nallacheruvu
-
'నా హత్యకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు'
అనంతపురం: టీడీపీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. తమ అక్రమాలకు అడ్డుచెబుతున్నారన్న కారణంగా గతంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డారు. మరికొన్ని సందర్భాలలో సొంత పార్టీకే చెందిన మహిళా నేతలను సైతం వదలని టీడీపీ అధిష్టానం తాజాగా ప్రజా ప్రతినిధులపై దాడులకు పాల్పడటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఓ సర్పంచ్ హత్యకు దుండగులు యత్నించడంతో వారిలో ఆందోళన నెలకొంది. తన హత్యకు టీడీపీ నేతలు కుట్రపన్నారని నల్లచెరువు సర్పంచ్ రవికుమార్ రెడ్డి ఆరోపించడం అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. కొందరు గుర్తు తెలియని దుండగులు సుమోలో నల్లచెరువు మండల కేంద్రానికి వచ్చారు. సర్పంచ్ రవికుమార్ ఇంటిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. అయితే విషయాన్ని గమనించిన సర్పంచ్ గట్టిగా కేకలు వేయడంతో దుండగులు సుమోలో పారిపోయారు. దీనిపై బాధిత నేత రవికుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన హత్యకు టీడీపీ కుట్రపన్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా టీడీపీ నేతల పనే అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు నల్లచెరువులో సీసీ కెమెరాలు పనిచేయక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాన్ ప్రకారమే రవికుమార్ హత్యకు కుట్ర జరిగి ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది. -
విద్యార్థి అదృశ్యం
కదిరి టౌన్ : నల్లచెరువులో అమ్మజాన్, అల్లాబకష్ దంపతుల కుమారుడు జైనుల్లా(7) అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడన్నారు. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని ఇంటి ఆవరణలో గడచిన సోమవారం ఆడుకుంటూ బాలుడు అదృశ్యమయ్యాడండూ తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. అప్పటి నుంచి గాలించినా ప్రయోజనం లేకపోవడంతో తమకు ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తహశీల్దార్ పర్సు చోరీ
నల్లచెరువు : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కళావతి పర్సు చోరీకి గురైంది. ఈ మేరకు తహశీల్దార్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచి కంప్యూటర్ గదిలోకి వెళ్లి వచ్చానని భోజనం కోసం పర్సు తీసుకోవాలని చూడగా పర్సు కనపడలేదని, అందులో రూ.4వేల నగదు ఉన్నట్లు తెలిపారు. -
టీడీపీ నేత దౌర్జన్యం
కదిరి : నల్లచెరువులో టీడీపీ నేత, సింగిల్ విండో డైరెక్టర్ తిరుపాలు వీరంగం సష్టించాడు. కె.పూలుకుంటకు వెళ్లే దారిలో పిల్లలకు బిస్కెట్లు కొనుక్కుంటున్న దామవాండ్లపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్న వెంకటరమణపై తిరుపాలు మంగళవారం ఇనుప రాడ్‌తో దాడి చేసి కుడిచేయి విరగ్గొట్టాడు. ఒక కేసులో రాజీ ధోరణితో వెళ్లండని ఆయన సూచించడంతో ‘నువ్వెవర్రా చెప్పడానికి? నీ పెద్ద మనిషి తనం ఎవడికి కావాల్రా..’ అంటూ వచ్చీ రాగానే ఇనుపరాడ్‌తో దాడి చేశాడని బాధితుడు పోలీసుకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరామర్శించిన డాక్టర్ సిద్దారెడ్డి వైస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పి.వి. సిద్దారెడ్డి వెంటనే కదిరి ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్న వెంకటరమణను పరామర్శించారు. బాధితుడికి ధైర్యం చెబుతూ, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. ఆయన వెంట పార్టీ నల్లచెరువు మండల కన్వీనర్ రమణారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దశరథనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మీపతి ఉన్నారు. -
సహజీవనానికి నిరాకరించిందని యువతిపై దాడి
-
సహజీవనానికి నిరాకరించిందని యువతిపై దాడి
గుంటూరు: తనతో సహజీవనం చేయడానికి నిరాకరించిందని యువతిపై ప్రేమాన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు పట్టణంలోని నల్ల చెరువు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లచెరువులోని 8వ లైన్‌కు చెందిన కె.లక్ష్మి, చెందేటి వేణుగోపాల్ ఇద్దరూ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వీరు 10వ తరగతి నుంచీ కలసి చదువుకుంటున్నారు. దీంతో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరు నెలల క్రితం వీరిద్దరూ శ్రీనివాసరావు తోటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేయడం ప్రారంభించారు. అయితే, వేణుగోపాల్‌కు గతంలోనే పెళ్లి అయినట్లు తెలియడంతో లక్ష్మి గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో వేణుగోపాల్ శుక్రవారం తెల్లవారు జామున నల్లచెరువులోని లక్ష్మి ఇంటికి వచ్చాడు. డాబాపై నిద్రిస్తున్న లక్ష్మి దగ్గరకు వెళ్లి కలసి ఉందామని, తిరిగి తనతో రావాలని కోరాడు. ఆమె కాదనడంతో కత్తితో దాడి చేసి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతడిని దొంగగా భావించిన స్థానికుడు అబ్దుల్ రఫీ పట్టుకునే ప్రయత్నం చేయగా వేణుగోపాల్ అతడిపై కూడా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. గాయపడిన లక్ష్మి, రఫీలను వెంటనే చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
టీడీపీ ఏజెంట్‌గా రౌడీషీటర్ హాజరు
అనంతపురం జిల్లా నల్లచెరువు జెడ్పీటీసీ కౌంటింగ్‌లో టీడీపీ ఏజెంట్‌గా స్ఠానిక రౌడీషీటర్ నాగభూషణం నాయుడు పాల్గొన్నారు. జడ్పీటీసీ కౌంటింగ్‌లో ఓ రౌడీ షీటర్‌ను ఏలా అనుమతిస్తారని పలు పార్టీల నాయకులు ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి రౌడి షీటర్‌ను బయటకు పంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అదే అంశంపై వైఎస్ఆర్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు మాత్రం వైఎస్ఆర్ ఫిర్యాదుని మాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల అధికారులు, పోలీసులు వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.