Nalajarla
-
చంద్రబాబు ప్రమాణస్వీకారం.. భారీగా ట్రాఫిక్ జామ్
-
చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి..
నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా): ఆమె చదివింది ఏడో తరగతి. అయినా వివిధ శాఖల అధికారినంటూ ప్రజలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడింది. శనివారం దూబచర్లలో బేకరీ, భోజన హోటల్‌ను చెక్ చేసి వసూళ్లకు పాల్పడుతుండగా సివిల్ సప్లయిస్ డీటీ సుజాత, వారి సిబ్బంది ఈ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాడేపల్లిగూడేనికి చెందిన కాళ్ల రమాదేవి నేషనల్ కన్సూ్యమర్ రైట్స్ కమిషన్ మహిళా చైర్‌పర్సన్‌గా ఐడీ కార్డుతో తన షిఫ్ట్ డిజైర్ కారులో వివిధ ప్రాంతాలలో సివిల్ సప్లయిస్ అధికారిగా, ఫుడ్ ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తూ హోటళ్లు, బేకరీలపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు దండుకుంటోంది. చదవండి: ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్ చేస్తూ.. ఈ విషయం సివిల్ సప్లయిస్ అధికారుల దృష్టికి రాగా కొంతకాలంగా ఆమె కోసం గాలిస్తున్నారు. శనివారం దూబచర్లలో బెంగళూరు బేకరీకి వెళ్లి గృహ వినియోగ గ్యాస్ వ్యాపారానికి వినియోగిస్తున్నారంటూ బెదిరించి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా యజమాని ప్రదీప్ రూ.3 వేలు ఇచ్చాడు. అదే గ్రామంలో శివాలయం దగ్గర భోజన హోటల్‌కు వెళ్లి వంటకు వినియోగిస్తున్న రెండు గ్యాస్ సిలిండర్లు సీజ్ చేస్తానని బెదించింది. కేసు లేకుండా చేయాలంటే రూ.5 వేలు ఇవ్వాలంది. యజమాని ముగ్గాల సర్వేశ్వరరావు రూ.2 వేలు ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఆ గ్రామ వీఆర్ఏ రవి తమ సివిల్ సప్లయిస్ డీటీ సుజాతకు సమాచారం అందించి నిందితురాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమలకు చెందిన చెల్లా ఏసు తప్పించుకుని పారిపోయాడు. పారిపోయిన చెల్లా ఏసుపై, ఆమె కారు డ్రైవరు దూబచర్ల గాంధీకాలనీకి చెందిన బోడిగడ్ల బాలరాజును, నకిలీ అధికారి రమాదేవిపై సీఐ లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐ ఆదినారాయణ కేసు నమోదు చేశారు. -
మొక్కు తీరకుండానే మృత్యుఒడికి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు/నల్లజర్ల/పెందుర్తి: అతివేగం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించలేక వేగంగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఐదుగురు తీవ్ర గాయాలతో తాడేపల్లిగూడెం, ఏలూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చిన్న మనవడి పుట్టువెంట్రుకలు వెంకన్నకు సమర్పించేందుకు విశాఖ జిల్లా పెందుర్తి నుంచి తిరుపతికి బయలుదేరిన కుటుంబం నల్లజర్ల చేరుకునే సరికి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురంలో నివాసం ఉంటున్న తమ్మిన నీలకంఠరావు, లక్ష్మి దంపతులు, పెద్ద కుమార్తె రమాదేవి భర్త రామకృష్ణ, కుమార్తె తనూజ, గాజువాక ఆర్టీసీ డిపో సమీప ములగాడ హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్న చిన్న కుమార్తె భర్త అప్పలరాజు, కుమారుడు జ్ఞానేశ్వర్ మృత్యువాత పడ్డారు. వీరంతా తీర్థయాత్ర కోసం ‘ఓమ్ని’ వాహనంలో బయలుదేరి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. రెక్కల కష్టంతో స్థిరపడుతుండగా... నిరుపేద కుటుంబానికి చెందిన నీలకంఠరావు, లక్ష్మి దంపతులు 30 ఏళ్ల క్రితం విజయనగరం జిల్లా బల్లలవలస నుంచి గాజువాక ప్రాంతా నికి వచ్చి నివాసం ఉంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు రమాదేవి, నీలిమ, కుమారుడు మణికంఠ ఉన్నారు. రమాదేవి, నీలిమలకు పెళ్లి చేసిన తరువాత నీలకంఠం దంపతులు దాదాపు ఆరేళ్ల క్రితం పెందుర్తి మండలం రాంపురం వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం రమాదేవి కుటుం బాన్ని కూడా రాంపురం తీసుకువచ్చేశారు. నీలకంఠం దంపతులు స్థానికంగా రిటైల్ బియ్యం వ్యాపారం చేస్తుండగా రమాదేవి, రామకృష్ణ దంపతులు సోడాలు, సాయంత్రం పూట చిరు తినుబండారాల వ్యాపారం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చిన్న మనవడి పుట్టు వెంట్రుకలు కూడా వెంకన్నకు సమర్పిద్దామని సంకల్పించారు. ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇద్దరు కుమార్తెల కుటుంబాలతో కలిసి యాత్రకు బయలుదేరారు. గురువారం రాత్రి అన్నవరంలో సత్యనారాయణస్వామిని సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం బయలుదేరి ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత విజయవాడ, తిరుపతి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. ఆ దంపతులు సహా ఇద్దరు కుమార్తెల ఐదోతనాన్ని ప్రమాదం బలిగొంది. ఇద్దరు మనవళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. మొక్కు చెల్లించుకునేందుకుబయలుదేరి... చాన్నాళ్లుగా మొక్కులు ఉండడంతో పాటు చిన్న కుమార్తె కొడుకు జ్ఞానేశ్వర్‌కు 9 నెలల వయసు రావడంతో తిరుపతిలో పుట్టు వెంట్రుకలు తీయాలన్న ఆలోచనతో తీర్థయాత్రకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం నీలకంఠం, లక్ష్మి, రమాదేవి, రామకృష్ణ, నీలిమ, అప్పలరాజు దంపతులతో పాటు పిల్లలు తనూజ, రేష్మ, యశ్విన్, జ్ఞానేశ్వర్, నీలకంఠం కుమారుడు మణికంఠతో కలిసి మొత్తం 11 మంది అన్నవరం చేరుకున్నారు. రాత్రి అక్కడే నిద్రించి శుక్రవారం వేకువజామున సత్యనారాయణస్వామి దర్శ నం చేసుకుని అనంతరం తిరుపతి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నల్లజర్ల వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో నీలకంఠం, లక్ష్మి, రామకృష్ణ, అప్పలరాజు, తనూజ, జ్ఞానేశ్వర్ దుర్మరణం చెందారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు. ప్రమాదం జరిగిన తర్వాత లక్ష్మిని బయటకు తీసిన తర్వాత కొద్దిసేపు బాగానే ఉన్నా తర్వాత కుటుంబ సభ్యుల పరిస్థితి చూసి షాక్‌తో కుప్పకూలిపోయి ప్రాణాలు కొల్పోయింది. నల్లజర్ల ఆసుపత్రిలో తనూజ, జ్ఞానేశ్వర్ మృతి చెందగా, ఏలూరు తరలిస్తుండగా అప్పలరాజు, రామకృష్ణ మృతి చెందారు. నీలిమను తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. స్పందించిన ఎమ్మెల్యేలు.. నల్లజర్ల ప్రమాద సమాచారం తెలియగానే పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. వెంటనే పశ్చిమగోదావరి ఉన్నతాధికారులతో ఫోన్లో సంప్రదించి ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, సొసైటీ అధ్యక్షుడు కారుమంచి రమేష్, తహసీల్దార్ కనకదుర్గ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నల్లజర్లలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారన్న విషయం తెలియగానే ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్, కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ వి.రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం మల్కాపురం(విశాఖ పశ్చిమ): జీవీఎంసీ 47వ వార్డు ములగాడ హౌసింగ్ కాలనీ ప్రాంతానికి చెందిన పలుకూరి అప్పలరాజు(36), భార్య నీలిమ(31)లకు మూడున్నరేళ్ల యశ్విన్, 9 నెలల జ్ఞానేశ్వర్ సంతానం. చిన్నకుమారుడు జ్ఞానేశ్వర్‌కు పుట్టుతల తీయించడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తూ ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో చిన్న కుమారుడు జ్ఞానేశ్వర్‌తోపాటు అప్పలరాజు మృతిచెందడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. గాజువాకలో హోల్‌సేల్‌గా అప్పలరాజు కొబ్బరిబొండాలు కొనుక్కుని వాటిని తోపుడు బండిపై మల్కాపురం ప్రాంతంలో అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు అప్పలరాజు ప్రమాదంలో మృతి చెందటంతో భార్య, మరో కుమారుడు దిక్కులేని వారయ్యారు. విషయం తెలుసుకున్న బంధవులు ప్రమాద స్థలానికి తరలివెళ్లారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని నల్లజర్ల పెట్రోలు బంకువద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు భార్యాభర్తలు, మూడు సంవత్సరాల పాప తనూజతో పాటు, ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. -
నకిలీ వైద్యుని లీలలపై విచారణ
నల్లజర్ల రూరల్: నల్లజర్లలో నకిలీ వైద్యుడు జువ్వాల రమేష్‌బాబు లీలలపై వైద్య ఆరోగ్య శాఖ గురువారం విచారణ ప్రారంభించింది. నల్లజర్లలో జువ్వల రమేష్ పేరుతో వైద్యునిగా చలామణి అవుతూ తన వైద్యశాలలో నర్సుగా చేరిన యంట్రపాటి రాజేశ్వరి(21)(అలియాస్)కవితను మాయమాటలతో నమ్మించి, మోసగించడంతో ఆ యువతి మృతి చెందిన విషయం విదితమే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఆరోగ్య విస్తరణాధికారి సీ.హెచ్.నాగేశ్వరావు, తాడేపల్లిగూడెం క్లస్టర్ వైద్యాధికారిణి సుజాత, నల్లజర్ల పీహెచ్సీ డాక్టర్ జి.సుధీర్‌కుమార్ ఆధ్వర్యంలో నబీపేట వెళ్లిన ఈ బృందం మృతురాలి తల్లిదండ్రులు సుబ్బారావు, సంతోషంల నుంచి వివరాలు సేకరించారు. ఏడాదిన్నర క్రితం నుంచి తమ కుమార్తె నర్సుగా అక్కడ పని చేస్తోందని ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి పేరుతో వైద్యుడు రమేష్ బాబు మోసం చేశారని రాజేశ్వరి తల్లితండ్రులు అధికారులకు వివరించారు. రెండుసార్లు గర్భస్రావం చేయించి నట్టు తమకు చెప్పిందని తమ కుమార్తెను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గర్భస్రావం వికటించడం వల్లే తమ కుమార్తె మృతి చెందినట్టు చెప్పారు. దీనిపై డీఈఎంవో నాగేశ్వరావు మాట్లాడుతూ క్లస్టర్ వైద్యాధికారిణి సుజాత ప్రాథమిక విచారణ చేశారని, అనంతర విచారణకు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి తనను నియమించినట్టు చెప్పారు. జువ్వలరమేష్ క్యాలిఫైడ్ డాక్టరు కాదని తమ విచారణలో తేలిందన్నారు. ఆసుపత్రి నిర్వహించడానికి గాని అక్కడ వైద్యం చేయడానికి గాని అతనికి ఎటువంటి అనుమతి లేదన్నారు. రమేష్‌బాబుపై క్రిమినల్ కేసు నమోదు పెడుతున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 282 ఆసుపత్రులకు,174 ల్యాబ్‌లకు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. 16 క్లస్టర్ల పరిధిలో ఉన్న అడిషనల్ డీఎంహెచ్వోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారన్నారు. అనధికార ఆసుపత్రుల నిర్వహణపై సర్వే జరిపిస్తున్నామన్నారు. పీఎంపీలు, ఆర్ఎంపీలు తమ పరిధులు దాటి వైద్యం చేయరాదన్నారు. అనంతరం వైబీ ఆసుపత్రిని పరిశీలించగా అనధికారికంగా మందులు విక్రయించడం, ఆపరేషన్లు చేయడం వంటి విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆసుపత్రిని పోలీసులతో సీజ్ చేయించారు. వీరితో పాటు నబీపేట సర్పంచ్ కాశీ, క్లస్టర్ విద్యాధికారి వి.వి.శ్రీరామ్మూర్తి, సూపర్వైజర్ సుభాకర్, ఏఎన్ఎంలు ఉన్నారు. మరింత మంది ‘శంకర్‌దాదాలు’ తణుకు : నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రి నిర్వహిస్తూ అధికారుల తనిఖీలో బట్టబయలైన తణుకు పట్టణానికి చెందిన నకిలీ డాక్టర్ శ్రీకాంత్ ఉదంతం... నల్లజర్లకు చెందిన జువ్వాల రమేష్ అనే నకిలీ డాక్టర్ వైబీ ఆసుపత్రి పేరుతో వైద్యం చేస్తున్న వ్యవహారం... ఇలా జిల్లాలో నకిలీ డాక్టర్లు వైద్యవృత్తిలో కొనసాగుతున్న తీరు వైద్య రంగాన్నే విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలో ఈ తరహా వైద్యులు మరింత మంది ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా తణుకు పట్టణానికి చెందిన మరో ప్రైవేటు వైద్యుడు తనకు సర్టిఫికెట్లు లేవంటూ జిల్లా వైద్యాధికారులను ప్రాధేయపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వైద్యుడు గత 15 రోజులుగా ఆసుపత్రికి రాకుండా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతోనే శ్రీకాంత్, రమేష్‌లాంటి ‘శంకర్‌దాదాలు’ పుట్టుకొస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆసుపత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ కమిటీలు సమావేశమై చర్చించుకున్న దాఖలాలు లేవు. మరి కొందరు వైద్యులు ఎండీ కోర్సు మధ్యలో నిలిపేసినప్పటికీ ప్రముఖ వైద్యుల జాబితాలోనే కొనసాగుతుండటం విశేషం. కొందరు వైద్యులు తాము చదువుతున్న కోర్సు మధ్యలో నిలిపివేసినా... లేక కోర్సు చదువుతున్నప్పటికీ తమ డిగ్రీలను బ్రాకెట్లో పెట్టుకుంటూ ప్రజలను,అధికారులను మభ్యపెడుతున్నారు. అందేంటని ప్రశ్నిస్తే ఇంకా కోర్సు పూర్తి కాలేదు అందుకనే డిగ్రీను బ్రాకెట్లో పెట్టానని తణుకు పట్టణానికి చెందిన ఒక వైద్యుడు సమాధానం ఇవ్వడం గమనార్హం.