ముదుమాణిక్యం మేజర్ కాల్వకు గండి
నల్గొండ: నల్గొండ జిల్లా త్రిపురారం మండల పరిధిలోని ముదుమాణిక్యం మేజర్ కాల్వ ఎన్-17 వద్ద శుక్రవారం గండి పడింది. ఈ సంఘటనతో సుమారు 200 ఎకరాల మేరా పంట పూర్తిగా నీట మునిగింది. నీటి ప్రవాహానికి ఈ మధ్యే నాటేసిన ఎనిమిదెకరాల పొలం వేర్లతో సహా కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
స్థాయికి మించి నీటిని విడుదల చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా కాల్వకట్టలు బలహీనంగా ఉండటం వల్లే తరుచూ గండ్లు పడుతున్నాయని రైతులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.
(త్రిపురారం)