nagercoil
-
తమిళ యువకుడు, పిలిప్పీన్స్ యువతి.. అలా ఒక్కటయ్యారు!
అన్నానగర్(చెన్నై): నాగర్‌కోయిల్‌లో ఆదివారం పిలిప్పీన్స్ యువతిని ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. వివరాలు.. స్థానిక నేశమణి నగర్‌కు చెందిన గుణశీలన్, మెర్సీ దంపతుల కుమారుడు జామీ రెన్స్విక్ (25), ఉన్నత విద్యావంతుడు. పిలిప్పీన్స్‌లోని మిండోనాకు చెందిన లాలిన్ (23) గ్రాడ్యుయేట్. ఉద్యోగ రిత్యా జామీ రెన్స్విక్స్ పిలిప్పీన్స్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఉద్యోగి అయిన లాలిన్ను ప్రేమించాడు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో తమిళ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. పిలిప్పీన్స్ నుంచి వీడియో కాల్ ద్వారా లాలిన్ వధువులు వివాహ వేడుకలో పాల్గొనడం గమనార్హం. చదవండి: మగవాళ్ల విందు.. తింటే పసందు -
తమిళనాట ఎన్డీయేదే గెలుపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే–బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో ఆయన రోడ్ షోతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయ సంకల్ప యాత్ర నిమిత్తం ఆదివారం నాగర్ కోయిల్‌లో అమిత్ షా పర్యటన సాగింది. ఉదయం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్‌కోయిల్ చేరుకున్న ఆయన అక్కడి సుశీంద్రం ధనుమలై పెరుమాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. నాగర్‌కోయిల్ భగవతి అమ్మన్ ఆలయంలో పూజల అనంతరం, రోడ్‌షోతో ముందుకు సాగారు. ఓపెన్ టాప్ వాహనంలో అమిత్ షా పర్యటన సాగింది. పొన్ రాధాకృష్ణన్‌ను గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. రోడ్ షో తర్వాత ఓ హోటల్లో బీజేపీ వర్గాలతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో అమిత్ షా మాట్లాడుతూ కన్యాకుమారి పార్లమెంట్, తమిళనాడు అసెంబ్లీని అన్నాడీఎంకే–బీజేపీ కూటమి గెలుచుకోవడం ఖాయ మన్నారు. రోడ్‌షోలో వేపముడు కూడలిలో ఉన్న దివంగత కాంగ్రెస్ సీఎం కామరాజర్ విగ్రహానికి అమిత్ షా పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం నాగర్ కోయిల్ పర్యటన ముగించుకుని మళ్లీ తిరువనంతపురానికి వెళ్లారు. -
కన్యాకుమారి అతలాకుతలం..
-
పెళ్లి పేరుతో దుర్మార్గం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పేదరికంతో ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు ఎలా చేయాలనుకుంటున్న ఆ దంపతుల బలహీనతను ఆసరా చేసుకుని 16 ఏళ్ల బాలికను చెరబట్టిన దుర్మార్గుడి ఉదంతమిది. పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను గృహనిర్బంధానికి గురిచేసి నెలరోజులకుపైగా అత్యాచారానికి పాల్పడిన మృగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ కురుసాడి ప్రాంతానికి చెందిన రాబర్ట్ బెల్లార్మిన్ (42) పరోటా మాస్టర్. నాగర్‌కోవిల్ సమీపం పల్లందురై ప్రాంతానికి చెందిన రాబర్ట్‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థల కారణంగా రాబర్ట్ భార్యతో విడిపోయాడు. రెండోపెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రాబర్ట్ తంజావూరు నాంజికోట్టై రోడ్డుకు చెందిన పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. వీరిలో 16 ఏళ్ల పెద్ద కుమార్తె పదో తరగతి చదువుపూర్తి చేయగా పెళ్లి చేసేందుకు వరుడు కోసం వెతుకుతున్నారు. తనకిచ్చి పెళ్లి చేస్తే అప్పులు తీర్చడంతోపాటు రూ.లక్ష నగదు ఇస్తానని బాలిక తల్లిదండ్రులను ప్రలోభపెట్టాడు. డబ్బుకు ఆశపడి గత నెల 10వ తేదీన కులశేఖరలోని ఒక ఆలయం బయట ఇరువురి చేత మాలలు మాత్రమే మార్పించి పెళ్లి అయిందనిపించారు. అదే ప్రాంతంలో ఇల్లు తీసుకున్న రాబర్ట్ కాపురం చేయాల్సిందిగా సదరు బాలికను వేధించడం ప్రారంభించాడు. తనతో సన్నిహితంగా ఉంటేనే తల్లితండ్రులకు డబ్బు ఇస్తానంటూ బాలికను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడేవాడు. రాబర్ట్ తీరును అనుమానించిన స్థానికులు చైల్డ్‌లైన్ సంస్థకు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్ సిబ్బంది స్థానిక పోలీసులను వెంటపెట్టుకుని గురువారం సదరు ఇంటికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే బాలిక కన్నీళ్లపర్యంతమైంది. మహిళా పోలీసుస్టేషన్‌కు ఆ బాలికను తరలించి విచారించగా తన దీనగాథను చెప్పుకుని బావురుమంది. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాబర్ట్ కోసం గాలిస్తున్నారు.