పిఠాపురంలో భారీ చోరీ
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో భారీ చోరీ జరిగింది. పిఠాపురం అగ్రహారానికి చెందిన నెల్లిపూడి వెంకటరమణ కటుంబం కొద్ది రోజుల కిందట హైదరాబాద్కు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో వారు తిరిగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తలుపులు తీసి ఉండగా లోపల ఓ వ్యక్తి కనిపించడంతో కేకలు వేశారు. దీంతో అతడు పరారయ్యాడు. 69 గ్రాముల బంగారు ఆభరణాలు, 288 గ్రాముల వెండి వస్తువులు, రూ.45వేల నగదు చోరీకి గురైనట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.