వెహికల్ ఇన్స్పెక్టర్ను దుర్బాషలాడిన జడ్పీటీసీ భర్త
కరీంనగర్ : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్‌తో పెగడాపల్లి జెడ్పీటీసీ గజ్జెల వసంత భర్త స్వామి దుర్బాషలాడారు. బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వరప్రసాద్ రోజూ వారీగా అలగనూరు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో నెంబర్ ప్లేట్ లేని జేసీబీని వరప్రసాద్ సీజ్ చేసి ఆర్టీవో కార్యాలయానికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ భర్త స్వామి ఈ రోజు ఉదయం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి నా బండినే... పట్టుకుంటావా అని వరప్రసాద్‌పై దుర్బాషలాడాడు. ఈ తతంగం మొత్తాన్ని వరప్రసాద్ సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ విషయంపై తిమ్మాపూర్ ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌లో స్వామిపై వరప్రసాద్ ఫిర్యాదు చేశాడు.