నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియో లోక్సభకు పోటీపడుతున్నారు. ఆయన గురువారం నాడు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆ రాష్ట్రంలో ఉన్న ఏకైక లోక్సభా స్థానం నుంచి ఆయనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి కె.వి.పూసా కూడా పోటీ పడుతున్నారు. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇద్దరూ లోక్సభకు పోటీ చేయడం ఇదే తొలిసారి. నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున సీఎం పోటీ పడుతున్నారు. నాగాలాండ్ అభివృద్ధి కోసమే తాను జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించి నాగాలాండ్లో చరిత్ర సృష్టించిన రియో.. నాగాలాండ్ను యూపీఏ నిర్లక్ష్యం చేసినందున తాము ఎన్డీయేకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత పదేళ్లలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కసారి కూడా నాగాలాండ్ రాలేదని, తమ పార్టీ వాళ్లకు మద్దతు కూడా ఇస్తోందని అన్నారు.
లోక్సభ బరిలోకి నాగాలాండ్ సీఎం
Published Thu, Mar 20 2014 8:41 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement