Nagaland Assembly elections
-
సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించి చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు
కోహిమా: 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్‌విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. -
Nagaland election: ఆకాశంలో సగమైనా... నాగాలాండ్‌లో మాత్రం శూన్యం
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఆమె. ఎందులోనూ తక్కువ కాదు. ఆకాశంలో సగం. అన్నింటా కూడా సగం. ఇంటికే పరిమితమనేది గతించిన మాట. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా, ధాటిగా తనను తాను నిరూపించుకుంటోంది. మహిళలు అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. కానీ నాగాలాండ్‌లో మాత్రం మహిళలు ఒక విషయంలో మరీ వెనకబడ్డారు. ఇక్కడా తప్పు వారిది కాదు... అక్కడి పురుషాధిక్య సమాజానిది. ఆ రాష్ట్రంలో చదువులో, ఉద్యోగాల్లో లేని కట్టుబాటు రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం పెద్ద అడ్డుకట్టగా మారింది. నాగాలాండ్ శాసనసభకు ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు! నాగాలాండ్ 1963లో రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ 13 సభల్లోనూ మహిళలకు అసలే ప్రాతినిధ్యం దక్కలేదు. 13 ఎన్నికల్లోనూ బరిలో దిగిన మహిళల సంఖ్య కేవలం 20 మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఐదుగురు మహిళలు పోటీ చేశారు. కానీ వీరిలో ముగ్గురికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఓవరాల్‌గా ఇప్పటిదాకా బరిలో దిగిన 20 మందిలో చాలామంది మహిళలకూ అదే ఫలితం దక్కింది! మహిళలు ప్రధాని అవడమే గాక ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టిన మన దేశంలో ఒక్క నాగాలాండ్‌లోనే ఎందుకీ దుస్థితి? అక్కడేమన్నా అక్షరాస్యత తక్కువగా ఉందా అంటే, ఆ సమస్యే లేదు. రాష్ట్రంలో మహిళల్లో కూడా అక్షరాస్యత ఏకంగా 76.11 శాతం. ఇది దేశ సగటు అక్షరాస్యత (64.6 శాతం) కన్నా ఎక్కువ. ఇంత అక్షరాస్యత ఉన్నా నాగా మహిళలు సాటి మహిళలకు ఓటేసేందుకు సుముఖంగా లేరు! రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 13.17 లక్షలు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు సగం, అంటే 6.56 లక్షలు. అయినా ఎందుకీ చిన్నచూపు? ఎందుకీ వివక్ష? స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2017లో నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై నిరసనలు, ఆందోళనల దాకా వెళ్లింది! అక్కడ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యంపై ఎంత వ్యతిరేక భావన ఉందో దీన్నిబట్టే అర్థమవుతోంది. ఈ రిజర్వేషన్లను నిరసిస్తూ పెద్ద ఎత్తున చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు! రాజ్యాంగంలోని 371 (ఎ) ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రత్యేక హక్కులకు ఇది విరుద్ధమన్నది నిరసనకారుల వాదన. నిర్ణయాధికారాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండకూడదన్నది వారి డిమాండ్. నాగాలాండ్‌లో అత్యధిక శాతం ప్రజలు దీన్ని బలంగా విశ్వసిస్తారు. దీన్ని మార్చేందుకు మహిళల సాధికారత కోసం గళమెత్తే పలు స్వచ్ఛంద సంస్థలు ఎంత కృషి చేసినా లాభం లేకపోయింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి నిపూ రియో పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా పెద్దగా ఫలితమైతే లేదు. ఆయన తన నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు టికెటిచ్చారు. కానీ మొత్తం 60 సీట్ల శాసనసభలో రెండే టికెట్లివ్వడం ఏ మేరకు సమన్యాయం చేసినట్టవుతుందో! కాంగ్రెస్, బీజేపీ అయితే మహిళలకు ఒక్కో టికెట్‌తోనే సరిపెట్టాయి. ప్రజలతో పాటు పార్టీలు కూడా మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి సరైన ప్రాధాన్యమివ్వడం లేదని ఈ సీట్ల కేటాయింపు చెప్పకనే చెబుతోంది. పార్లమెంటులో కూడా నాగాలాండ్ మహిళలకు దక్కిన ప్రాతినిధ్యం స్వల్పాతిస్వల్పం. అప్పుడెప్పుడో 1977లో రానో షైజా లోక్‌సభకు ఎన్నికవగా, తాజాగా 2022లో ఫంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రజలతో పాటు పార్టీల వైఖరి కూడా మారినప్పుడు మాత్రమే నాగాలాండ్ అసెంబ్లీలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుంది. నాగాలాండ్ అసెంబ్లీకి మేఘాలయ, త్రిపురలతో పాటు ఈ నెలాఖర్లోగా పోలింగ్ పూర్తవుతుంది. త్రిపురకు ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు 27న పోలింగ్ జరగనుంది. కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే నామినేషన్ వేశారు. వారిలో ఇద్దరు అధికార ఎన్డీపీపీ అభ్యర్థులు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కో అభ్యర్థి మిగలగా మరో ఇద్దరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ నలుగురిలో ఒక్కరైనా నెగ్గి చరిత్ర సృష్టిస్తారో లేదో చూడాలి. కనీసం సగం మందైనా గెలిస్తే మహి ళల రాజకీయ ప్రాతినిధ్యంపై నాగాలాండ్ ప్రజ ల్లో ఉన్న విముఖత మెల్లమెల్లగా తొలగిపోతున్నట్టు భావించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం మార్చి 2న వెలువడే ఫలితాల్లో లభిస్తుంది. -
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాగాలు ఎటువైపు ?
నాగాలాండ్‌లో అంతా ఒకటే పక్షం. అదే అధికార పక్షం. ప్రస్తుతం అక్కడ ప్రతిపక్షం ఊసే లేదు. అభివృద్ధే లక్ష్యంగా రెండేళ్ల క్రితం రాజకీయ పక్షాలన్నీ ఏకమై కొత్త సంప్రదాయానికి తెరతీశాయి. అయినా ఈ సారి ఎన్నికల్లో అదే పాత సమస్య నాగాల శాంతి చర్చలే ప్రధాన అంశంగా మారింది. నాగాలాండ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు ఈ ఏడాది శాంతి ఒప్పందం చుట్టూనే తిరుగుతున్నాయి. నాగాల చిరకాల డిమాండ్లు నెరవేర్చకపోవడంతో అధికార నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)–బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలుస్తున్నాయి. 2018 ఎన్నికలకు ముందు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) చిరకాల మితృత్వాన్ని వదులుకున్న బీజేపీ ఎన్డీపీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీపీపీకి చెందిన నిఫూయి రాయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో అధికార బీజేపీ నాగాలు ఆశిస్తున్నట్టుగా ప్రత్యేక జెండా, రాజ్యాంగం ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో వారంతా కాషాయ కూటమికి వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధమయ్యారు. దశాబ్దాల తరబడి వేర్పాటు వాదుల హింసాకాండతో రక్తమోడుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలన్న లక్ష్యంతో 2021లో రాజకీయ పార్టీలన్నీ చేతులు కలిపి యునైటెడ్ డెమొక్రాటిక్ అలయెన్స్ (యూడీఏ) ఏర్పాటయ్యాయి. అధికారంలో ఉన్న నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీ కూటమిలో ప్రతిపక్ష నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) చేరడం రాజకీయంగా కొంత పుంతలకు దారి తీసింది. ఎన్డీపీపీ–బీజేపీ కలసికట్టుగా పోటీ రెండేళ్లుగా అభివృద్ధి ప్రయత్నాలు ముందుకు కదలకపోగా నాగా వేర్పాటు వాద సమస్య తీవ్రతరం కావడంతో ఫిబ్రవరి 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీఎఫ్ ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. గత ఎన్నికల్లో 26 సీట్లలో నెగ్గిన ఎన్పీఎఫ్ ఈ సారి అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు రచిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అచ్చుబెమొ కికోన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీపీపీ– బీజేపీ కలసి కట్టుగా పోటీ చేయనున్నాయి.మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 40 సీట్లలో ఎన్డీపీపీ, 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఒక్క స్థానం రాకపోయినా ఈ సారి 60 స్థానాల్లోనూ పోటీకి దిగుతోంది. ఎన్నికల తర్వాత ఎన్పీఎఫ్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఒక్క స్థానంలో నెగ్గిన జేడీ(యూ) ఈసారి నాగ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది. దీంతో బీజేపీ నుంచి జేడీ(యూ)లోకి భారీగా వలసలు మొదలయ్యాయి. ఏమిటీ నాగాల సమస్య నాగాల వివాదం ఇప్పటిది కాదు. దశాబ్దాల తరబడి భారత నేలపై రక్త చరిత్ర రాస్తూనే ఉంది. బ్రిటీష్ కాలంలో మొదలైన ఈ సమస్యపై ఇప్పటికీ నాగాలు పోరాటం చేస్తూనే ఉన్నారు. 1881లో నాగా తెగలు నివసించే నాగాహిల్స్ ప్రాంతాన్ని బ్రిటీష్ ఇండియాలో భాగం చేశారు. దీనిని నాగా తెగలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ భవిష్యత్ తామే నిర్ణయించుకుంటామని స్వతంత్ర నాగా దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామంటూ పలు ఉద్యమాలు నడిపాయి. తమకు సొంత జెండా, రాజ్యాంగం కావాలంటూ 1946లోనే నాగా నేషనల్ కౌన్సిల్ (ఎన్ఎన్సీ) ఏర్పాటై వేర్పాటు వాదం దిశగా అడుగులు వేసింది. నాగా ఫెడరల్ ఆర్మీ (ఎన్ఎఫ్ఏ) పేరుతో ఏర్పాటైన తీవ్రవాదులు భారీగా హింసకు పాల్పడేవారు. దీంతో వారిని అణిచివేయడానికి 1958లో నాటి కేంద్ర ప్రభుత్వం సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తెచ్చింది. అప్పట్నుంచి కేంద్రం, నాగాల మధ్య విభేదాలు ముదురుతూనే ఉన్నాయి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు ఇప్పటికీ నాగాలు గట్టిగా చేస్తున్నారు. నాగాలు నివసించే ప్రాంతాన్ని అంతటినీ కలిపి 1963లో కేంద్రం నాగాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 1975లో ఎన్‌ఎన్‌సీలో ఒక వర్గంతో షిల్లాంగ్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ సమస్యపై ఎన్‌ఎన్‌సీలో చీలిక వర్గమైన ఎన్ఎస్సీఎన్ (ఐఎం) బలంగా తన వాణి వినిపిస్తోంది. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పాటు మయన్మార్‌లో నాగాలు అధికంగా ఉన్న ప్రాంతాలన్నీ కలిసి గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటు చేసి సొంత రాజ్యాంగం, జెండా కావాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఎన్ఎస్సీఎన్ (ఐఎం) శాంతి ఒప్పందం కుదుర్చుకొని అప్పటి గవర్నర్ ఆర్.ఎన్.రవిని మధ్యవర్తిగా నియమించింది. అయినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో నాగాల శాంతి చర్చలే ఈ సారి అతి పెద్ద ఎన్నికల అంశంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు ►ప్రత్యేక జెండా, రాజ్యాంగం కోరుతూ గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ కోసం దశాబ్దాలైనా నాగా తెగలు గట్టిగా పట్టుపట్టడం ►ఏడు ఆదివాసీ సంస్థలతో కూడిన ఈస్ట్రన్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీఓ) రాష్ట్రంలోని 16 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్టాన్ని డిమాండ్ చేయడం. ఈ డిమాండ్‌తో 2010 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సెగలు పుట్టిస్తోంది. ►500 కి.మీ. పొడవైన సరిహద్దుని పంచుకుంటున్న అసోం, నాగాలాండ్ మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలు. అసోంలో ఉన్న కొంత భూభాగం తమదేనని, రాష్ట్రంలో కలిపేయాలంటూ డిమాండ్లు ఉన్నాయి. ►దాదాపుగా 22 లక్షల జనాభా కలిగిన నాగాలాండ్‌లో 90 వేల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి ఉపాధి అవకాశాల కల్పన అతి పెద్ద సవాల్‌గా మారింది. ►నాసిరకం రోడ్లు, మౌలికసదుపాయాల కొరత, విద్య, ఆరోగ్యం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. -
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
న్యూఢిల్లీ: 2023లో తొలి భాగంలో.. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయా, త్రిపురలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఒకే దఫాలో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం మధ్యాహ్నం పాత్రికేయ సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించారు సీఈసీ రాజీవ్ కుమార్. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నాగాలాండ్‌కు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13,09, 651 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. అందులో 59 స్థానాలు ఎస్టీ కేటాయింపు కాగా, జనరల్ కేటగిరీ ఒక్క స్థానానికే ఉంది. ఇక 12 జిల్లాలతో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 21,61,129 ఓటర్లు ఉన్నారు అక్కడ. 55 స్థానాలు ఎస్టీ, జనరల్ కోటాలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎనిమిది జిల్లాలు.. 60 స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 28,13,478 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. ఇక్కడ 30 జనరల్, ఎస్సీ 10, ఎస్టీ 20 స్థానాలు ఉన్నాయి. Voting for Assembly elections in Tripura to be held on February 16 & in Nagaland & Meghalaya on February 27; results to be declared on March 2.#AssemblyElections2023 https://t.co/V8eOZvhc5g pic.twitter.com/rRNKWeNjUq — ANI (@ANI) January 18, 2023 మొత్తం 180 స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం 9,125 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. త్రిపుర (Tripura)లో మాణిక్ సాహా నేతృత్వంలోని ప్రభుత్వం, మేఘాలయా, నాగాలాండ్సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది బీజేపీ. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల ఐదు సంవత్సరాల పదవీకాలం వరుసగా మార్చి 12, మార్చి 15, మార్చి 22వతేదీల్లో ముగియనుంది. మార్చి నెలాఖరులోగా మూడు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త అసెంబ్లీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. గత వారం.. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ పార్టీలు, రాష్ట్ర, కేంద్ర భద్రత, పౌర అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించింది. రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది. ఈ మేరకు పక్కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. There are more than 62.8 lakh electors combined in Nagaland, Meghalaya & Tripura including - 31.47 lakh female electors, 97,000 80+ voters, and 31,700 PwD voters. Over 1.76 lakh first-time voters to participate in the elections in 3 states: CEC Rajiv Kumar pic.twitter.com/xnDne8TjQ1 — ANI (@ANI) January 18, 2023 -
తొలిసారి ఐదుగురు మహిళల పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ అసెంబ్లీకి ఈనెల 27న జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి ఐదుగురు మహిళలు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలోని మొత్తం 60 సీట్లకుగాను 2.56 శాతం సీట్లకే మహిళలు పోటీ పడుతున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఎక్కువ సంఖ్యలో మహిళలు పోటీ చేయడం కూడా ఇదే మొదటిసారి అంటే ఆశ్చర్యం కలగకమానదు. నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి ఇద్దరు, కొత్తగా ఏర్పాటైన నేషనలిస్ట్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఒకరు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తుండగా, మరొకరు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నిరాటంకంగా పాలిస్తున్న నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఒక్క మహిళ కూడా పోటీ చేయక పోవడం కూడా ఆశ్చర్యకరమే. 1963లో నాగాలాండ్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు 19 మంది మహిళలు పోటీ చేయగా, ఇంతవరకు ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఇంతవరకు నాగాలాండ్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికల్లో పోటీచేసి ఒకే ఒక మహిళ విజయం సాధించారు. 1977లో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసి రానో ఎం సాయిజ్ విజయం సాధించారు. ఆ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మొదటి మహిళ కూడా ఆమెనే. ఆమే ప్రముఖ నాగా వేర్పాటువాద నాయకుడు ఏజెడ్ పీజో మేనకోడలు. ఆమె 2015లో మరణించారు. మగవారితో సమానంగా ప్రత్యర్థి సైనికులతో పోరాడడమే కాకుండా తెల్లవారక ముందే కొండ కోనల్లో కష్టమైన పనులకు వెళ్లే అలవాటు, సామాజిక సంస్థల్లో క్రియాశీలక పాత్ర వహించే నాగా మహిళలు ఎన్నికల పట్ల అంతగా ఆసక్తి చూపక పోవడం, ఎన్నికల్లో రాణించక పోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఒక్క నాగాలాండ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అసెంబ్లీలలో మహిళ ప్రాతినిధ్యం తొమ్మిది శాతం దాటడం లేదు. గతేడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 4,800 మంది పోటీ చేయగా, 446 మంది మహిళలు, పంజాబ్‌కు 1145 మంది పోటీ చేయగా, వారిలో 81 మంది, ఉత్తరాఖండ్‌కు 637 మంది పోటీ చేయగా, వారిలో 58 మంది, గోవాకు 250 మంది పోటీ చేయగా, వారిలో 18 మంది, మణిపూర్‌కు 266 మంది పోటీ చేయగా, వారిలో 11 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అస్సాం, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఫర్వాలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎనిమిది శాతం మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2013లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నాగాలండ్‌లో కూడా పోటీచేసే మహిళల సంఖ్య 1.6 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పిస్తే వారి ప్రాతినిథ్యం పెరుగుతుందని వాదించేవారు లేకపోలేదు. నాగాలాండ్‌లో గతేడాది ప్రాంతీయ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించినప్పుడు పెద్ద గొడవ జరిగింది. అది హింసకు దారితీయడమే కాకుండా రాష్ల్రముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు వెళ్లింది. ఒక్క మహిళలే రిజర్వేషన్లనే కాదు, అన్ని రకాల రిజర్వేషన్లకు నాగాలాండ్ ఆదివాసీ తెగలు వ్యతిరేకం. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్న విషయాన్ని కూడా ఎక్కువగా స్థానిక సంఘాలే నియమిస్తాయి. కనుక మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటోంది.