బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్‌ | Nagaland CM TR Zeliang wins floor test, 47 of 59 MLA vote in favour | Sakshi
Sakshi News home page

బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్‌

Published Sat, Jul 22 2017 3:59 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్‌

బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్‌

కొహిమా: నాగాలాండ్‌ సీఎం టీఆర్‌ జెలియాంగ్‌ అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో మొత్తం 59 మంది సభ్యులుండగా.. జెలియాంగ్‌కు అనుకూలంగా 47 మంది ఓటేశారు. వీరిలో నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ ఎమ్మెల్యేలు 36 మందితో పాటు నలుగురు బీజేపీ సభ్యులు, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. మాజీ సీఎం లీజిట్సుకు 11 ఓట్లు పడగా.. వారిలో 10 మంది ఎన్పీఎఫ్, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. ఓటింగ్‌కు ముందు చర్చలో లీజిట్సు మద్దతు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆయనను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కాగా, 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement