Nagpur Metro Railway Corporation
-
సాధారణ ప్రయాణికుడిలా మోదీ.. టికెట్ కొని మెట్రో జర్నీ
ముంబై: దేశంలో మరో వందే భారత్ రైలు కూత పెట్టింది. జెండా ఊపి రైలును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ల మధ్య సేవలందించనుంది ఈ ట్రైన్. నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ.. ఆరో వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది, ప్రయాణికులతో ముచ్చటించారు మోదీ. దేశంలో సేవలు ప్రారంభించిన ఆరో వందే భారత్ రైలు ఇది. సాధారణ ప్రయాణికుడిలా మోదీ.. నాగ్‌పూర్‌లో రూ.8650 కోట్లతో నిర్మించిన మెట్రో ఫేస్ 1ని ప్రారంభించారు ప్రధాని. అనంతరం ఒక సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసి.. ఫ్రీడం పార్క్ నుంచి ఖప్రీ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. విద్యార్థులతో పాటు జర్నీ చేస్తూ వారితో ముచ్చటించారు. అనంతరం రూ.6700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మెట్రో ఫేస్ 2కు శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు స్వాగతం పలికారు. నాగ్‌పూర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం, నాగ్‌పూర్, అజని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. Maharashtra | Prime Minister Narendra Modi flags off the Vande Bharat Express train between Nagpur and Bilaspur, at Nagpur railway station. CM Eknath Shinde also present pic.twitter.com/7457ZaZQOG — ANI (@ANI) December 11, 2022 ఇదీ చదవండి: మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా? -
ఆ మెట్రోకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. గడ్కరీ ప్రశంసలు
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో రైలు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్ గల మెట్రోగా గిన్నిస్ రికార్డు సాధించింది. వార్ధా రోడ్లో నిర్మించిన ఈ డబుల్ డక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. నాగ్‌పూర్‌లోని మెట్రో భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమం వేదికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్నారు మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేశ్ దీక్షిత్. గిన్నిస్ రికార్డ్స్ జడ్జి రిషి నాత్ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దీక్షిత.. వార్దా రోడ్లో ఈ నిర్మాణాన్ని చేపట్టటం ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. ఇది థ్రీటైర్ నిర్మాణం. గడ్కరీ ప్రశంసలు.. నాగ్‌పూర్ మెట్రో రైలు గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన క్రమంలో మహారాష్ట్ర మెట్రో విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే అత్యంత పొడవైన డబుల్ డక్కర్ వయడక్ట్గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పైన మెట్రో వెళ్తుండగా.. మధ్యలో హైవే, కింద సాధారణ రవాణా మార్గం ఉంటుంది. Another feather in the cap ! Heartiest Congratulations to Team NHAI and Maha Metro on achieving the Guinness Book of World Record in Nagpur by constructing longest Double Decker Viaduct (3.14 KM) with Highway Flyover & Metro Rail Supported on single column. #GatiShakti @GWR pic.twitter.com/G2D26c7EKn — Nitin Gadkari (@nitin_gadkari) December 4, 2022 ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవు మేర రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించలేదు. దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది. గతంలో డబుల్ డక్కర్ వయడక్ట్ పద్ధతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు నిర్మించిన విభాగంలోనూ ఆసియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది మహారాష్ట్ర మెట్రో. ఇదీ చదవండి: ‘ఎయిమ్స్’ తరహాలో ‘ఐసీఎంఆర్’పై సైబర్ దాడి.. 6వేల సార్లు విఫలయత్నం -
నాగ్‌పూర్‌లో సోలార్ మెట్రో రైలు..?
- సిద్ధమైన నాగ్‌పూర్ మెట్రో రైల్వే కార్పొరేషన్ - ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు భరించనున్న జర్మనీ - వెల్లడించిన కార్పొరేషన్ ఎండీ బ్రిజేష్ దీక్షిత్ సాక్షి, ముంబై: ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ మెట్రో రైలు త్వరలో నాగ్‌పూర్‌లో పరుగెత్తనుంది. ఇందుకు సంబంధించిన పనులు తొందర్లోనే ప్రారంభం కానున్నాయి. దేశంలోని పలు నగరాల్లో ప్రస్తుతం మెట్రో రైల్వే పనులు కొనసాగుతుండగా మరికొన్ని చోట్ల పనులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే నాగ్‌పూర్‌లో మాత్రం సోలార్ మెట్రో రైలును ప్రవేశపెట్టేందుకు నాగ్‌పూర్ మెట్రో రైల్వే కార్పొరేషన్ సిద్ధమైంది. రూ. 200 కోట్ల ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించేందుకు జర్మనీ ముందుకు వచ్చినట్టు కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు. ఇండో-జర్మనీ సోలార్ కో-ఆపరేషన్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మే చివరి వారంలో జర్మనీకి చెందిన సాంకేతికృబందం నాగ్‌పూర్‌కు రానుంది. అదే సమయంలో సోలార్ మెట్రో ప్రాజెక్టుకు ఆర్థిక సహాయానికి సంబంధించిన విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రతి రైల్వేస్టేషన్ తోపాటు రెండు మెట్రో రైలు డిపోలపై సోలార్ ప్యానల్స్‌ను అమర్చనున్నారు. రైల్వే స్టేషన్ల నిర్మాణం కూడా అందుకు అనుగుణంగానే చేయనున్నారు. ఈ సోలార్ ప్లేట్ల ద్వారా సుమారు 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. అవసరం అయిన మొత్తం విద్యుత్‌లో 40 శాతం మెట్రో రైల్వేస్టేషన్ల నుంచే లభించనుంది. వరంగా మారనున్న ఎండ... నాగ్‌పూర్‌లో భానుడి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఏడాది ప్రధానంగా వేసవిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోతుంది. ఇప్పుడు ఈ భగభగ మండే ఎండలే సోలార్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి వరంగా మారాయి. సోలార్ ఎనర్జీ ద్వారా మెట్రో రైలు ప్రారంభమైతే ప్రపంచంలోనే తొలి సోలార్ మెట్రోగా నాగ్‌పూర్ నగరం చరిత్రకెక్కనుంది.