మైస్పేస్ అకౌంట్లు హ్యకింగ్
శాన్ ఫ్రాన్సిస్కో : ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ మైస్పేస్ అకౌంట్లు భారీ ఎత్తున్న హ్యాకింగ్ కు గురయ్యాయి. దొంగలించబడ్డ 3600లక్షలకు పైగా పాత అకౌంట్ల పేర్లు, పాస్ వర్డ్ లు ఆన్ లైన్ హ్యాకర్ ఫోరమ్ లో అమ్మకం జరిగాయని టైమ్ ఇంక్ నిర్థారించింది. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ను ఫిబ్రవరిలో టైమ్ కొనుగోలు చేసింది.
లిమిటెడ్ యూజర్ పేర్లు, పాస్ వర్డ్ లు, ఈ-మెయిల్ అడ్రస్ లతో 2013 జూన్ 11న గట్టి అకౌంట్ సెక్యురిటీతో ఈ ప్లాట్ ఫామ్ ను పున: ప్రారంభించారు. తమ సమాచార భద్రత, గోప్యత టీమ్ లు మైస్పేస్ టీమ్ కు సపోర్టుగా నిలుస్తారని టైమ్ ఇంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జెఫ్ బెయిర్ట్స్ తెలిపారు.
అయితే ఈ హ్యాకింగ్ ప్రభావం టైమ్ ఇంక్ సిస్టమ్స్, చందాదారులు సమాచారం, ఇతర మీడియా ఆస్తులపై లేదని టైమ్ ఇంక్ ప్రకటన విడుదలచేసింది. 2003 లో మైస్పేస్ స్థాపించారు. సోషల్ నెట్ వర్గింగ్ లో ఇది చాలా ప్రాధాన్యత కల సైట్. కానీ ఫేస్ బుక్ వంటి సైట్ ల పోటీని తట్టుకోలేక తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. మల్టిపుల్ అకౌంట్లకు, మైస్పేస్ కు ఒకే పాస్ వర్డ్ కలిగి ఉన్నవారు ఎక్కువ హ్యాకింగ్ కు గురవుతున్నారని మైస్పేస్ తెలిపింది. యూజర్ల పాస్ వర్డ్ లను, ఈ-మెయిల్ అడ్రస్ లను వివిధ సైట్లలో ప్రయత్నిస్తూ ఈ హ్యాకింగ్ కు పాల్పడుతున్నారని పేర్కొంది.