nagaland cm
-
హోం క్వారంటైన్లో నాగాలాండ్ సీఎం
కోహిమా : నాగాలాండ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా సోకడంతో సీఎం నీఫియు రియో హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ముందుజాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రితోపాటు సీఎం కార్యాలయ అధికారులు హోం క్వారంటైన్ లోకి వెళ్లామని నాగాలాండ్ సీఎంవో ట్వీట్ చేసింది. కార్యాలయన్ని శానిటైజ్ చేసి 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్లో ఉన్న సీఎం ఇంటినుంచే పనిచేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు కార్యాలయంలోని సిబ్బంది, అధికారులు సహా మొత్తం 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ర్టంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1566కు చేరిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎస్ పంగ్న్యు వెల్లడించారు. ఇప్పటికే 625 మంది కోవిడ్ నుంచి కోలుకొనగా ప్రస్తుతం 936 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 39.9 శాతంగా ఉందన్న మంత్రి కిఫిరే జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. (ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం) Few persons in the Chief Minister’s Residential Complex have tested positive for COVID-19. All SOPs are being implemented. The complex is being sanitized and the residential office closed for 48hrs. The normal functioning of the CMO is continuing following all guidelines. — CMO Nagaland (@CmoNagaland) July 30, 2020 -
కేజ్రివాల్ చేస్తే తప్పు, రియో చేస్తే ఒప్పా?
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫ్యూ రియో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. 20 మంది శాసన సభ్యులను సలహాదారులుగా (అడ్వైజర్స్) నియమించి వారికి ఒకటి, రెండు ప్రభుత్వ విభాగాల సంపూర్ణ బాధ్యతలను అప్పగించారు. ఆ మరుసటి రోజే మరో ఆరుగురు శాసన సభ్యులను ప్రభుత్వరంగ సంస్థలకు, బాంబూ మిషన్ లాంటి మిషన్లకు చైర్మన్లను నియమించారు. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని చెల్లవని రాజకీయ విశ్లేషకులతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం 21 మంది శాసన సభ్యులను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమంటూ 2017, జూలై నెలలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. తాను పార్లమెంటరీ కార్యదర్శులను నియమించలేదని, అడైజర్లను మాత్రమే నియమించానని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని ముఖ్యమంత్రి నైఫ్యూ రియో వాదిస్తున్నారు. ఆయన ఏర్పాటు చేసిన పార్టీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. రాజ్యాంగం నిబంధనల ప్రకారం 12 మందికి మించి రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోరాదు. అసమ్మతి తలెత్తకుండా అందరిని సంతప్తిపరచడంలో భాగంగా రియో ఈ చర్య తీసుకున్నారు. ఢిల్లీలో కేజ్రివాల్ ఇలాంటి నిర్ణయమే తీసుకొని బోల్తాపడ్డారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని సుప్రీం కోర్జు కొట్టివేయగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందున 20 మంది ఆప్ ఎమ్మెల్యేల సభ్యత్వం చెల్లదని ఎన్నికల కమిషన్ దెబ్బ కొట్టింది. అంతటి చర్య తగతంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో వారి సభ్యత్వం మిగిలింది. పార్లమెంటరీ కార్యదర్శులు లేదా అడ్వైజర్లు పేర్లు వేరైన నియామకాలు ఒకే రకానికి చెందినవని, గతంలో వారికి ప్రత్యేక ప్రభుత్వ బాధ్యతలు ఇచ్చినట్లే ఇప్పుడు వీరికి ప్రత్యేక బాధ్యతలు ఇస్తున్నారని ‘నాగాలాండ్ వాలంటరీ కన్జూమర్స్ అసొసియేషన్’ అధ్యక్షుడు కిజోఖోటో సావి విమర్శించారు. ఈ నియామకాలు రాజ్యాంగంలోని 164 (1ఏ) అధికరణంతో పాటు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సహా మంత్రుల సంఖ్య మొత్తం అసెంబ్లీ సీట్లలో 15 శాతానికి మించరాదని స్పష్టం చేస్తున్న 2003లో రాజ్యాంగంలో తీసుకొచ్చిన 91వ సవరణను ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు. ఇంతకుముందు నాగాలాండ్ సీఎం టీఆర్ తెలియాంగ్ 2017లో పార్లమెంటరీ కార్యదర్శులను నియమించగా ఆ నియామకాలు చెల్లవంటూ సావియే రాష్ట్ర గవర్నర్ వద్ద సవాల్ చేశారు. ఆయన నుంచి తీర్పు వెలువడక ముందే అసెంబ్లీ కాలపరిమితి తీరిపోయి ఎన్నికలు జరిగాయి. ఈశాన్య ఇలాంటి నియామకాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. పార్లమెంటరీ కార్యదర్శులుగా ఆప్ నియమాకాలు చెల్లవంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ నియామకాలు కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంది. అడ్వజర్లుగా నియమితులైన వారికి బంగ్లా, కారు లాంటి అదనపు సౌకర్యాలు ఇస్తారా, లేదా అన్న విషయం తేలాక మాట్లాడతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ కొత్త నియామకాలకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తారా లేదా అన్న విషయం తనకు తెలియదని, అందుకని తానిప్పుడు ఏమీ మాట్లాడలేనని బాంబూస్ బోర్డు చైర్మన్‌గా నియమితులైన నాగాలాండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విసాసోలి లవుంగు వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రివాల్ పార్లమెంటరీ కార్యదర్శులను నియమించడంపై పెద్ద ఎత్తున బీజేపీ గొడవ చేయడంతోపాటు నానా రాద్ధాంతం చేసిన విషయం తెల్సిందే. -
నాగా సీఎంగా రియో ప్రమాణం
కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత నీఫియు రియో బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య.. రియోతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత పాట్టూన్ ప్రమాణం చేశారు. వీరుకాక మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలసి పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని రియో ఏర్పాటు చేశారు. మార్చి 16 లోగా అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని రియోను గవర్నర్ కోరారు. నాగా సీఎంగా రియో బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌తోపాటు తాజా మాజీ ముఖ్యమంత్రి జెలియాంగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు, త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం శుక్రవారం కొలువుదీరనుంది. త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. -
బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్
కొహిమా: నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో మొత్తం 59 మంది సభ్యులుండగా.. జెలియాంగ్కు అనుకూలంగా 47 మంది ఓటేశారు. వీరిలో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు 36 మందితో పాటు నలుగురు బీజేపీ సభ్యులు, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. మాజీ సీఎం లీజిట్సుకు 11 ఓట్లు పడగా.. వారిలో 10 మంది ఎన్పీఎఫ్, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. ఓటింగ్‌కు ముందు చర్చలో లీజిట్సు మద్దతు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆయనను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కాగా, 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
లోక్‌సభ బరిలోకి నాగాలాండ్ సీఎం
నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియో లోక్‌సభకు పోటీపడుతున్నారు. ఆయన గురువారం నాడు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆ రాష్ట్రంలో ఉన్న ఏకైక లోక్‌సభా స్థానం నుంచి ఆయనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి కె.వి.పూసా కూడా పోటీ పడుతున్నారు. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇద్దరూ లోక్‌సభకు పోటీ చేయడం ఇదే తొలిసారి. నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున సీఎం పోటీ పడుతున్నారు. నాగాలాండ్ అభివృద్ధి కోసమే తాను జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించి నాగాలాండ్‌లో చరిత్ర సృష్టించిన రియో.. నాగాలాండ్‌ను యూపీఏ నిర్లక్ష్యం చేసినందున తాము ఎన్డీయేకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత పదేళ్లలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కసారి కూడా నాగాలాండ్ రాలేదని, తమ పార్టీ వాళ్లకు మద్దతు కూడా ఇస్తోందని అన్నారు.