Nagari municipal commissioner
-
నగరి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కరోనా నివారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయంటూ ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు నగరి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నగరి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు
తిరుపతి: నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనపై ఉన్నతాధికారులు తీవ్రంగా మండిపడ్డారు. దాంతో బాలాజీనాథ్ యాదవ్‌ను మంగళవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలాజీనాథ్ స్థానంలో ఇంఛార్జ్ అధికారిగా పుత్తూరు కమిషనర్ హరిబాబుకు బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కణ్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.