నా కొద్దు బాబోయ్ సీటు
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు నామక్కల్ అభ్యర్థి మహేశ్వరన్ పెద్ద షాక్ ఇచ్చారు. మరి కొన్ని గంటల్లో తమ అధినేత ఎన్నికల ప్రచారానికి రాబోతున్న సమయంలో తనకు సీటు వ ద్దు బాబోయ్ అంటూ తిరస్కార స్వరాన్ని అందుకున్నారు. దీంతో మరో అభ్యర్థి కోసం విజయకాంత్ వేట ఆరంభించారు.
సాక్షి, చెన్నై : బీజేపీతో కూటమిలో ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్ గత వారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గుమ్మిడిపూండిలో ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టిన సమయంలో డీఎండీకే కార్యాలయం ఐదుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో నలుగురు ఎంపీ అభ్యర్థులు, ఒకరు ఆలందూరు ఉప ఎన్నికబరిలో నిలబడే అభ్యర్థి. వీరిలో నామక్కల్ ఎంపీ అభ్యర్థిగా స్థానిక నేత, గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన మహేశ్వరన్‌ను ఎంపిక చేశారు. తిరస్కారం: మహేశ్వరన్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన మద్దతుదారులు సంబ రాలు చేసుకున్నారు. అయితే సోమవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు, ఈ సీటు మరొకరికి అప్పగించాలని విజయకాంత్‌ను అభ్యర్థిస్తూ మహేశ్వరన్ ప్రకటించారు. కొన్ని గంటల్లో నామక్కల్ ప్రచారం నిమిత్తం విజయకాంత్ వస్తుండగా మహేశ్వరన్ తిరస్కార స్వరాన్ని అందుకోవడం స్థానిక డీఎం డీకే వర్గాల్లో ఆందోళన రేపింది. ఆయన్ను బుజ్జగించేందుకు యత్నిస్తే, వెళ్లి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
అనారోగ్యం: అనారోగ్యం కారణంగా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని మహేశ్వరన్ స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం తనకు వెన్ను నొప్పి మొదలైందని, ఇప్పుడు తలనొప్పి బాధపెడుతోందని వివరించారు. ఇందుకు తగ్గ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానన్నారు. రెండు రోజుల క్రితం కోయంబత్తూరులో తాను చికిత్స తీసుకున్న ఆస్పత్రికి వైద్య పరీక్ష చేయించుకోగా, అడ్మిట్ కావాలని వైద్యులు తేల్చినట్టు పేర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్లే తాను తప్పుకుంటున్నానేగానీ, ఇతరుల ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. చివరి క్షణంలో తిరస్కార ప్రకటన చేయకుండా, ముందుగానే మహేశ్వరన్ ప్రకటించడాన్ని డీఎండీకే వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. అయి తే, తమ నేత ప్రచారానికి వస్తున్న సమయం లో మహేశ్వరన్ ఇలా ప్రవర్తించడం మంచిపద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒత్తిడి : అనారోగ్య కారణాలు పైకి చెబుతున్నా, కుటుంబసభ్యుల ఒత్తిడితోనే మహేశ్వరన్ తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం విచ్చల విడిగా నగదును మహేశ్వరన్ పంచి పెట్టారు. అయితే ఓటమి చవి చూశారు. విజయకాంత్ మీదున్న ప్రేమతో ఆ పార్టీలో కొనసాగుతూ, ఆ పార్టీ కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొంటూ వచ్చారు. మళ్లీ సీటు మహేశ్వరన్‌కు దక్కడంతో కుటుంబీకులు ఆగ్రహానికి లోనయ్యారు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసినా ఓటమి తప్పదని, తప్పుకోవాలంటూ కుటుంబీకులు ఒత్తిడి తీసుకురావడంతో తిరస్కార నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.