nageswarrao
-
గాంధీజీ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి
ఏయూ గాంధీజీ నాయకత్వాన్ని యువతరం అందిపుచ్చుకోవాలని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో గాంధీ అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ.బి.ఎస్.వి రంగారావు, ఏయూ సాఫ్ట్‌స్కిల్స్ శిక్షకుడు చల్లా క్రిష్ణవీర్ అభిషేక్‌లు సంకలనం చేసిన గాంధీజీ ఆదర్శవాద నాయకత్వం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీని ప్రపంచ దేశాల నాయకులు మార్గదర్శకంగా తీసుకున్నారన్నారు. గాంధీజీ ఆవశ్యకతను నేటి సమాజానికి అన్వయించి విస్తత రూపాల్లో పరిశోధనలు జరపడం అవసరమన్నారు. గాంధీజీ ఆదర్శవాద నాయకత్వాన్ని, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రతిబింబిచే విధంగా పుస్తకాన్ని రచించిన రచయితలను అభినందించారు. విభిన్న కోణాలలో గాంధీజీలోని నాయకత్వాన్ని చూపడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, కరిమిల్లి సంతోష్ కుమార్, ప్రహర్ష్ తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏలకు న్యాయం చేయాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వీ వెంకయ్య డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు ఆదివారం మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని వెంకయ్య ప్రారంభించి ప్రసంగించారు. గత ఏడాది మార్చి 7న చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్తో జరిగిన చర్చల్లో వీఆర్ఏలకు నెలకు రూ 7500 వేతనం, రూ 500 డీఏ పెంచుతామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. చీఫ్ కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సుచేసి పదినెలలవుతున్నా అతీగతీ లేకుండా పోయిందన్నారు. ఆర్థిక శాఖకు పంపించిన ఫైల్‌కు అనేక ఆటంకాలు కలిగిస్తూ నెలల తరబడి నాన్చుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా రానున్న ఎన్నికల్లో ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు వస్తాయోనన్న లెక్కల్లో తలమునకలైందన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే వారికి మద్దతుగా ఆందోళ న కార్యక్రమాల్లో పాలుపంచుకుంటామని హెచ్చరించారు. బీఎస్ఎన్ఎల్ రిటైర్డు ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాల్సిన ప్రభుత్వం తక్కువ వేతనాలతో వీఆర్ఏలతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజనల్ కార్యదర్శి అయ్యపరెడ్డి మాట్లాడుతూ వీఆర్ఏలకు వేతనం పెంచుతున్నట్లు పత్రికల్లో ప్రకటించడం తప్పితే ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. కాలయాపన చేయకుండా వెంటనే వీఆర్ఏల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎస్కే బేగ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జీ శ్రీనివాసులు, కార్యదర్శి సీహెచ్ మజుందార్, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకుడు పాలడుగు వివేకానందలు దీక్షా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. -
భార్యకు కోపం...భర్త హతం
-
భార్య చేతిలో భర్త హతం
జూలపల్లి, న్యూస్‌లైన్ : కలకా లం తోడుండాల్సిన భర్తను భార్యే కడతేర్చింది. విలాసాలకు అలవాటుపడ్డ ఆమె మానసికస్థితి అదుపుతప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన జూలపల్లి మండ లం తేలుకుంటలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్ప వెంకటనరహరి(42) వివాహం కరీంనగర్ మండలం చెర్లబూత్కుర్కు చెందిన నాగలక్ష్మితో 22 ఏళ్ల క్రితం జరిగింది. కొడుకు, కూతురు సంతానం. కొడుకు ఇంజినీరింగ్ చదువుతుండగా, కూతురు ఇంటర్ చదువుతోంది. విలాసాలకు అలవాటుపడ్డ నాగలక్ష్మి మానసిక స్థితి కొన్నిరోజులుగా అదుపుతప్పింది. ఈ క్రమంలో భర్త గతంలో కూతురు పేరిట డిపాజిట్ చేసిన డబ్బులు వచ్చా యి. అతడు ఆ డబ్బులను మళ్లీ డిపాజిట్ చేశాడు. ఈ విషయమై కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. బుధవా రం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో ఇంట్లో వెంకటనరహరి పడుకుని ఉండగా ఆమె రోకలిబండతో అతడి తలపై బా దింది. తలపగిలి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ సీఐ సత్యనారాయణ, ఎస్సై నాగేశ్వర్రావు తెలిపారు. నాగలక్ష్మి ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.