nalluru
-
నిశ్చితార్థం అయ్యాక మోసం చేశారు
నల్లూరు (రొద్దం) : నిశ్చితార్థం అయ్యాక ఆ అమ్మాయిని మరొకరికి ఇచ్చి వివాహం చేసి తమను మోసం చేశాడంటూ ఓ పెళ్లికుమారుడి తండ్రి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. నిశ్చితార్థానికి అయిన ఖర్చును ఇప్పించాలంటున్నాడు. బాధితుడు తెలిపిన మేరకు.. రొద్దం మండలం నల్లూరు గ్రామానికి చెందిన వామన మూర్తి కుమారుడు రాఘవేంద్రరెడ్డికి కొత్తచెరువు మండలం ఓబుళదేవరపల్లికి చెందిన రవీంద్రారెడ్డి కుమార్తెతో ఈ ఏడాది మార్చి 8న నిశ్చితార్థం జరిగింది. అయితే తమకు తెలియకుండా రవీంద్రారెడ్డి తన కూతుర్ని మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడని వామనమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిశ్చితార్థానికి రూ.11 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 14న వివాహం జరగాల్సి ఉందని ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని సరుకులు సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. తాము ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వాలని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులను అడిగితే తమను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుని, నిశ్చితార్థానికి ఖర్చుపెట్టిన రూ.11 లక్షలు వారి నుంచి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించిన వ్యక్తితో వివాహం చేసుకున్నట్లు సమాచారం. -
కమనీయం..రాములోరి పట్టాభిషేకం
రొద్దం (పెనుకొండ) : మండలంలోని నల్లూరు గ్రామంలో శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం కమనీయంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారిని కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలతో రాములోరి పట్టాభిషేకం జరిపించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని చోళేమర్రి, కల్లుకుంట గ్రామాల్లో శ్రీరామ పట్టాభిషేక వేడుకలు వైభవంగా జరిపారు. -
బసవన్నల రంకెలు
► పాలమేడులో జల్లికట్టు సందడి ► నేడు అలంగా నల్లూరులో సాక్షి, చెన్నై : రంకెలేసే బసవన్నలు, వాటి పొగరు అణచి వేసే క్రీడాకారుల పౌరుషంతో సాహస క్రీడ జల్లికట్టు గురువారం పాలమేడులో జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మదురై జిల్లా అలంగానల్లూరులో శుక్రవారం కోలాహలంగా జల్లికట్టు సాగనుంది. ఇందుకుతగ్గ ఏర్పాట్లు సర్వం సిద్ధం అయ్యాయి. తమిళుల సంప్రదాయ, సహాస క్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టును పోరాడి మరీ దక్కించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చట్టం, ఇందుకు రాష్ట్రపతి ఆమోదం వెరసి జల్లికట్టుపై విధించబడి ఉన్న అడ్డంకులన్నింటిని తొలగించాయి. మదురై జిల్లా అవనీయాపురం వేదికగా, రెండు రోజుల క్రితం జల్లికట్టుకు శ్రీకారం చుట్టారు. అవనీయాపురంలో ఏడు వందల ఎద్దులు రంకెలు వేస్తూ కదనరంగంలోకి దూసుకెళ్లాయి. అవనీయాపురం తదుపరి పాలమేడులో గురువారం జరిగిన జల్లికట్టు వీరత్వాన్ని చాటింది. ఉదయం ఆరున్నగర గంటలకే పెద్ద ఎత్తున జన సందోహం వాడి వాసల్కు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కొమ్ములు తిరిగిన బసవన్నలు రంకెలేస్తూ రంగంలోకి దిగాయి. ముందుగా నమోదు చేసిన పశువులను మాత్రమే జల్లికట్టుకు అనుమతించారు. టోకెన్లు పొందిన క్రీడాకారులను మాత్రమే క్రీడా రంగంలోకి పంపించారు. ఎద్దులు జనం లోకి చొచ్చుకు వెళ్లకుండా, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవులు జల్లికట్టును ప్రారంభించారు. పాలమేడు గ్రా మంలోని మహాలింగ స్వామి మఠం వద్ద ఏర్పా టు చేసిన వాడివాసల్కు ప్రత్యేక పూజలు జరి గాయి. ఆలయంలో విశేష పూజల అనంతరం వాడి వాసల్ నుంచి ఒక దాని తర్వాత మరొకటి చొప్పున రంగంలోకి ఎద్దులు దిగాయి. వాటి పొగరును అణచివేస్తూ క్రీడాకారులు తమ పౌరుషాన్ని చాటి బహుమతుల్ని తన్నుకెళ్లారు. గెలి చిన క్రీడాకారులకు సెల్ఫోన్ లు, బిందెలు, బీరు వా, మంచాలు, వాషింగ్ మిషన్లు, ఏసీ, ఫ్యాన్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, బుల్లెట్, బంగారు నాణేలతో పాటు ఆకర్షణీయమైన బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. 850 ఎద్దులు పాల మేడుకు తరలివచ్చాయి. ఇందులో అనేక ఎద్దు తు క్రీడకారుల చేతికి చిక్కకుండా తమ యజ మానులకు బహుమతుల్ని సాధించి పెట్టాయి. నేడు అలంగానల్లూరులో: జల్లికట్టు అంటే..అలంగా నల్లూరు అన్న విషయం తెలిసిందే. మదురైలో జల్లికట్టుకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామంలో శుక్రవారం సాహస క్రీడకు సర్వం సిద్ధం అయిం ది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరు జల్లికట్టు వీక్షణకు వేలాదిగా దేశ విదేశాల నుంచి జనం తరలి వచ్చే అవకాశం ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల నిఘా నీడలో ఇక్కడ సాహస క్రీడ రసవత్తరంగా సాగబోతోంది. ఇక్కడ పదిహేను వందల ఎద్దులు వాడివాసల్ నుంచి దూసుకురాబోతున్నాయి. విచారణ : జల్లికట్టుకు మద్దతుగా సాగిన ఉద్యమ అల్లర్లపై రిటైర్డ్ న్యాయమూర్తి రాజేశ్వరన్ గురువారం విచారణ చేపట్టారు. బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. -
పంట కాల్వలో పడి యువతి మృతి
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు నల్లూరు (కపిలేశ్వరపురం) : ఓ పక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన యువతి కాకి సుబ్బలక్ష్మి (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తోడబుట్టిన సోదరుడే పంట కాల్వలోకి తోసేయడంతో ఆమె చనిపోయిందంటూ మరో సోదరుడు ఫిర్యాదు చేయడంతో సోమవారం అంగర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎస్సై కె.దుర్గాప్రసాద్, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం... సుబ్బలక్ష్మి మండపేటలోని ఓ ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. హైదరాబాద్లో ఉంటున్న ఆమె సోదరుడు కాకి రాంబాబు వేలిముద్రల ఫీడింగ్ నిమిత్తం ఇటీవల నల్లూరు వచ్చాడు. మరో సొదరుడు కాకి సత్యనారాయణ ఆలమూరు మండలం చింతలూరులో నివాసం ఉంటున్నాడు. రాంబాబు అక్కడకు వెళ్లి ఆర్థిక వ్యవహారాలను చర్చిస్తూ తగవు పడ్డాడు. సోదరి సుబ్బలక్ష్మికి పెళ్లి చేయాల్సి ఉన్నందున బాధ్యతగా ఉండాలని రాంబాబును అన్న సత్యనారాయణ మందలించాడు. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం సుబ్బలక్ష్మి మండపేట నుంచి చింతలూరులోని సోదరుడు ఇంటికి వచ్చింది. రాంబాబు తనను తరచూ కొడుతున్నాడని చెప్పగా ధైర్యం చెప్పి నల్లూరులోని తల్లి వద్దకు వెళ్లమని పంపించాడు. విషయం తెలుసుకున్న రాంబాబు చింతలూరులో ఆటో కోసం ఎదురుచూస్తున్న సోదరి సుబ్బలక్ష్మితో గొడవ పడ్డాడు. ఇద్దరూ నల్లూరు వెళ్లేందుకు ఆటో ఎక్కి వెదురుమూడిలో దిగారు. వంతెన వద్దకు వచ్చే సరికి రాత్రి సమయంలో సుబ్బలక్ష్మి పంట కాల్వలో పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కాలేరు గ్రామ శివారులో సోమవారం మృతదేహం లభ్యమైంది. ఎస్సై కె.దుర్గాప్రసాద్ శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఆచూకీ కనిపించడం లేదంటూ కేసు నమోదు చేసిన పోలీసులు సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు రాత్రి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. చిన్న వయస్సులోనే ఇళ్లల్లో పనిచేసుకుంటూ తమకు చేదోడు వాదోడుగా ఉంటున్న సుబ్బలక్ష్మి మృతిని ఆమె తల్లి తట్టుకోలేకపోతూ రోధిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది.