Tamil Nadu: Nagercoil Man Marries Philippines Girl In Tamil Tradition - Sakshi
Sakshi News home page

తమిళ యువకుడు, పిలిప్పీన్స్‌ యువతి.. అలా ఒక్కటయ్యారు!

Published Tue, Jan 10 2023 8:36 AM | Last Updated on Tue, Jan 10 2023 10:26 AM

Tamil Nadu: Nagercoil Youth Marries Philippines Girl - Sakshi

అన్నానగర్‌(చెన్నై): నాగర్‌కోయిల్‌లో ఆదివారం పిలిప్పీన్స్‌ యువతిని ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. వివరాలు.. స్థానిక నేశమణి నగర్‌కు చెందిన గుణశీలన్, మెర్సీ దంపతుల కుమారుడు జామీ రెన్స్‌విక్‌ (25), ఉన్నత విద్యావంతుడు. పిలిప్పీన్స్‌లోని మిండోనాకు చెందిన లాలిన్‌ (23) గ్రాడ్యుయేట్‌. ఉద్యోగ రిత్యా జామీ రెన్స్‌విక్స్‌ పిలిప్పీన్స్‌లో ఉంటున్నాడు.

ఈ క్రమంలో తన సహచర ఉద్యోగి అయిన లాలిన్‌ను ప్రేమించాడు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో తమిళ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. పిలిప్పీన్స్‌  నుంచి వీడియో కాల్‌ ద్వారా లాలిన్‌ వధువులు వివాహ వేడుకలో పాల్గొనడం గమనార్హం.

చదవండి: మగవాళ్ల విందు.. తింటే పసందు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement