గాంధీజీ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి | catch the leadership like gandhiji | Sakshi
Sakshi News home page

గాంధీజీ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి

Published Fri, Aug 19 2016 6:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

catch the leadership like gandhiji

 ఏయూ గాంధీజీ నాయకత్వాన్ని యువతరం అందిపుచ్చుకోవాలని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో గాంధీ అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఏ.బి.ఎస్‌.వి రంగారావు, ఏయూ సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షకుడు చల్లా క్రిష్ణవీర్‌ అభిషేక్‌లు సంకలనం చేసిన గాంధీజీ ఆదర్శవాద నాయకత్వం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీని ప్రపంచ దేశాల నాయకులు మార్గదర్శకంగా తీసుకున్నారన్నారు.
గాంధీజీ ఆవశ్యకతను నేటి సమాజానికి అన్వయించి విస్తత రూపాల్లో పరిశోధనలు జరపడం అవసరమన్నారు. గాంధీజీ ఆదర్శవాద నాయకత్వాన్ని, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రతిబింబిచే విధంగా పుస్తకాన్ని రచించిన రచయితలను అభినందించారు. విభిన్న కోణాలలో గాంధీజీలోని నాయకత్వాన్ని చూపడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డి.వి.ఆర్‌ మూర్తి, కరిమిల్లి సంతోష్‌ కుమార్, ప్రహర్ష్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement