంసూరు ఎంపీపీలు, సొసైటీ చైర్మన్‌లు, జెడ్పీటీసీలు సమావేశమై తుమ్మల వెంట మేము ఉన్నామంటూ ప్రకటించారు. నగరపంచాయతీ ైచె ర్‌పర్సన్, కౌన్సిలర్లూ తుమ్మల వెంటనే కలిసి వెళ్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయానికి కౌన్సిలర్లను పిలిపించుకుని సమావేశం అయ్యారు. పార్టీ మారొద్దని నచ్చజెప్పారని సమాచారం. అయితే 17 మంది కౌన్సిలర్లకు 15 మంది మాత్రమే ఆ సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతు ప్రకటించిన జెడ్పీటీసీ హసావత్ లక్ష్మి, ఎంపీటీసీ పొనుగుమాటి విజయరేఖలతోనూ ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలోనే కొనసాగాలని నచ్చజెప్పారు. కొందరు నేతలు మాత్రం వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు.
‘దేశం’ సతమతం
Published Wed, Aug 27 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement
Advertisement