nandyal town
-
జై జగన్ అంటూ మారుమ్రోగిన నంద్యాల పట్టణం
-
‘యూజ్లెస్ ఫెలో’ అని బాబు తిట్టింది మర్చిపోయారా?
సాక్షి, కర్నూలు: అబ్దుల్ సలాం ఘటనపై తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధిత కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల తర్వాత నీచమైన ఆలోచనతో రాజకీయ లబ్ది కోసం టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు. టీడీపీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ రామచంద్రరావు ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించిన విషయం అందరికీ తెలుసునని, కానీ చంద్రబాబు నాయుడు, అచ్చెంనాయుడు, అఖిల ప్రియ, ఫారుక్ బెయిలు ఎలా వస్తుందంటూ గగ్గోలు పెట్టడటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇక గుంటూరులో ‘నారా హమారా టీడీపీ హమారా’ సభలో నంద్యాలకు చెందిన తొమ్మిది మంది యువకులు, బాబు ముస్లింలకు చేసిన అన్యాయం గురించి నిలదీస్తే, వారిపై దేశద్రోహం కేసు పెట్టించారని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే విధంగా ఆనాడు వారిపై కేసులు ఎందుకు పెడుతున్నారని అడగని టీడీపీ మాజీ మంత్రి ఫారుక్ ఈరోజు ఈ ఘటనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింలను ‘యూజ్లెస్ ఫెలో’ అని చంద్రబాబు నాయుడు అన్న మాటలు మర్చిపోయారా ఫారుక్ అంటూ చురకలు అంటించారు. 2017 నంద్యాల ఉప ఎన్నిక అనంతరం ఒకే కుటుంబంలోని 7 మంది ముస్లింలపై హత్య కేసు నమోదు చేయించింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నించారు.(చదవండి: చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా: కొడాలి నాని) ఆ హత్యకు కారణం టీడీపీకి చెందిన మనోహర్ గౌడ్! ‘‘గత నెలలో నంద్యాల పొన్నపురంలో దళిత న్యాయవాది సుబ్బరాయుడును దారుణంగా హత్య చేస్తే నోరుమెదపని టీడీపీ నాయకులు ఈ రోజు గొంతు పెంచి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆ హత్యకు కారణం టీడీపీకి చెందిన మనోహర్ గౌడ్ కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించలేదా?’’ అని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ‘‘అబ్దుల్ సలాం కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని మొదట హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బాధిత కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆ కుటుంబం ఆత్మహత్యకు కారకులైన సీఐ, హెడ్ కానిస్టేబుబుల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తే మీరేమో బెయిలు ఇప్పించారు. రాబందుల్లా వ్యవహరిస్తున్న మీరు తీరు సరికాదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెంనాయుడు వాళ్ల పార్టీ కార్యదర్శి న్యాయవాది రామచంద్రరావును పంపించి నిందితులకు బెయిల్ ఇప్పించడమే గాక ఎవరికి తెలియనట్టు బాధితులకు అన్యాయం జరిగిందని ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు’’ అంటూ టీడీపీ తీరును ఎండగట్టారు. . -
రూ. 25 లక్షలు స్వాహా!
నంద్యాలటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు, సిబ్బంది స్వాహాపర్వానికి పాల్పడినట్లు తెలిసింది. స్పెషల్ ఆఫీసర్ పాలన కావడంతో ఇష్టారాజ్యంగా బిల్లులను డ్రా చేశారు. మున్సిపల్ కార్యాలయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన అకౌంటెంట్ జనరల్ ఆడిట్లో రూ.25 లక్షలకుపైగా వ్యయానికి బిల్లులు, ఓచర్లు లేని విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ అక్రమాన్ని మేనేజ్ చేయడానికి సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికలు గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు గాను దాదాపు రూ.80 లక్షలను రిజర్వ్ చేస్తూ స్పెషల్ ఆఫీసర్ అనుమతి తీసుకున్నారు. కాని ఎన్నికల వ్యయానికి రూ.21 లక్షలను కేటాయించినట్లు తెలిసింది. కాని నిధులు సరిపోలేదని రూ.64 లక్షలు జనరల్ ఫండ్స్, ఇతర నపద్దుల నుంచి రూ.14 లక్షలు బదలాయించి, ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల వ్యయానికి సంబంధించిన రికార్డులు, సమాచారాన్ని సిబ్బంది గోప్యంగా దాచారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ సమాచార హక్కు చట్టం ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలను కోరగా, సిబ్బంది అసమగ్ర సమాచారాన్నిచ్చి, చేతులు దులుపుకున్నట్లు సమాచారం. వెలుగులోకి అక్రమాలు.. ఎన్నికల వ్యయంలో జరిగిన అక్రమాలు ఆడిట్లో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మూడు రోజుల క్రితం అకౌంటెంట్ జనరల్ కార్యాలయ సిబ్బంది 2011-12 నుంచి ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల వ్యయంలో పలు అక్రమాలు వెలుగు చూసినట్లు సమాచారం. స్టేషనరీ, భోజనాలు, సప్లయర్స్, పలు ఖర్చులకు సంబంధించి బిల్లులు, ఓచర్లు లేకుండానే డబ్బు డ్రా చేసినట్లు సమాచారం. స్పెషల్ ఆఫీసర్ అనుమతి ఉందనే సాకుతో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన జనరల్ ఫండ్స్ నుంచి రూ.64 లక్షలు, ఇతర ఖాతాల నుంచి రూ.14 లక్షలు డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఆడిట్లో ఈ అక్రమాలు బయట పడటంతో ఎన్నికల విధులను నిర్వహించిన సిబ్బంది వెన్నులో వణుకు మొదలైంది. నకిలీ బిల్లులను సృష్టించి పంపించుకోవడానికి, ఆడిట్ సిబ్బందిని మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ అక్రమాలకు సంబంధించిన వివరాలను ఆడిట్ అధికారులు వెల్లడించడం లేదు.