అనంతపురం జిల్లా నల్లచెరువు జెడ్పీటీసీ కౌంటింగ్లో టీడీపీ ఏజెంట్గా స్ఠానిక రౌడీషీటర్ నాగభూషణం నాయుడు పాల్గొన్నారు. జడ్పీటీసీ కౌంటింగ్లో ఓ రౌడీ షీటర్ను ఏలా అనుమతిస్తారని పలు పార్టీల నాయకులు ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి రౌడి షీటర్ను బయటకు పంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
అదే అంశంపై వైఎస్ఆర్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు మాత్రం వైఎస్ఆర్ ఫిర్యాదుని మాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల అధికారులు, పోలీసులు వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.